Thursday, April 14, 2022

మంచి మాట...లు (14-04-2022)

గురు శ్లోకః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥

దక్షిణామూర్తి స్తోత్రం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥


ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. పూజ్య గురుదేవులు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు.. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు.. గురు దత్తాత్రేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
14-04-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాటలు


.ఒకప్పుడు చిరిగిన దుస్తులను వేసుకోవడం అంటే పేదరికం..లేదా మానసిక వైకల్యం "కింద లెక్క.. వాటిని శుభ్రం చేసుకొని వేసుకోవటం నాటి నాగరికత ", చిరిగిన. చించిన దుస్తులను కొని మరీ వేసుకోవడం " నేటి నాగరికత ". 😄

మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో, ఆవేశం లో ఉన్న మనస్సుకు పరిష్కారం కూడా అలాగే కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది.

భయపడుతూ కూర్చుంటే బతకలేము, తప్పో ఒప్పో చేసి చూడండి, గెలుపు అయితే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తరువాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది.

ప్రతి ఒక్కరి మెదడులో మంచి - చెడు అనే రెండు కోళ్ల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఏది గెలుస్తుంది అంటే, మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే

సేకరణ ✒️AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment