Wednesday, March 2, 2022

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు.. విజ్ఞ నాయకుడు వినాయకుడు... వల్లీ దేవసేన సమేత తిరుత్తని సుబ్రమణ్య స్వామి...హరిహర పుత్రుడు శబరిగిరి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో
నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు
బుధవారం --: 02-03-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
అందమైన జీవితం కలలు కంటే రాదు కష్టపడితే వస్తుంది...మనం ఒకరికి మంచి వాళ్ళం ఇంకొకరికి చెడ్డ వాళ్ళం మరోకరికి ఏమీ కాము కూడా..ఇంకొకరికి అన్నీ మనమే అదే జీవితం

నీవు ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ అని తెలుసుకో మిత్రమా

అన్ని ఉన్నాయన్న అహంకారం వద్దు ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం మగువుల కేశాలను అలంకరించడానికో లేక గుడికో లేక ఇంకో చోటుకో అని .

ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే పూరి గుడిసెలో ఉన్నా ప్యాలెస్ లో ఉన్నవారి కన్నా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలం.. సంతృప్తి తో ఉన్నవారికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది.. ఆసంతృప్తి తో ఉన్నవారికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి...

పచ్చ నోటు ముందు గుడ్డివై పోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డిదైపోతూ ఉంది గుణం.. ఆస్తుల ముందు ఆవిరై పోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అనుకరణ .

మనం చేసే పనిలో మంచి కనపడాలి కాని మనిషి కనపడాల్సిన అవసరం లేదు

జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే మూడు పనులు చెయ్యాలి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి...ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి .

సేకరణ ✒️ మీ ...ఆత్మీయుడు AVB సుబ్బారావు 🤝💐🌹

సేకరణ

No comments:

Post a Comment