Tuesday, July 13, 2021

#తప్పులు......#ఒప్పులు

#తప్పులు......#ఒప్పులు

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం కూడా
తెలుసుకోవాలి అనుకున్నాడు .
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది .
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చేసింది. దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు .
.
ఏడుస్తూ తనకు ఆర్ట్ నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
అప్పుడు మాస్టారు అతడిని ఓదార్చి .....అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ క్రింద నేను పెట్టిన రంగులు , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసులో ఉంది .
.
విచ్చిత్రంగా వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
.
ఎందుకలా జరిగింది ? అనుకొంటూ అతను మళ్ళీ మాస్టార్ దగ్గరికెళ్ళి జరిగింది చెప్పడంతో ....
మాస్టారు అతనికి ఇలా చెప్పడం జరిగింది...
.
"ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం" అని. ....!!

👉 కాబట్టి ఒకరి జీవితాన్ని విమర్శించి, తప్పులు వెతగడం అందరికి చాలా తేలిక. కానీ అదే ఒకరి జీవితాన్ని సరిచేయడము మాత్రం చేతకాదు ఎవ్వరికి.
🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment