Saturday, January 1, 2022

మంచి *మాట*... లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురుదేవుల ఆశీస్సులతో మీరు మీ కుటుంబగసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఒక క్షమాపణ.. బంధాలను దూరం కాకుండా చూస్తుంది.. ఒక కటువు మాట బంధాలను దూరం చేస్తుంది.. మాట్లాడే ముందే ఆలోచన చేద్దాం..
గురు వారం --: 30-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకోవడం మొదలు పేడతారు డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడూ సహాయం కాదు, మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయం చేయవచ్చు .

గెలిస్తే భూజాన మోసేవారు ఓడితే వదిలేసేవారు మన చుట్టు చాలా మందే వుంటారు మనమే అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి ఎదైన సాధించే వారికి కోరిక మాత్రమే ఉంటుంది ఎవరినైన విమర్శించే వారికి చాలా తీరిక ఉంటుంది .

అహంకారం గర్వం పొగరు నా దృష్టిలో చాలా ఖరీదైనవి నాకు వాటిని కొనుక్కునే స్థోమత లేదు అందుకే చవగ్గా దొరికే సంతోషం ప్రేమ చిరునవ్వు ఆప్యాయత లతో సర్దుకుపోవడం అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నాను ,

ఆత్మవిశ్వాసానికి లోటులేక భయానికి నీవు భయపడక కష్టానికి నీవు వెరవకపోతే గెలుపు నీ గమ్మం ముంగిట సదా తచ్చట్లాడుతంది , నీవు గర్వంతో ఉండవద్దు అలా ఉంటే నీ సన్నితులను కోల్పోతావు ఈర్ష్యతో ఉండవదు స్నేహితులను కోల్పోతావు కోపంతో అసలే ఉండవద్దు ఆఖరికి నిన్ను నువ్వే కోల్పోతావు .

సేకరణ ✒️ *మీ ...ఆత్మీయబందువు.. AVB సుబ్బారావు 🤝🚩

సేకరణ

No comments:

Post a Comment