Saturday, June 12, 2021

హనుమ నేర్పిన నీతి...

హనుమ నేర్పిన నీతి...


సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా? ఎవరిని.. ఎలా అడగాలి? అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు.

సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు.

మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ!
దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.

ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ.
ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు..

మనం కూడా మన సందేహాన్ని ప్రశ్నను కూడా గొప్పగా అడగ గలగాలి..✍️

Source - Whatsapp Message

No comments:

Post a Comment