270222f1842. 010322-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
అహంకారపు…తెర తీయాలి!
➖➖➖✍️
ఏది మన దృష్టిని అడ్డుకుంటుందో అదే తెర!
అది గుడ్డతెర కావచ్చు, మంచుతెర కావచ్చు... అలాంటిది ఇంకేదైనా కావచ్చు. కానీ అగుపించని తెరలు కొన్ని ఉంటాయి. అవి భావనాత్మకంగా ఉంటాయి. అలాంటివాటిలో అహంకారం అనే తెర ఒకటి.
ఆధిక్యతా భావాల కారణంగా అహంకారం ఆవహిస్తుంది.
కులంరీత్యా అగ్ర, నిమ్నమనే భేదాలు చూడటం అహంకారానికి సంకేతం. అన్నమయ్య ఈ దురహంకారాన్ని దూరం చేసుకోవాలని పిలుపునిచ్చాడు.
'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే' అంటూ మన దృష్టిని శిఖరాలవైపు... ఆ తిరుమలస్వామి ఆనందశిఖరాలవైపు తిప్పటానికి- అహరహం గోవింద గీతాలతో మన ఆత్మలకు అమృతస్నానాలు చేయిస్తూనే ఉన్నాడు.
కానీ, అహంకారపు పొరలు కరిగిపోవడంలేదు.
అవి పోతేగానీ- అంతర్యామి ఆనంద దర్శనం లభించదు.
అసలు మనం పరమాత్మకోసం ఎప్పుడైనా తపిస్తున్నామా, ఆయన దివ్యదర్శనం కోసం ఆరాటపడుతున్నామా?
వెంటనే 'లేదు లేద'ని మన మనసే మనకు నిజం చెప్పేస్తుంది.
ఏడాది చదివితేగానీ ఏ పరీక్షా రాయలేం. పరీక్షలో ఉత్తీర్ణత చెందితేగానీ మన అర్హతలు రుజువు కావు. ఆధ్యాత్మిక పరీక్షలూ అంతే. ఇక్కడ ప్రశ్నపత్రం వేరుగా ఉంటుంది. పరీక్షా ఫలితాలూ భిన్నంగా ఉంటాయి.
త్యాగం చేయాలనుకుంటే- దుర్లక్షణాలు త్యాగం చెయ్యాలి.
దానం చెయ్యాలనుకుంటే- ప్రేమను దానం చేయాలి
ఈ రెండు చర్యలూ మన ఆధ్యాత్మిక జీవితానికి అర్హతలు కలిగిస్తాయి. ఇక కష్టనష్టాలన్నీ పరీక్షలే! అవి దైవవిశ్వాసానికి పరీక్షలు.
సుఖంగా ఉన్నంతకాలం తలవని దేవుణ్ని, కష్టం కలగగానే- రాముడి బాణం దెబ్బకు కూలబడి మాయోపాయంతో రామా రామా అంటూ మారీచుడిలా ఆర్తనాదాలు చేస్తాడు మనిషి.
జీవితం ఒక మాయలేడి. దానిమీద మనసనే సీత భ్రమపడుతూ ఉంటుంది. రామబాణమే ఆధ్యాత్మిక జ్ఞానం. మాయ తొలగుతూ, మరో మాయను సృష్టించడమే 'లక్ష్మణా' అనే మాయకేక.
ప్రాపంచిక వాసనలనుంచీ నిష్క్రమించి, ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైనా, లౌకిక భావనలకు లోబడి ఉండటమే రెండో మాయ!
అవధూతలనిపించుకున్నవాళ్లు కూడా లౌకిక మోహవశులవడమే ఇందుకు తార్కాణం.
శరీర సన్యాసం కన్నా ఆత్మసన్యాసం ఉత్తమమైనది.
సన్యాసి వేషంతో వైరాగ్యం లభించదు. ఆత్మభావనకు కట్టుబడి ఉండటమే అసలు వైరాగ్యం. అందుకు యతివేషాల అవసరం ఉండదు.
ఆత్మ ఎప్పుడూ పరమాత్మతో అనుబంధానికి అర్రులుజాస్తూ ఉంటుంది. ఆయన దివ్యదర్శనానికి తపిస్తూ ఉంటుంది. కానీ, మాయతెరలు అడ్డుపడుతుంటాయి.
త్యాగరాజస్వామి తిరుమలస్వామిని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు తెరలు వేసి ఉన్నాయి. ఆయనది ఆత్మగానం గనక 'తెర తీయగరాదా- నాలో మత్సరమను తెర తీయగరాదా' అంటూ ఆర్తిగా ఆలపించగానే... స్వామి తక్షణం తెరలు జారవిడిచాడు.
మరి మన తెరలు ఎవరు తొలగిస్తారు? అవి ఇనుపతెరలు! మనలోని ఆర్తి పరిపక్వమైతే మనం నమ్మిన దేవుడే ఆ పనిచేస్తాడు. ఆ లోపల అహంకారపు తెరలు మనమే తొలగించుకోవాలి!✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సేకరణ

No comments:
Post a Comment