Wednesday, December 15, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అంతస్తులున్నాయనిఅహం పెరిగినట్టనిపిస్తే
స్మశానాన్ని ప్రదక్షిణ చేసి
సమాధులు చూసిరండి
కుదిరితే పోయినోడు
ఏమి తీసుకెళ్ళాడో
ఓ సారి అడిగి చూడండి

ఎప్పుడైనా మీకు
పరమాత్ముని మీద
ప్రేమనేది కలిగితే
ఆకలితో ఉన్నవాడికి
మీ చేతులతో అన్నం పెట్టండి
కడుపునిండా దీవెనలతో
మీ ఆత్మ సంతోషిస్తుంది చూడండి

ఎప్పుడైనా మీలో దాగిన రాక్షసుడు
నిద్రలేచి వికటాట్టహాసం చేస్తే
వాడిని ముక్కలుగా నరికేసి
సగర్వంగా తలెత్తుకొని నిలబడండి

ఎప్పుడైనా మీకు కొవ్వు పెరిగి
కండ బలంతో పొగరెక్కితే
ఏదైనా ఒక వృద్దాశ్రమానికెళ్లి
ఓ పూట నిశ్చలంగా గడపండి
సత్తువ తగ్గిన వారు కాటి వైపు
నడుస్తుంటారు చూడండి

జీవితమంటే ఏమిటో
బతుకంటే అర్థ మేమిటో
అవగతం చేసుకోండి...
అదే జీవిత పరమార్థం

అందుకే....
మన ప్రవర్తనే మన దిక్సూచని
తెలుసుకొని మసులుకోండి...*

మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment