Monday, March 14, 2022

బద్ధకం - సోమరితనం

బద్ధకం- సోమరితనం
బద్ధకం మానవుని శత్రువు .
సరిపడా విశ్రాంతి పొందిన తర్వాత, చేయగలిగి కూడా చేయకపోవడం బద్ధకం. బద్ధకం ఉన్నవాడు అందరి విమర్శలు చివాట్లు ఎదుర్కోవలసి వస్తుంది. బద్ధకం ఉన్నవాడు పనులు వాయిదాలు వేస్తూ నే ఉంటాడు. చివరకు ఏది చేయలేడు. ఏమి చేయలేడు.
బద్ధకం ఉన్న వాడు చేయాలనుకున్నా చేయలేడు. చెయ్యడు. లేవాలనుకున్న ,లేవడు. వెళ్లాలనుకున్నా, వెళ్ళడు. బద్ధకం వల్ల మానవుడు విలువైన సమయాన్ని ఎంతో నష్టపోతున్నాడు. చేయగలిగిన పనులు చేయలేక,సాధించవలసినవి, సాధించలేకపోతున్నాడు. ఒక మంచి పని చేయాలనుకుంటాడు కానీచెయ్యడు. పనికిమాలిన పనులు చేస్తూ, టీవీలు గంటలు గంటలు,చూస్తూ , గంటలు గంటలు, నిద్ర పోతూ ఉంటాడు. ఆనందమయ జీవితానికి బద్ధకం పరమ శత్రువు . బద్ధకం వల్ల సమస్యలు, రోగాలు..కష్టపడి, ఇష్టపడి, పని చేయడం అనేది నేర్చుకోకపోవడమే కూడా బద్ధకమే. బద్ధకస్తులు ఓటమి , కష్టపడే వాడు విజయాన్ని పొందుతారు. బద్ధకం పోవాలంటే ఆహార నియమాలు పాటిస్తూ ,ప్రతిరోజూ ధ్యానం చేయండి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment