Sunday, April 17, 2022

కవిత: నువ్వు నా గాయాల స్పర్శ! --- దండమూడి శ్రీచరణ్

నువ్వు
--------------
నువ్వు
నా గాయాల స్పర్శ!
నా హృదయాన దాచా.
నువ్వు
నా స్మృతుల వర్షం!
నా నేత్రాల కురిశా.
నీ తలుపుల తడి,
ఇలా నా రెప్పల మాటున!
నీ అందెల సాది,
ఇలా నా గుండెల లోతున!
ఎన్ని సుదూర గమ్యాలో
మన స్వప్నాలలో!
అన్నీ లెక్కేసుకుంటూ గడిపా!
ఎన్ని సురుచిర స్వప్నాలో
మన నయనాలలో!
అన్నీ గుప్పిట దాచి మురిసా!
నువ్వు అవ్యక్త ఆలాపన
నువ్వు అనిర్వచనీయ అన్వేషణ
నువ్వు నా ఎదలోని
అపురూప స్పందన
నిన్ను నా అణువణువున దాచా!
నువ్వే నా అంతర్ ఘర్షణ
అనుక్షణం ఆస్వాదించా!
నువ్వో నా స్వాప్నిక యదార్ధ ఘటన!
నిన్ను నా నెత్తుటిలో స్రవించా!
నిన్ను
నా కవితగా లిఖించా!
ఇలా
తరించా!!
--. దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

No comments:

Post a Comment