నేటి జీవిత సత్యం.
మానవ జీవితంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనుషుల మధ్య సంబంధాలు... వీటిలో కూడా మంచి చెడులు ఉంటాయి. మన జీవితంలో మంచి తక్కువ పాళ్ళలో, చెడు ఎక్కువ పాళ్ళలో ఉంటే... ఎక్కడో ఏదో అవరోధం ఉందని అర్థం చేసుకోవాలి. కొందరు జీవితాన్ని సుఖప్రదంగా గడుపుతూ ఉంటే... అది చూసి ‘మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు?’ అనిపిస్తుంది. నిజంగా వారేదో శక్తిని వినియోగించడం వల్లే... వారికి అంతా మంచి జరుగుతోందనేది అపోహ కాదు.
ఆనందాన్ని పొందడానికి వారు ‘ప్రేమ’ అనే శక్తిని వినియోగిస్తూ ఉండొచ్చు. ఆ ప్రేమ శక్తితో అన్నీ మంచి విషయాలే జరుగుతాయి. పూర్వకాలానికి చెందిన ఎందరో ధర్మ గురువులు, మహనీయులు, దార్శనికులు... ప్రతి ధర్మంలోను ప్రేమకు సముచితమైన స్థానం ఇచ్చారు. తమ తమ యుగ ధర్మాలను అనుసరించి, తాము జీవించిన కాలంలోని మానవుల స్వభావాలను, సంస్కారాలను దృష్టిలో ఉంచుకొని వారు ఆ సందేశాలు ఇచ్చారనేది నిజం.
వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే... ప్రేమ అన్నిటినీ మించిన పరమశక్తి. అది ప్రేమ సాగరుడైన పరమాత్మ తాలూకు పవిత్ర శక్తి. మనం ప్రేమను పంచినప్పుడు... ఆ పరంధామంలో ఉన్న భగవంతుడి ప్రేమను వినియోగించుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. ‘ప్రేమ’ అంటే మన పరివారాన్నీ, స్నేహితులనూ, ప్రియమైన వస్తువులనూ ఇష్టపడడం కాదు. మన జీవితంలో ఎదురయ్యే శక్తులు ఏవైనా అవి ప్రేమ నుంచి ఉద్భవించినవేనని గ్రహించాలి. మనల్ని ప్రభావితం చేసే ఈ శక్తి మనలోనే... మన ఆత్మలోనే ఉంది.
మరి అలాంటి గొప్ప శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలి కదా! కానీ మీరు కోరుకుంటున్నవి మీ దగ్గర ఎందుకు లేవు? మీరు అనుకున్న పని ఎందుకు చేయలేకపోతున్నారు? సుఖ సంతోషాలు ఎందుకు లేవు?
మానవ హృదయంలోని ప్రేమ శక్తి వల్లే ప్రకృతి పులకిస్తుంది. పరిశోధనలు, ఆవిష్కరణలతో సృష్టి సుసంపన్నమైన ప్రగతిపథాన నడుస్తుంది. . సృష్టి నలువైపులా పరిశీలిస్తే... మనిషి తయారు చేసిన వస్తువులే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కనిపించని ప్రేమ శక్తితోనే సాధ్యమయ్యాయి. ‘‘ఒకవేళ మన నుంచి ప్రేమను తొలగించుకుంటే... ఈ భూమి శ్మశానం అవుతుంది’ అని రాబర్ట్ బ్రౌనింగ్ అనే కవి అన్నారు. మానవుల్లో శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమే ఈ లోకానికి ఆలంబన.
ప్రేమ శక్తే మనల్ని నడిపిస్తుంది. చెడ్డ విషయాల వల్ల, సమస్యల వల్ల మనలో ప్రేమ లోపిస్తుంది. చాలామందికి ప్రేమ అంటే ఏమిటనే దానిపై అర్థవంతమైన అవగాహన లేదు. ఎందుకంటే... ప్రేమ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా శక్తిమంతమైనది మాత్రమే కాదు, గుర్తించలేనిది కూడా. కంటికి కనిపించని ఈ మహిమాన్విత శక్తిని గుర్తించాలంటే... మొదట జ్ఞానసాగరుడైన పరమాత్మను గుర్తించాలి. ప్రేమమయమైన ఆయన సృష్టిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమను అర్థం చేసుకోగలం. ఆయన సృష్టించిన ఈ జీవన రంగస్థలంలో పరమానందంతో అభినయిస్తూ జీవించగలం.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment