Monday, April 25, 2022

నేటి మంచిమాట. కోపం,కష్టం,జీవితం- మూడూ మనవే కానీ...మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు!మనకు చెప్పి రావు!

నేటి మంచిమాట.

"కష్టం"మనకు మాత్రమే కనిపించే దెయ్యంలాంటిది!దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు! అదిగో...అక్కడుంది అని చూపించినా కనిపించదు! "కోపం" ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపంలాంటిది! ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు!అది చేసే నష్టం మాత్రం మాములుగా ఉండదు.
"జీవితం" ఒక రైలు ప్రయాణం లాంటిది!
మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది.ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే..మనకోసం ఎవరు అగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది! కోపం,కష్టం,జీవితం- మూడూ
మనవే కానీ...మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు!మనకు చెప్పి రావు!

క్షణం కుడా మనకు కలిసిరావు వాటంతట అవే వెళ్లిపోవాలి కానీ...ఎం చేసినా... ఎంత ప్రయత్నించినా...మనల్ని వదిలి వెళ్ళిపోవు...

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment