ఈ పుడమిపై పుట్టిన ప్రతి మనిషికీ అనుక్షణం అవసరాలెన్నో ఉంటాయి. బతుకు గడవాలంటే తిండి కావాలి. కట్టుకునేందుకు బట్టలు కావాలి. నివసించడానికి ఇల్లు కావాలి. ధన సంపాదనకు వృత్తులు, ఉద్యోగాలు కావాలి. ఆనందంగా ఉండటానికి ఇంకెన్నో కావాలి.
మనిషికి కోరికలు బలాలే కాదు, బలహీనతలు కూడా. మనిషి అవసరాలు ప్రాధాన్యాన్నిబట్టి మారుతుంటాయి. ఏది అత్యవసరమో దానికోసం మనిషి తహతహలాడుతుంటాడు. పరితపిస్తుంటాడు. మానవ ప్రయత్నంతో సాధ్యం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించడం మానవ స్వభావం. ఇంటిలో ఉన్న దేవతలను ఆరాధించడమే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం, పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయడం, దానాలు చేయడం పరిపాటి. మనిషి దైవదర్శనం చేసుకొనే సమయంలో తన కోరికల చిట్టాను భగవంతుడికి నివేదించుకుంటాడు. అవన్నీ సమకూరిస్తే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటానని, కానుకలు సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు. కోరికలు న్యాయమైనవే కావాలన్న నిబంధన ఏమీ లేదు కనుక అన్యాయార్జితాలకోసం మొక్కుకునేవారూ కనిపిస్తారు. ఉదాహరణకు ఒక దొంగ తనకు దొంగతనంలో అపారంగా ధనం లభిస్తే, అందులో కొంత హుండీలో వేస్తానని వాగ్దానం చేస్తాడు. అక్రమార్జనలో పుష్కలంగా ధనం లభిస్తే భూరి విరాళం ఇస్తానని మరొక వ్యక్తి కోరుకుంటాడు. ఎవరి బాధలు వారివి. ఎవరి కోరికలు వారివి. ఏ కోరికనూ కోరని భక్తులూ ఉండవచ్చు. అలాంటి వారిది నిష్కామ భక్తి.
కోరికలు ఉండటం, లేకపోవడం వ్యక్తిగతాంశం. కోట్లకు పడగలెత్తిన కుబేరులకూ అపారంగా కోరికలు పుడుతూనే ఉండవచ్చు. పూటకు గతిలేని నిరుపేదకు ఏ కోరికలూ లేకపోవచ్చు. కోరికలు మనిషిని బంధిస్తాయని మహర్షుల వాక్కు. ఒక కోరిక మరో కోరికను పుట్టిస్తుంది. కోరికలు కడలి కెరటాల్లాంటివి. ఒక కెరటం తీరాన్ని తాకి నశించగానే, మరో కెరటం వస్తూనే ఉంటుంది. కెరటాలకు అంతం లేనట్లే కోరికలకూ అంతం లేదు.
మనిషిని సృష్టించిన భగవంతుడికి మనిషి మనసులో ఏముందో తెలియదా అని ప్రశ్నించేవాళ్లూ ఉంటారు. మనిషి స్వభావం దేవుణ్ని అడిగేట్టుగా చేస్తుంది. ప్రాథమికావసరాల కోసం కొందరు దేవుణ్ని ప్రార్థిస్తారు. అవి తీరగానే విలాసాలు కోరుకుంటారు. వాటికి అంతులేదు. ఎన్ని ఉన్నా, ఇంకా ఏవో కావాలనిపిస్తుంది. కోరికలను ఏదో ఒక దశలో నియంత్రించకపోతే అశాంతి మిగులుతుందనడంలో సందేహం లేదు. పూర్వం యయాతి వంటి చక్రవర్తులుసైతం కోరికల అగ్నిజ్వాలలకు ప్రభావితులై, చివరిదశలో వాటిని వదిలేసిన కథలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి. ఎడతెగని కోరికలు జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి. సుఖంగా బతుకు గడవడానికి సరిపోయేంతటి కోరికలు అభిలషణీయాలేకానీ, గగనకుసుమాల వంటి అసాధ్యమైన కోరికలు వాంఛనీయాలు కావు.
కోరికల చిట్టాను దేవుడికి సమర్పించే ముందు వాటిని తీర్చుకోవడానికి మనిషి తన ప్రయత్నాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆచరించాడో తెలుసుకోవాలి. ప్రయత్నించే మనిషికే దేవుడి సహాయం లభిస్తుందని నీతికారులంటారు. కనుక మనిషి భగవంతుడి ముందు కోరికల జాబితాను సమర్పించిన తరవాత, తాను ఆ కోరికల సాధనకు తగిన కృషి చేయాలనే విషయాన్ని మరువరాదు.
గౌతమ బుద్ధుడు 'ఆశలేనితనం' గురించి మాట్లాడారు అని సాధారణంగా అంటుంటారు. ఆయన 'ఆశలేనితనం' అని అన్నప్పుడు జనాలు కోరికలు లేకుండా బ్రతకగలరు అని అనుకునే మూర్ఖుడు కాదు ఆయన. కోరిక లేకుండా మనుగడే లేదు అనేది ఆయనకు తెలుసు. ఆశలేనితనంగా ఉండాలి అని మీరు అనుకునేది కూడా ఒక పెద్ద కోరికే.
కోరికలు లేకపోవటం అంటే అర్ధం మీ కోరికలతో మీకు ఎటువంటి గుర్తింపు లేదనే. అప్పుడు కోరికలు కేవలం మీరు ఆడుకునే వస్తువులు మాత్రమే. కోరిక లేకుండా అస్సలు ఆటే లేదు. కానీ ఇప్పుడు ఈ కోరికలు ఇక మీ గురించి కాదు. ఈ క్షణానికి, ఈ పరిస్థితికి అనుగుణంగా అవి ఉంటాయి. ఏది ఎలా ఉండాలో అలా ఉంది. దాని గురించి మీరు ఏమి చేయగలుగుతారో అది మీరు చేస్తారు. మీరు అన్నిటిలో ఎంతో లోతుగా నిమగ్నమవ్వవచ్చు కానీ మీరు ఇక దేనితో గుర్తించబడరు.
ఈ అవగాహన ఒకసారి వస్తే, ఈ కోణంలో మీరు కోరికలు లేని వారు అయితే ఆ వ్యక్తికి కర్మబంధం ఉండదు. వారు ఒక యుద్ధం చేసినా కూడా వారికి కర్మ ఉండదు ఎందుకంటే వారికి అటువంటిది ఏదైనా చేయాలని కోరిక లేదు. అది దేని మీద అయినా వారి ప్రేమనుంచో ద్వేషాన్నుంచో వచ్చేది కాదు. అది అలా జరగటానికి కారణం ఏమిటంటే ఉన్న మార్గం అదే కనుక.
మీ కోరికలతో,ఆశలతో పోరాడటానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. మీరు ఎంత ఎక్కువగా పోరాడితే అవి అంత ఎక్కువగా వస్తాయి. పురాణాలలో, 'ఒక అసురుడిని చంపేటప్పుడు ఒక బొట్టు రక్తం నేల మీద పడితే, దానిలో నుంచి ఒక వెయ్యి మంది అసురులు పుడతారు' అని చెప్తారు. మీ ఆశలు, కోరికలూ అటువంటివే. మీరు ప్రయత్నం చేసి పోరాడితే, వాటిని నరికేస్తే అవి రక్తాన్ని చిందిస్తాయి. ఒక్కో చుక్కకూ ఒక వెయ్యి కోరికలు, ఆశలు పుడతాయి. వాటితో పోరాడటం పనికి రానిది, దాని వల్ల మీ జీవితం వృధా అవుతుంది. మీరు వాటితో ఎప్పటికీ పోరాడలేరు. మీ కోరికలను, ఆశలను సరైన దిశలో వెళ్ళేటట్లు మీరు శిక్షణ ఇవ్వాలి అంతే.
మీకు కోపం వస్తే దాన్ని మీరు ఉత్తమమైనది అనుకునే దాని వైపుకు మరల్చండి. మీ ఆశలను పెరగనివ్వండి.మీ కోరికలు, మీ ఆశలు అన్నీ కూడా కేవలం సాధారణమైన శక్తి మాత్రమే. వాటిని కోరికలుగా లేక భయాలుగా లేక కోపంగా లేక మరొకటిగా చేస్తుంది మీరే. బహుశా ఇప్పుడు అవి మీ చేతుల్లో లేవేమో. బహుశా ఇప్పుడు మీకు ఆ అవగాహన లేదేమో. కానీ వాటిని అలా చేస్తుంది మాత్రం మీరే. భావాలు ఏవైనా, మీ కోరికల స్వభావం ఏదైనా, అదంతా మీరు మీ జీవితంలో ఇంకా లోతుగా పాతుకుపోవాలి అని మీ జీవ శక్తి చేసే ప్రయత్నం మాత్రమే. మీ జీవ శక్తి మీ జీవితానుభవాన్ని మరింత పెంచటానికే ప్రయత్నిస్తుంది. అది ఈ ప్రపంచంలోని బాహ్యమైన వాటిపై దృష్టి పెడితే, ఎప్పుడైతే ఎవరైనా లేక ఏదైనా దాన్ని పూర్తిచేయటంలో అడ్డుపడితే మీరు బాధపడతారు. అదే ఒకే ఒక్క దిశలో దృష్టిపెడితే, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. కనుక మీరు కోరుకునేటప్పుడు జీవితంలోని అత్యుత్తమమైన దాన్నే కోరుకోండి. మీరు కోపంగా ఉన్నపుడు ప్రేమగా ఉండలేకపోవచ్చు. మీరు కోపాన్ని వెంటనే ప్రేమగా మార్చలేకపోవచ్చు, కానీ మీరు మీ కోపాన్నే ఒక దిశలోకి మరల్చవచ్చు. మీకు కోపం వస్తే మీరు ఉన్నతమైనదిగా అనుకునేదాని వైపు దాన్నీ తిప్పండి. మీ కోరికలను పెరగనివ్వండి. వాటిని ఒక దిశలో పెట్టటం మీ చేతిలోనే ఉంది.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment