Sunday, April 17, 2022

కవిత: స్థానాన్ని బట్టి కాకుండా ఈ వ్యక్తిత్వాన్ని బట్టి పయనించు

నన్ను మించిన వాడు
ఎవడు లేడు అన్న వాడు
ఆనాడు ఈనాడు ఎవ్వడు లేడు
చరిత్ర చూసిన
ఆరా తీసిన
అన్వేషించిన
ఇకముందు కూడా ఎవడూ ఉండడు
ఎవరిదైనా ఆ క్షణం జరగవచ్చు
ఆరోజు మీ వైపు ఉండవచ్చు
విందు విన్యాసాలతో
మీకు జై కొట్టి ఉండవచ్చు
వాక్ చాతుర్యంతో
నువ్వు తాత్కాలికంగా ఆకర్షించవచ్చు
ఆరోజు ఆనందించవచ్చు
అనుదినం ఇలాగే ఉండదు
అహంకారం ఆర్భాటాలతో నువ్వు విర్ర వీగ వచ్చు
ఆడంబరాల తో అతిగా ప్రవర్తించవచ్చు
నీ స్థానం ఎలా మొదలైందో నీవు మర్చిపోయి ఉండవచ్చు
నీ ఎదుగుదల లో నీ వెంట ఉన్న వాళ్ళని గుర్తించక పోవచ్చు
ఈనాడు గర్వంతో విర్రవీగవచ్చు
నేను ఒక హోదా లో ఉన్నానని
భ్రమలో గడపకు
అదే శాశ్వతం అనుకోకు
రేపటి దినం నువ్వు ఆ హోదా స్థానంలో ఉండకపోవచ్చు
అది గమనించు
స్థానాన్ని బట్టి కాకుండా
ఈ వ్యక్తిత్వాన్ని బట్టి పయనించు
అదే సమాజంలో నిన్ను విలువైన మనిషిగా నిలబడుతుంది
మిత్రమా
🙏మీ శివరాయ్✍️
(జర్నలిస్ట్)

సేకరణ

No comments:

Post a Comment