Sunday, March 20, 2022

ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం....

🍀🌺🍀

ఈ భూమికి మనం ఆరువు గా వచ్చాం కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువు గా మారిపోతాం ఈ మధ్యలో పరువు గా బతికేద్దాం , ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కాలం కంటే వేగంగా మనసులు మారే మనషుల మద్య మనం బ్రతుకుతున్నాం అందుకే ఎవరితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలి మనం .

జీవితంలో అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది దాని పేరే భవిష్యత్తు మనిషి జీవితం మేడిపండు లాంటిది మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి మనిషి జీవితం కూడా అంతే ఒకరి జీవితం మరోకరికి అందంగానే కనబడుతుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు .

మనం మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం బతికి ఉండటం ఒక అదృష్టం ముడి పడుతున్న బంధాలన్ని వరాలు ఎదురు పడుతున్న అడ్డంకులన్ని మనకు విలువైన పాఠాలు కష్టం గురించి చింతించకు ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయి .


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

No comments:

Post a Comment