Thursday, September 16, 2021

వృద్ధాశ్రమానికి వెళ్ళవలసిన వారే

అయితే మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళవలసిన వారే
.
వృద్ధులైన భార్య భర్తలు వృద్ధాశ్రమానికి వెళుతున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని ఒక వ్యక్తి అడిగాడు దారిలో

వృద్ధాశ్రమానికి వెళ్తున్నాము అని సమాధానమిచ్చారు
ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు
మా కొడుకు మా కోడలు వెళ్లగొట్టారు అని సమాధానం ఇచ్చారు

పెద్దాయనని అడిగాడు ఆ వ్యక్తి
మీ కొడుకుకు మీరు ఏం నేర్పారు సంస్కారం అని

ఆయన అన్నాడు
లావాదేవీలు
లాభనష్టాలు నేర్పాను అని సమాధానమిచ్చాడు

అలాగే వృద్ధురాలైన ఆమెని అడిగాడు
మీ కోడలు ఎంత కట్నం తీసుకొని వచ్చింది అని
ఆమె సమాధానం మా ఊరిలో అందరి కంటే మా కోడలు ఎక్కువ కట్నం తీసుకువచ్చింది అని సమాధానం చెప్పింది

అయితే మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళవలసిందే అని అన్నాడు ఆ వ్యక్తి

ఆ ఇద్దరు వృద్ధులు ఒకేసారి ఎందుకలా మాట్లాడుతున్నావు నాయనా అన్నారు

ఏం లేదు తండ్రి అయి ఉండి కొడుకుకు
బంధాలు
అనుబంధాలు
ప్రేమలు
విలువలు నేర్పాలి అవి నేర్పక
డబ్బు లావాదేవీలు లాభనష్టాలు నేర్పావు
కనుక అది మీమిదనే ప్రయోగించాడు

వృద్ధురాలితో ఇక మీరు
మంచి గుణవంతురాలుని
మంచి మనసు ఉన్న కోడలిని తీసుకురావాలి
మీరు ఊరిలో అందరి కంటే గొప్పగా ఉండాలని కట్నం ఎక్కువ కావాలని ఏరి కోరి తెచ్చుకున్నారు
కనుక మీరు ఇద్దరు వృద్ధాశ్రమానికి వెళ్ళవలసిందే అని చెప్పాడు
అప్పుడు ఆ వృద్ధులు తల దించుకున్నారు సిగ్గుతో
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment