పశ్చాత్తాపం!
----------------------
నొప్పించాను కదూ నిన్ను?
నాకు తెలుసు,
నీ కళ్ళలో ఆ నీళ్లు,
నిన్ను బాధపెట్టినందుకని కాదు,
నాకు కోపం తెప్పించావని నీ దుఃఖం!
నేను కోపంతో తినడం పైన అలుగుతానని,
నాకు నిద్ర పట్టదని,
అంతా నా గురించే నీ దుఃఖం!
హూ... నాకది తోచదు,
ఎన్నటికీ అర్థం కాదు,
నా అహాన్ని గాయపరచావని అరుస్తాను,
నువ్వు తెలివితక్కువదానివని కోపగిస్తాను,
అవును,తెలివితక్కువదానివే,
నిన్ను గాయపరిచానని కాదు కదూ నీ బాధ,
నాకు కోపం తెప్పించావని కదూ నీ దుఃఖం!
అవును,నిన్ను నేను ప్రేమించాను,
అప్పుడు నీ మాటలు అమాయకత్వపు స్వచ్చదనం అనేవాణ్ణి,
ఇప్పుడవి చిరాకు తెప్పిస్తున్నవి,
నాకు ఉన్నవి సమస్యలెన్నో,
వాటి చేతుల్లో నేను నిస్సహాయుణ్ణి,
కోపం నాకు ఎవరిమీదో తెలియదు,
అందుకే అగ్గి మీద గుగ్గిలంలా ఉంటాను,
మగాణ్ణి కదా,
ఆ అహం!
వట్టినే నీపై కోపగించుకుంటాను,
అసలు కోపం నాకు నామీదేనని నాకర్థం కాదు!
అవునూ,
నీకెప్పుడూ కోపం ఎందుకు రాదు?
పని చేసి అలసిపోయి,
ముఖాన చెమట పైట కొంగుతో తుడిచేసినట్టు,
అన్నీ తుడిచేసి,సన్నగా నవ్వుతావు!
నిన్ను నొప్పించాను కదూ?
నాకు తెలుసు,
కానీ నేను మగాణ్ణి కదూ,
నాకర్థం కాదు,
ఇంత సహనం నీకెలా ఉంటుందని!
అందుకే నీమీద మళ్లీ మళ్లీ కోపగించుకుంటాను,
అవునూ,
నిను నొప్పించాను కదూ!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
----------------------
నొప్పించాను కదూ నిన్ను?
నాకు తెలుసు,
నీ కళ్ళలో ఆ నీళ్లు,
నిన్ను బాధపెట్టినందుకని కాదు,
నాకు కోపం తెప్పించావని నీ దుఃఖం!
నేను కోపంతో తినడం పైన అలుగుతానని,
నాకు నిద్ర పట్టదని,
అంతా నా గురించే నీ దుఃఖం!
హూ... నాకది తోచదు,
ఎన్నటికీ అర్థం కాదు,
నా అహాన్ని గాయపరచావని అరుస్తాను,
నువ్వు తెలివితక్కువదానివని కోపగిస్తాను,
అవును,తెలివితక్కువదానివే,
నిన్ను గాయపరిచానని కాదు కదూ నీ బాధ,
నాకు కోపం తెప్పించావని కదూ నీ దుఃఖం!
అవును,నిన్ను నేను ప్రేమించాను,
అప్పుడు నీ మాటలు అమాయకత్వపు స్వచ్చదనం అనేవాణ్ణి,
ఇప్పుడవి చిరాకు తెప్పిస్తున్నవి,
నాకు ఉన్నవి సమస్యలెన్నో,
వాటి చేతుల్లో నేను నిస్సహాయుణ్ణి,
కోపం నాకు ఎవరిమీదో తెలియదు,
అందుకే అగ్గి మీద గుగ్గిలంలా ఉంటాను,
మగాణ్ణి కదా,
ఆ అహం!
వట్టినే నీపై కోపగించుకుంటాను,
అసలు కోపం నాకు నామీదేనని నాకర్థం కాదు!
అవునూ,
నీకెప్పుడూ కోపం ఎందుకు రాదు?
పని చేసి అలసిపోయి,
ముఖాన చెమట పైట కొంగుతో తుడిచేసినట్టు,
అన్నీ తుడిచేసి,సన్నగా నవ్వుతావు!
నిన్ను నొప్పించాను కదూ?
నాకు తెలుసు,
కానీ నేను మగాణ్ణి కదూ,
నాకర్థం కాదు,
ఇంత సహనం నీకెలా ఉంటుందని!
అందుకే నీమీద మళ్లీ మళ్లీ కోపగించుకుంటాను,
అవునూ,
నిను నొప్పించాను కదూ!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
No comments:
Post a Comment