🙏మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐
.........................
🙏భూమాత రాత నీదా
అందుకే ఓపికకు అర్థం మయ్యావు వనిత
ఆనాటి సీత గీత నీదా
అందుకే గృహనిలా ఉండాలి అంటారు వనిత
కురుక్షేత్రంలో కుంతీ ద్రౌపదిలా
తరతరాలనుండి ఎదకోత ఎందుకు నీకే ఓ వనిత
వారధి అయినా సారథి అయిన శ్రీరామచంద్రుడు అయినా నీ గర్భంలోనే జన్మించాలి కదా ఓ వనిత
లాలనలో పాలనలో సేవా సామర్థ్యంలో నీకు సాటి ఎవరూ
రారు కదా ఓ వనిత
అయినా ఈ సమాజంలో ఏదో ఒకచోట ఎందుకు నీకే ఏదో ఒక కొరత ఓ వనిత
అనునిత్యం ఏదో ఒక చోట నిన్ను అణిచే తత్వం ఎందుకు ఓ వనిత
అంతరాయాలు ,అడ్డంకులు ఆంక్షలు ఎన్నెన్నో నిన్నే అడ్డగిస్తూ ఉన్నా గంగ గోదావరి కావేరి నదిలా నీ ప్రవాహం అడ్డుకోవడం సాధ్యమా ఓ వనిత
పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానం కోసం నదుల లోనే నిన్నన్నవారే మునుగుతారు తెలుసా ఓవనిత
అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇంత అంధకారం
ఈ సమాజంలో ఎందుకింతదౌర్భాగ్యం
నీ పై ఇంత చిన్న తత్వం
ఇకనైనా మారాలి
మహిళని అమూల్యంగా చూడాలి విలువ ఇవ్వాలి ఆ విలువల్లో మన మనంఅందరూ ఉండాలి
మనదేశం పేరే భరత మాత కద ఓ వనితా
పేరులోనే భక్తి
ఆచరణలో కరువైంది ఆ ఆసక్తి ఓ వనిత
నీవే ఒక స్త్రీ శక్తి తెలుసా
ఓ వనిత !🙏
🙏మీ శివరాయ్✍️
(జర్నలిస్ట్)
No comments:
Post a Comment