దివ్య సందేశం
.
** ఆ నేను - నాది యనుటయే అజ్ఞానం, హే పరమేశ్వరా ! నీవు - నీది యునుటయే జ్ఞానం. తలంపుల సహనమే మనస్సు నేను అను ప్రథమ తలంపు అన్ని తలంపులకు ఆధారమై వున్నది. ఈ నేను అను తలంపును పోగొట్టితే అన్ని తలంపులు అదృశ్యమౌతాయి. నీవు బాహ్య విషయాలను స్మరిస్తున్నంత కాలము మనస్సు వుంటుంది. కనుక నీవు లోచూపుతో ఈ నేను పై దృష్టిని నిలిపితే మనస్సు పని
చేయటం ఆగిపోతుంది.
** ప్రతినిత్యము స్థూల శరీరమునకు ఉదయము దంతదావనము స్నానముతో పరిశుభ్రముగా చేయుటకై శ్రమయని భావించకుండా చలిని చూడకుండ చేయుచున్నాము. అట్లే సూక్ష్మ శరీరానికి భక్తియనె నీరు,
జ్ఞానమనే సబ్బు, కర్మఅనే క్రియ. వీటి ద్వార ధ్యానం చేయడమువలన అంత:కరణ శుద్ధి కలుగుతుంది. దానిచే మనస్సుకు శాంతి ఆనందం లభిస్తుంది.
** సమస్త వాంఛల యొక్క త్యాగమే తపస్సు. వాసనలను జయించుటయే శౌర్యము, పరబ్రహ్మ విచారము చేయుటయే సత్యము, శ్రేష్ఠధనమే ధర్మం, మోక్షతత్వమును దెలిసినవాడే పండితుడు, సిద్ధాంతములను జీవనమునకు తెచ్చుకొనిన వాడే జ్ఞాని, అహంభావము కలిగిన వాడే మూర్ఖుడు, మాయకు ఆధీనమైన వాడే జీవుడు, సంతోషము గల గుణసంపన్నుడగు పురుషుడే యదార్థమైన ధనవంతుడు, సంతోషము లేని వాడే భీదవాడు, ఇంద్రియములను స్వాధీనము చేసుకొనినవాడే ఈశ్వరుడు, అంత శత్రువులను జయించినవాడే వీరుడు, నింద వలన బాధ జెందని వాడే నిజమైన భక్తుడు.
**కలౌ స్మరణాన్ ముక్తి: కృతాయుగములో - తపస్సు, త్రేతాయుగములో - యజ్ఞయాగాలు, ద్వాపరయుగములో - ధ్యానం, కలియుగములో - దైవనామస్మరణతోనే ముక్తికి మార్గం. శ్రమలేనిది, సులభమైనది, అనంత ఫలితం భగవంతుని నామస్మరణం. నామమే- నావ, నావికుడే - భగవంతుడు, సంసారమే - మహాసముద్రము, భక్తి (ప్రేమ) అనే మూల్యాన్ని చెల్లించితే భగవంతుడు జనన మరణమనే సంసార సముద్రము నుండి దాటించి మోక్షమనే గమ్యము చేర్చును.
.
.
No comments:
Post a Comment