Thursday, September 16, 2021

అసలు ఆశీర్వచనం అంటే ఏమిటి? ఆశీర్వచనం అలా ఎందుకు చేయాలి? ఆశీర్వదించే సమయంలో అక్షింతలు ఎందుకు చల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి?

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

👌అసలు ఆశీర్వచనం అంటే ఏమిటి? ఆశీర్వచనం అలా ఎందుకు చేయాలి? ఆశీర్వదించే సమయంలో అక్షింతలు ఎందుకు చల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? ఇత్యాది విషయాలను ఇప్పుడు మనం తెలుసు కుందామా..👌

మన సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఆశీర్వచనానికి చాలా గొప్పదైన విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తూ ఉంటారు. చిన్నవారి శుభాలను కోరుకొంటూ పెద్దవారు ఇచ్చే దీవెనలనే ఆశీర్వాదాలు అంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వచనంతో ఆశీర్వదిస్తారు కాబట్టి దీనిని ఆశీర్వచనం అంటారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని అయితే దీర్ఘాయుష్మాన్ భవ అని, అదే చదువుకునే పిల్లల్ని సరస్వతీ కటాక్షాప్రాప్తిరస్తు అని ఇలా వయసును బట్టి, సమయానికి సందర్భానికి తగినట్లుగా ఆశీర్వచనాలు ఇస్తూ వుంటారు మన పెద్దలు..

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు "గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు " అనే ఆశీర్వచనంతో దేశాన్ని రాజుగారు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, దేశంలోని గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలనీ, పిల్లలు వున్న వారికి వంశాభివృధ్ధి చేసే మనవల్లు కలగాలనీ, ధనం లేని వారికి ధన సంపదలు కలగాలనీ, సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ విప్రులు అన్ని రకాల ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు.

అయితే ఈ ఆశీర్వచనాలకి అంత శక్తి ఉందా? అవి మనల్ని ప్రభావితం చేస్తాయా? అవి మనకు ఫలితాలను ఇస్తాయా? అంటే తప్పకుండా ఫలితాలను ఇస్తాయి. సత్ ప్రవర్తనతో సత్ ఫధంలో నడిచే వారికి సత్పురుషులు, గురువులూ చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. వారి దివ్య వాక్కులతో పలికే ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు కూడా తొలగి పోతాయి, అకాల మృత్యు దోషాలు కూడా తొలగి పోతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా హరించ బడతాయి. అయితే ఏ వయసు వారు ఏ వయసు వారిని ఆశీర్వదించవచ్చు. తక్కువ వయసున్న వారు ఎక్కువ వయసున్న వారిని ఆశీర్వదించవచ్చా అనేదానికి వారు గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు అయిఉంటే అలాంటి వారు మనకన్నా చిన్నవారైనా సరే వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం మనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని జ్ణానానికి, సరస్వతి మాతకు..

అక్షింతల గురించి.. వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా శిశువు జన్మించి నప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభ సందర్బంలోనూ ఆశీర్వదించు నప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఉన్న సంబంధం ఏమిటి? పసుపుతో కలిపిన బియ్యాన్ని అక్షింతలు అని ఎందుకు అనాలి? వాటినే ఎందుకు చల్లాలి? అక్షింతలు కలపడానికి వేరే ధాన్యాలు చాలా రకాలు వున్నాయికదా వాటిని చల్ల వచ్చుకదా? మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? అనేదాన్ని పరిశీలిస్తే.. బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనం ఇతరులకు మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి ఇది చిహ్నం అన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపును కలిపిన అక్షింతలను మంత్ర పూర్వకంగా తలమీద చల్లుతారు.

మంత్రం అంటే క్షయం లేనటు వంటిది అని అర్థం. 'అ ' కారంనుంచి 'క్ష 'కారం దాకా వున్న అక్షరాలు బీజాక్షరాలతో కూడిన మంత్రశక్తిని కలిగి వుంటుంది. మంత్రాన్ని పలికేటప్పుడు ఆ మంత్రశక్తి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందుతారని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది. మనం చేసే పూజలు, శుభ కార్యాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో “అక్షతాన్ సమర్పయామి ” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం.

పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవు వరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు. మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించి నట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తాయి. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం మనకు ఉంది. బియ్యంలో తగినంత పసుపు, నాలుగు చుక్కలు నెయ్యివేసి కలిపి అక్షతలను తయారు చేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమౌతాయి..
🤘లోకాసమస్తా సుఖినోభవన్తు🤘
🤘సర్వే జనా సుఖినోభవంతు 👌ధర్మో రక్షతి రక్షతః సుదర్శన్ ఫైర్ సేఫ్టీ 👌

Source - Whatsapp Message

No comments:

Post a Comment