ఇంతేరా ఈ జీవితం...
💐💐💐💐💐💐💐
ఈమధ్య..పొద్దున్న తోచినప్పుడు లేచాక, కరచరవాణి లో వున్న ఇష్టదైవానికి దణ్ణం పెట్టుకుని, మిస్డు కాల్స్ వుంటే, వాళ్ళకి ఓ రింగు కొట్టి, కుశలప్రశ్నలు వేసి, ఉభయకుశలోపరిగా మాట్టాడుకున్నాక, ముఖ్యమైన వాట్సాప్ మెసేజిలు, ఫేస్ బుక్ పోస్టులు వున్నాయేమో చూసుకుని, అత్యవసరం అనుకున్న వాటికి జవాబులు ఇచ్చి, ప్రతిరోజూ... నాగా పెట్టకుండా, "వచ్చేటప్పుడు పట్టుకు రాలేదు - పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు" లాంటి సందేశాత్మక సూక్తి ముక్తావళితో పాటు, శుభోదయ సందేశాలు మాత్రమే పంపించే ఆప్తుల సందేశాలు చూడకుండానే డిలీట్ చేసేసి, ఏ వారం
ఏ దేవుడికిష్టమైనదో తెలియజేస్తూ, ఏడువారాల నగల్లాగ, ఆదివారం - సూన్నారాయణ మూర్తి, సోమవారం - సోమేశ్వరుడు లాంటి ఏడుగురు దేవుళ్ళ ఫోటోలూ పంపించి, అందరికీ షేర్ చెయ్యమని ఆదేశించే భక్త మిత్రుల పోస్టులు తీసేశాక, దేశంలో ఎక్కడెక్కడో జరుగుతున్న హింసాత్మక వీడియోలు, అకృత్యాల వివరాలు, మన జాతికి చరిత్రలో జరిగిపోయిన ఎన్నెన్నో అన్యాయాల చిట్టాలు, వేటినీ చూడకుండా - చదవకుండా తప్పించి, గేలరీలో వున్న ట్రాష్ ని ఖాళీ చేసుకుని, శుభ్రపరుచున్నాక, ఉదయ సంధ్యలో ఇంటిముందున్న చెత్తను తుడుచుకుని, కళ్ళాపి చల్లి, అందమైన ముగ్గేసుకున్నంత తృప్తి ఫీలయిపోయి, మంచం దిగడం అలవాటైపోయింది.
💐💐
ఇదివరకైతే, నిద్రలేవగానే, దేవుడి ఫోటోకి దణ్ణం పెట్టుకుని, వెంఠనే దినచర్యలకి ఉపక్రమించే అలవాటుండేది. వేడి వేడి కాఫీ తాగుతూ, పేపర్ తిరగేస్తూ, వార్తలు, విశేషాలు పరికిస్తూ, సినిమా బొమ్మలు, కార్టూన్ లు ఎంజాయ్ చేస్తూ, దేశ - విదేశ రాజకీయ పోకడలు గమనిస్తూ, అవన్నీ బుర్రలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడేవాళ్ళం.
టీవీ వార్తల సమయానికి వార్తలు చదివేవాళ్ళ అందం - చందం, కట్టూ - బొట్టూ, వేషం - భాష గమనిస్తూనే, వార్తల్ని ఆసక్తిగా వినేవాళ్ళం. వార్తాహరులు చెప్పేవన్నీ నిజాలని నమ్మేసిన అమాయకపు రోజులవి !
అన్నీ మంచివార్తలే చెబుతూ, దేశం ఎలా ముందుకు పరిగెడుతోందో చెప్పేవారు. మన నాయకులు, తెల్హటి బట్టలేసుకుని, మెళ్ళో పూలదండలేసుకుని, నవ్వుతూ,
రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్లు కత్తిరిస్తుంటే, చూసి, వాళ్ళ చేతుల్లో మన దేశం, సురక్షితంగా, సుభిక్షంగానే వుందని తృప్తిగా నిట్టూర్చేవాళ్ళం.
మన ఆరోగ్యమూ బాగానే వుండేది. వేళకి కాలకృత్యాలు జరిగిపోయి, ఆకలి, నిద్ర, ఆనందం బాగానే ఉండేవి. ఆంధ్రప్రభ పేపర్లో రావూరి భరద్వాజ గారు ప్రతిరోజూ రాసిన "ఆషామాషీ", "క్రిష్టిన్ కీలర్ హత్య కేసు" లాంటి డిటెక్టివ్ డైలీ సీరియల్స్ చదువుకుని, ఎంత ఆనందించామని !
యద్దనపూడి, కోడూరి, మాదిరెడ్డి, యండమూరి,
చందు సోంబాబు లాంటి వాళ్ళు మనకి వారపత్రికల్లో చేసిన సీరియళ్ళ 'ఎడిక్షన్' అలాంటిలాంటిదా ?
ఆ వారపత్రిక దొరక్కపోతే, ఆరోజంతా తిక్క తిక్కగా వుండేది. అవి చాలక, యువ, సితార, జ్యోతిచిత్ర, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలు, చందమామ, బాలమిత్ర, లాంటి కాలక్షేపం బఠాణీలు, బ్లిట్జ్,
ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లు ఉండనే ఉన్నాయ్ !
ఇంక ఇంటింటికీ సైకిల్ మీద తెచ్చిచ్చే అద్దె నవలలు,
డిటెక్టివ్ నవలల గురించి సరే సరి !
అవన్నీ చదువుతూనే...
మధ్య మధ్యలో వీధి గేటుకేసి ఓ కన్నేసి ఉంచేవాళ్ళం, పోస్టుమేను మనింటిముందు సైకిల్ కి స్టాండు వేసి,
మన ఉత్తరాల డబ్బాలో ఏవైనా వేసున్నాడా - లేదా
అని చూడ్డానికి !
'దసరా మామూలు ఇచ్చాంగా...రోజుకో ఉత్తరమైనా ఇవ్వద్దా?' అని మన భావన !
😊😊
💐💐
ఇంక ఆనాటి సినిమాలైతే...అబ్బో... ఆ దృశ్యాలు.. నాయనానందకరం...మాటలు...మనోహరం...
పాటలు..శ్రవణానందకరం !
ఎంచక్కా.... అప్పట్లోనే కేవీరెడ్డి, నాగిరెడ్డి, చక్కన్నలు కలిసి కూచుని కనిపెట్టిన డెస్కు టాపు కంప్యూటర్ లో సావిత్రికి...వీడియో కాల్ లో నాగేసర్రావు కనపడగానే, ఆవిడ ఆశ్చర్యానంద పడిపోతుంటే, మన నాగేసర్రావు, చొక్కా లేకపోయినా, వాటంగా - ఏటవాలుగా, ఒక ఓణీ లాంటి వల్లెవాటు వేసుకుని, చేతిలో బాణం వదలకుండా, ఓ మాంఛి రొమాంటిక్ లుక్కు ఇస్తూ, "నీవేనా నను తలచినది?" అని ప్రశ్నిస్తూ, ఒక పూలబాణం సావిత్రి వైపు సంధిస్తే, అదొచ్చి మనక్కూడా తగిలేది. ఈలోగా సావిత్రమ్మ, సిగ్గూ - అందం కలబోసి, 'అలాకాదు',
"నువ్వే నన్ను తల్చుకున్నావ్" అని నిగ్గదీస్తూ, ఒక చిన్న డాన్స్ కూడా చేస్తే, మనం ఏదో మూడ్ లోకి వెళ్ళిపోయి, మరేదో రసానుభూతి పొందేసి, మనదోవన మనం రిక్షాలో ఇంటికొచ్చేసినా, అదే రిక్షాలో, మనల్ని వదలకుండా, రసానుభూతి కూడా మనతోబాటు వచ్చేసి, పది రోజులపాటు అల్లరిపెట్టేది. వాళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి, అపురూపంగా దాచుకున్న డబ్బుల్ని తీసి, ఎన్నోసార్లు 'విజయా' వాళ్ళకిచ్చేశాం !
💐💐
ఈమధ్యకాలంలో...సినిమాలు ఎలా తీస్తారో,
నాయికా - నాయకులు ఏకాంతంగా యూరోపు కొండల్లో ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళ ఒళ్ళోకి ఒకళ్ళు ఒదిగిపోతుంటే, చుట్టూ ఎంతమంది వుంటారో చూపించేస్తుంటే,
"ఛీ... పాడు...అంతమందిముందు ఎలా ప్రేమించుకుంటారబ్బా?" అని మనం తెగ సిగ్గుపడిపోయి, 'అప్పట్లో... భార్యాభర్తలం కూడా... ఇంకొకళ్ళెదురుగా పక్కపక్కల్ని కూచుందుకు ఎందుకు, అంత ఇదైపోయేవాళ్ళం ?' అని బాధపడిపోతున్నాం !
😜😜
బహుశా ఇప్పటి సినిమా వాళ్ళు మన పక్కింటి వాళ్ళలాగే కనిపిస్తూ, వాళ్ళు కష్టపడి చేస్తున్నట్టు నటిస్తున్న డాన్స్ లు, ఫైట్ లు చెయ్యడం ఎంత సులువో తెలిసిపోతుంటే, ఆ థ్రిల్లు రావట్లేదు !
నాటి రసానుభూతులు...ఇంటిదాకా రావడం మాట దేవుడెరుగు... సినిమా హాల్లో కూడా కలగట్లేదు !
😢😢
💐💐
మార్పు సహజం కాబట్టి, అన్ని రంగాల్లోలాగే, మన జీవితాల్లోనూ, అలవాట్లలోను, ఆసక్తుల్లోనూ, మార్పులు వచ్చి, స్పీడు పెరిగిపోయి, టెక్నాలజీ సాయంతో అన్నిరకాల మాధ్యమాలు మనకి దగ్గరైపోయి, ఏది చూడాలో - ఏది చదవాలో - ఏది వినాలో, ఏది నమ్మాలో - ఏది నమ్మకూడదో - తెలీక, తికమక పడిపోతూ, మన వంశంలో ఎవరికీ లేని రోగాలు టోకుగా తెచ్చేసుకుని, డాక్టర్లకీ, హాస్పిటళ్ళకీ, మందుల కంపెనీల వాళ్ళకీ మహారాజ పోషకులం అయిపోగా, కాలకృత్యాలు గతి తప్పిపోయాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ అవసరం వస్తుందో తెలీనంతగా వుంది...పరిస్థితి !
😢😢
ఫలానా టైముకి అన్నం తినాలి, ఫలానా టైముకి పడుక్కోవాలి అనేవి గతస్మృతులు !
పొద్దున్న టీవీ చూస్తూ ఓ కునుకు లాగేస్తునాం.
అర్ధరాత్రి లేచికూచుని, ఏంజెయ్యాలో తోచక,
సెల్ ఫోన్ ని హింస పెట్టేస్తున్నాం.
24 గంటలూ టీవీ ఛానళ్ళ వాళ్ళు మన సేవలో తరిస్తున్నారు కాబట్టి, వాళ్ళని చూస్తూ కూచుంటే,
బీపీ ఎగదన్ని, లేక పడిపోయి, దాని తోబుట్టువు,
"రక్త పంచదార" ని తోడుగా తెచ్చుకుంటోంది !
మనకి స్పృహ వచ్చేసరికి, చుట్టూ తెల్ల కోట్లు, ఆకుపచ్చ గౌన్లు, టోపీలు వేసుకుని, కత్తెర్లు, పట్టకార్లు పట్టుకుని, ఏవేవో గొట్టాలు మన ముక్కుల్లో - నోట్లో పెట్టి మనల్ని బంధించేసి, ఎవరెవరో హడావిడి చేసేస్తున్నారు !
కళ్ళుతెరిచి, "నేనెక్కడున్నాను?" అని సినిమాలోలాగ అడిగితే..."వీడికి మత్తెక్కినట్టు లేదు..చూడండ్రా.." అంటున్నారు !
😃😃
టీవీ వాళ్ళు చర్చలకు బదులు, రచ్చలు పెడుతుంటే,
వాళ్ళు మాట్లాడుకోడం తక్కువ - పొట్లాడుకోడం ఎక్కువ అయిపోయి, మనకి ఎవరితో ఏకీభవించాలో తెలియక, టీవీ కట్టేస్తున్నాం.
టీవీలో డైలీ సీరియళ్ళు చూస్తే, మనక్కూడా శాడిజం వచ్చేస్తుందేమోని భయంగా వుంది !
ఇప్పటి గెడ్డాలు పెంచుకున్న నాయకుల్నీ,
సినిమా వాళ్ళనీ టీవీల్లో చూస్తుంటే, పిల్లలు ఝడుసుకుంటారనిచెప్పి, వాళ్ళ భాష వింటే పాడైపోతారనే భయంతో, టీవీ చూణ్ణివ్వకుండా,
తలో చైనా టాబ్బు కొనిచ్చేసి, చైనా వాళ్ళ గేములు ఆడుకుని, చైనా వాడి ఆదాయం బాగా పెంచమని చెబుతున్నాం.
💐💐
ఇంక మన విజ్ఞానదాయక న్యూస్ పేపర్ల సంగతికొస్తే,
ముప్ఫయ్ పేజీల లావుపాటి పేపర్ కొనుక్కుని, ఎన్నో మొదటి పేజీలలో, మొత్తం పేజీ అంతా ఆక్రమించేసిన
నాయకులు, వాళ్ళ పార్టీవాళ్ళ ఫోటోలు, లేక రక రకాల బంగారు - వజ్రాభరణాల గుండు బాస్ ల బొమ్మలు, వాళ్ళ సందేశాలు, మధ్య మధ్యలో ఎవరెవరో కొట్టుకుచచ్చిన వార్తలు, ప్రమాదాలు జరిగిన తీరు తెన్నులు, మృతుల ఫోటోలు, పరువు హత్యలు జరిపించిన కథావిధానాలు, శాస్త్ర రంగంలో మన దేశం సాధించిన అభివృద్ధి గురించి రాస్తూ, పక్కనే దినఫలాలు, అదృష్ట సంఖ్యలు సూచిస్తూ, ఏ సినిమా ఎన్ని వందలకోట్లు సంపాదించింది, హీరోల అభిమాన సంఘాల ఎన్నికల ఫలితాల వివరాలు, క్రీడలు, ధర్మ - భక్తి ప్రవచనాలు, పక్కనే టెర్రరిస్టు చర్యల్లో కుప్పకూలిన భవనాల ఫోటోలు, పక్క పేజీలో ఖరీదైన కార్ల ఫోటోలు, వివరాలతో ప్రకటనలు, షేర్ మార్కెట్లు ఎలా కుప్పకూలిపోయి, ఎన్ని లక్షలకోట్ల మదుపరుల ధనం ఆవిరైపోయిందో వివరిస్తూ, ఆఖరి పేజీలో ఎక్కడో... ఎవరో సంఘసేవ చేసిన సంఘటనలు, చదివేశాక,
మనకి మనసు భారమై, తల పట్టేసి, నరాలు మెలికలు తిరిగి, కండరాలు కొంకర్లు పోతుంటే, ఇంకో నాలుగు కాఫీలు తాగేసి, ఆకలి అటకెక్కితే, ఆ పూటకి టిఫిన్ తో సరిపెట్టుకుని, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి "భజగోవిందం"
కీర్తన పెట్టుకుని, కళ్ళు తేలేసి, కాళ్ళు పైకెట్టి, ఈజీ ఛైర్లో సేదదీరుతున్నాం !
"ఇంతేరా ఈ జీవితం...తిరిగే రంగుల రాట్నము..."
😌😌😌😌😌
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐💐💐
సేకరణ

No comments:
Post a Comment