Friday, April 22, 2022

ఉపకారం

🥀🌷ఉపకారం🌷🥀

భగవంతుడి సృష్టితో మనిషి ఒక అద్భుతమైతే, మానవతతో ఆ జన్మను సార్థకం చేసుకునే విధానాలతో, జీవయాత్ర సాగించడం, మానవ ధర్మం. కలియుగంలో మసలే మనుషులు, చిత్ర విచిత్ర స్వభావాలతో ఎవరికి వారే, అన్నట్లు బ్రతుకుతూ ఎదుటి వారి గురించిన ఆలోచనలకు దూరమవడం వల్ల, ఎన్నో అనర్థాలు ఎదురవుతున్నాయి.

ఒకే కుటుంబంలో నివసించేవారు సైతం ఎవరు, ఏమిటి తమ నుండి ఆశిస్తారో అనే భయాలతో బాంధవ్యాలను విస్మరించడం విస్మయం కలిగించే విషయం. కష్టసుఖాలతో, ఒకరినొకరు, ఉపకారాలతో తోడ్పాడుతో, ఐకమత్యంతో మెలగడం అరుదుగా మారింది. మానవ సంబంధాలు అడుగంటడంతో ఆత్మీయతలు లేవ్ఞ. అసూయాద్వేషాలు, స్వార్థం ప్రకోపించి, మనుషుల మధ్య మాటలే కరువయినాయి. పలకరిస్తే పాపం అన్నట్లు ఎవరికి వారు ఒంటరితనమే భాగ్యం అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండటం వల్ల, మానసిక ప్రశాంతతను కోల్పోతూ, నిరుత్సాహం కొని తెచ్చుకుంటున్నారు. ఎదుటివారి పట్ల కుతూహలమే తప్ప, ఎవరికి ఎలా ఉపయోగపడాలి! సహాయం అందించాలి అనే ఉపకార బుద్ధిని కలిగి ఉండకుండా, తమ వరకే అనేలా సంపదలను పెంచుకుంటూ, వాటి సాధన కోసం ఎంత చెడుపనికైనా సిద్ధమవడం వల్ల ప్రయోజనాలు శూన్యం. భగవంతుడి సృష్ఠిలో పేద, ధనిక వర్గాలు లోకంలో సంచరిస్తూ ఉండటంతో, దేవ్ఞడు స్వయంగా తానే వచ్చి మనుషులకు సాయం చేయడు.

దైవత్వం కలిగిన ఉదార హృదయులు, సాటిజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ కలిగి తనతో పాటు ఇతరులు కూడా సుఖజీవనం గడిపేలా సహకరించడమే ఉపకారగుణం. ధనాన్ని తన తరానికీ అన్నట్లు వ్యవహరిస్తూ దానధర్మాలు మానుకుని, నిరంతరం ధనధ్యాసకే జీవితకాలం కేటాయించకూడదు. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకునే వారి జన్మధన్యం. పరోపకారమే శరీరధర్మంగా భావిస్తూ బంధువ్ఞలను, స్నేహితులను, అవసరకాలంలో ఆదుకోవాలి.

డబ్బుతో ప్రాణాలకి లంకె పెట్టరాదు. అది అందరికీ లభ్యమయ్యేలా వితరణలు అందించాలి. ఏదీ శాశ్వతం కాదు. మరుజన్మ మంచిది కావాలనుకుంటే, మనం పెట్టుకునే పెట్టుబడే ఉపకారం అని గ్రహిస్తే పదిమందికి సహాయం చేయగలం. బాల్యస్నేహితులైన కృష్ణుడు కుచేలుడి కథ వింటే మనకు సహాయం అర్థం తెలుస్తుంది. లేమిలో తనని అర్థించవచ్చిన కుచేలుడి ఆంతర్యం గ్రహించి, అటుకులు స్వీకరించి, ఆయన అడగకుండానే అన్ని భాగ్యాలు ప్రసాదించిన శ్రీకృష్ణుడి ఔదార్యం యుగయుగాలకే ఆదర్శం కావాలి.

ఇప్పుడైతే బ్రతికి చెడ్డవారిని దరిదాపులకు కూడా రానివ్వరు. వారిని నిర్లక్ష్య ధోరణులతో బాధపెడతారే కాని, ఉపకారం చేయరు. ఇవ్వడంలో ఉండే ఆనందం పుచ్చుకోవడంలో ఉండదని, తెలిసేవారు బహుకొద్ది మంది భాగ్యవంతులకే చెల్లు. గుడిలో ఉండే దేవ్ఞడికి సమర్పించే, రకరకాల కానుకలు, బయట ఉండే భిక్షకులకు ఉపయోగపడవ్ఞ. బీదతనం భయంకరం అని తెలిసినవారు, పేదవారు పెరగకుండా ఉండేలా సహాయచర్యలు చేపట్టాలి. ఉపకారానికి, ప్రత్యుపకారం మాట ఎలా ఉన్నా ప్రత్యపకారం, జరగకుండా ఉండేలా మానవలోకంలో మనుషులు జాగ్రత్త పడాలి. ”సర్వేజనాసుఖినోభవంతు అనే మనోభా వంతో భాసిస్తే భగవంతుడి కృపకు పాత్రులవుతారు.

సేకరణ

No comments:

Post a Comment