Monday, April 25, 2022

కవిత: శీర్షిక: ఈరోజు ఎందుకు ఈశిక్ష!!

శీర్షిక: "ఈరోజు ఎందుకు ఈశిక్ష!!
---------
ఈ రోజూ ఎందుకో
ఏమో తెలియదు
తెలియదు
ఎందుకో ఈ
శిక్షో తెలియదు
తెలియదు!!
నీ కోసం
నీ ప్రేమ కోసం
నీ మాట కోసం
నీ సొగసు కోసం
నీ చిరునవ్వు కోసం
కోటి కళ్లతో
ఎదురు చూస్తున్న
నాపై ఎందుకో ఏమో
అశ్రద్ధ..పైగా నాపై
ఎందుకో అలకా..
నాపై ఎందుకో
ఈ శిక్ష
ఓ ప్రియతమా
నా ప్రియ ప్రాణమా
ఎందుకే ఈ అలకా
కాస్త శాంతించుమా
నా ప్రియ ప్రాణమా!!
ప్రతిరోజూ
నీకోసం
పిచ్చివాడిలా తిరుగుతూ
ప్రతిరేయి దుఃఖిస్తూ
శిక్ష విధించిన వాడిలా
మాదనపడుతూ..
నా మనసు
ప్రతి సెకను
శిక్ష విధించబడుతూ
చేతులు కోసుకుంటూ
చేతులు కాల్చుకుంటూ
రాత్రుళ్లు నిద్రాహారాలు
లేకుండా
గుండె పగిలిపోతూ
కంటతడి పెట్టుకుంటూ
మోకాళ్లపై నిలుచుకుంటూ
గుంజీలు పెడుతూ
కాళ్ళు నెప్పి తగిలేలా
కళ్ళలో నుంచి
తెలియని దుఃఖంతో
శిక్షను భరిస్తూ
సహిస్తూ
తపిస్తూ
తరిస్తూ
మనసంతా
నిన్నే ప్రేమిస్తూ..
స్మరిస్తూ..
ద్యానిస్తూ..
నిన్నే కలవరిస్తున్న
నాపై ఎందుకు
ఈరోజు
ఇంత పెద్ద శిక్ష
ఓ నా గుంతలక్కడి
నా చిట్టి
రామచిలుక
నా బుజ్జమ్మీ
కొంచెం నా
బాధను..
నా భావనను...
ఆలకించవమ్మి
ఆలకించవమ్మి!!

★ప్రసాద్,జర్నలిస్ట్,9010971265★

సేకరణ

No comments:

Post a Comment