Sunday, February 13, 2022

నేటి జీవిత సత్యం. *జీవితంలో లేటుగా నేర్చుకునే పాఠాలు ఇవే*..!

నేటి జీవిత సత్యం.

జీవితంలో లేటుగా నేర్చుకునే పాఠాలు ఇవే..!

చ‌దువు పాఠం చెప్పి ప‌రీక్ష‌లు పెడుతుంది. అదే ఏ జీవితం ప‌రీక్ష‌లు పెట్టి పాఠాలు నేర్పుతుంది... వాట్సాప్ లో వైర‌ల్ అయ్యే త‌ర‌హా సందేశం ఇది. ఇలాంటి కొటేష‌న్ల‌ను కామెడీగా తీసుకున్నా... ఇది మాత్రం చాలా డెప్త్ ఉన్న కొటేష‌నే. ఇవే కాదు.. మ‌హామ‌హుల చేత చెప్ప‌బ‌డిన ర‌క‌ర‌కాల కొటేష‌న్లు కూడా జీవితంలో అంతా అయిపోయాకా వారు ప్ర‌వ‌చించిన‌వే!

జ‌ర‌గాల్సిందంతా జ‌రిగిపోయిన త‌ర్వాతే.. ఆ అనుభ‌వం నుంచి వారు కొటేష‌న్లు, సూక్తులు చెప్పి ఉంటార‌నుకోవాలి! ఇలాంటి అనుభ‌వాలు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటాయి. క‌దిలిస్తే.. ప్ర‌తి ఒక్క‌రూ ర‌క‌ర‌కాల కొటేష‌న్లు చెప్ప‌గ‌ల‌రు. తాము చేసిన త‌ప్పులేమిటో వారికి ఎరుక అయి ఉంటాయి కాబ‌ట్టి.. ప‌క్క వారికి త‌మ అనుభ‌వాల సారం నుంచి బోధించ‌గ‌ల‌రు.

మ‌నిషి త‌న జీవితంలో చాలా లేటుగా నేర్చుకునే పాఠాల‌ను ఒక‌సారి ప్ర‌స్తావించుకోవ‌చ్చు. ఫ‌లితంగా.. ఈ త‌ప్పుల‌ను ఇంకా చేసేయ‌ని వారికి, అవ‌కాశాలు ఇంకా మిగిలి ఉన్న వారికి ఇవి ప‌నికి వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు.
అప్పుడే క‌ష్ట‌ప‌డాల్సింది!

ఈ మాట చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు వేరే ర‌కంగా చెబుతూ ఉంటారు. క‌ష్ట‌ప‌డాల్సిన స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డితే ఆ త‌ర్వాత జీవితాంతం క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చాలా మంది విజ్ఞ‌త ఉన్న త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు చెబుతూ ఉంటారు.

క‌ష్ట‌ప‌డ‌టం అంటే.. ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌దువుకోవ‌డం. చ‌దువుకునే వ‌య‌సులో క‌ష్ట‌ప‌డో, ఇష్ట‌ప‌డో చ‌దువుకుంటే.. ఆ త‌ర్వాత జీవితంలో స్థిర‌ప‌డ‌టానికి అవ‌కాశాలు క‌చ్చితంగా మెరుగ్గా ఉంటాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం చ‌దువు అనే కాదు.. ఏ విష‌యంలో అయినా స‌రైన స‌మ‌యంలో సరిగా వ్య‌వ‌హ‌రిస్తే, ఆ త‌ర్వాత తాపీగా ఉండ‌టానికి అవ‌కాశం ఉంటుంది.

నేటి ప‌నిని నిన్న‌నే పూర్తి చేయ‌డం, రేప‌టి ప‌నిని నేడే పూర్తి చేసుకుని ఉండ‌టం... ఒక‌ర‌క‌మైన ఆత్మ‌విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. కెరీర్ విష‌యంలో పూర్తి సంతృప్తితో లేని చాలా మందిని క‌దిలిస్తే వారు చెప్పేమాట‌.. చ‌దువుకోవాల్సిన స‌మ‌యంలో తాము స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే చెబ‌తారు కూడా!

భ‌యాన్ని వ‌ద‌లాల్సింది!
కెరీర్ లోనో, వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్ట‌డంలోనో.. దేని విష‌యంలో అయినా భ‌య‌ప‌డ‌టం మొద‌లుపెడితే, ఆ భ‌యం శ‌క్తినంతా హ‌రించి వేస్తుంది. ఫ్ర‌స్ట్రేష‌న్ ను పెంచుతుంది. స్థూలంగా ఆ ప‌నిమీదే విముఖ‌త‌ను పెంచుతుంది. మ‌రి ఇదంతా జ‌ర‌గ‌కూడ‌దంటే.. భ‌యాన్ని వ‌ద‌లాల్సింద‌ని చాలా మంది అనుకుంటారు.

తాము మొద‌ట‌ల్లోనే ఆ దిశ‌గా కృషి చేసి ఉంటే.. ఆ వృత్తిలో తాము మ‌స్టార్ అయి ఉండేవాళ్ల‌మ‌ని తీరిగ్గా చింతిస్తూ ఉంటారు.

ప్రాక్టీస్ చేయాల్సింది!

ప్రాక్టీస్ మేక్స్ యూ ప‌ర్ఫెక్ట్ అని మ‌రోసూక్తి త‌ర‌చూ వింటూ ఉంటాం. అయితే పాటించ‌డంలో మాత్రం అల‌స‌త్వాన్ని వ‌హిస్తూ ఉండ‌వ‌చ్చు. ఏ విష‌యంలో అయినా ప‌ర్ఫెక్ష‌న్ రావాలంటే ప్రాక్టీస్ త‌ప్ప మ‌రో మార్గం ఉండ‌దు. థియ‌రీలు తెలిసినా.. ప్రాక్టీస్ లేక‌పోవ‌డంతో ఫెయిలయ్యే వాళ్లూ ఉంటారు. వారు అయ్యే రియ‌లైజేష‌ణ్.. ప్రాక్టీస్ చేయాల్సింద‌నేది!

కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రావాల్సింది!

జీవితంలో ఒక ద‌శ‌కు వెళ్లాకా కెరీర్ ఒక కంఫ‌ర్ట్ జోన్ ను క‌ల్పించ‌వ‌చ్చు. అయితే.. ఆ జోన్ లో మ‌రీ రిలాక్స్అయితే మాత్రం ఆ త‌ర్వాత కెరీర్ ఎదుగుద‌ల ఆగిపోవ‌చ్చు. అనుభ‌వాలే పెద్ద పాఠాలు. అనుభ‌వ‌మే అత్యంత గొప్ప‌ది. ఆ అనుభ‌వం కావాలంటే మాత్రం కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం త‌ప్ప మ‌రో ఛాయిస్ ఉండ‌దు!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment