Sunday, March 13, 2022

మంచి మాటలు

🍃🥀నీ కంటే లేనివారిని చూసి
ఎగతాళిగా నవ్వుకోకు!
ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకు,
ఎవరితోనూ ఏ విషయంలోను పోల్చుకోకు,
కుదిరితే కావలసినంత సంపాదించుకో..
లేకుంటే...ఉన్నవారితో సంతోషంగా బతకడం అలవాటు చేసుకో,
గ్యారంటీ వారంటీ లేని జీవితానికి,
పనికిమాలిన విషయాల గురించి బాధ పడుతూ,
సమయాన్ని వేస్ట్ చేసుకోకు..

నేను అతిగా నీతులు చెప్తున్నా అంటే,
నేను పెద్ద పవిత్రడిని అని కాదు.!
నేను ...ఒకప్పుడు జీవన గమనంలో కష్టపడ్డ వాడినే,
జీవితం నేర్పిన గుణపాఠాలే అన్ని..!
నాకు అందరూ నచ్చుతారు,
అయితే...నేను అందరికీ నచ్చాలనే రూల్ ఏమి లేదు.?
నాకు శత్రువులు ఎవరూ లేరు,
కానీ, నేను ఎవరికీ శత్రువు కాదన్న గ్యారెంటీ లేదు..

No comments:

Post a Comment