Thursday, April 21, 2022

రామ జన్మభూమి....!!తులసీదాసు అనే మహాకవి రామచరిత్రను వ్యవహారిక భాషలో "రామచరిత మానస్" పేరిట రచించిన ప్రదేశం రామ జన్మ భూమి

🎻🌹🙏రామ జన్మభూమి....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

రామ జన్మభూమి శ్రీ రాముడు జన్మించిన ప్రదేశమే కాదు.

తులసీదాసు అనే మహాకవి రామచరిత్రను వ్యవహారిక భాషలో "రామచరిత మానస్" పేరిట రచించిన ప్రదేశం రామ జన్మ భూమి

తులసీ దాస్ జీవితం అద్భుతమైన సంఘటనల తో నిండి వుంది.

ఆయన తల్లి గర్భంలో నే పన్నెండు నెలలు పెరిగాడు. పుట్టినప్పుడే ముఫ్ఫైరెండు పళ్ళతో పుట్టాడు.

ఈ రామభక్తుని చర్యలన్నీ వింత గొలిపేవే.

తులసీదాసు భార్యమీద
ప్రేమతో భార్య పుట్టింటికి
వెళ్ళగానే తానుకూడా ఆమె పుట్టింటికి పయనమైవెళ్ళాడు.

అది చూసిన తులసీదాసు భార్య "నా భౌతిక శరీరం మీద చూపే ప్రేమ, మమకారం మీరు రాముని యందు
పెంచుకుంటే

జనన మరణాలనుండి విముక్తి కలుగుతుందని చెప్పగానే
ఆ ఒక్క క్షణంలోనే
సంసార జీవితం వదలి వేసి
సన్యాసం తీసుకుని
భారతదేశం అంతా పర్యటించి రామ
భక్తి తో మైమరచాడు.

వారణాసి చేరుకున్న తులసీదాసు కు అయోధ్యకి వెళ్ళమని భగవంతుని అనుగ్రహవాక్కు ఆదేశం లభించింది.
తులసిదాసు అయోధ్యకి
వెళ్ళాడు.

తులసీదాసు వ్రాసిన
రామాయణానికి ఎంతో స్వారస్యమైన చరిత్ర వున్నది.

వాల్మీకి రామాయణం రచించినప్పుడు, దానిని పఠించిన శ్రీ రాముడు
సంతకంచేసి ,తన అంగీకారం తెలిపి యిచ్చాడు.

హనుమంతుడు రాముని
చరిత్ర వ్రాయాలని వాంఛించాడు రాళ్ళమీద తన గోటితో వ్రాయడం
ఆరంభించాడు.

తన రామాయణాన్ని శ్రీ రామునికి చూపించగా తాను అంతకు
ముందే వాల్మీకి రామాయణానికి అనుమతి యివ్వడం జరిగినందువలన తను అనుమతి యివ్వలేనని
హనుమంతుని తన గ్రంధాన్ని వాల్మీకి కి చూపించమని ఆదేశించాడు.

హనుమంతుడు వాల్మీకి
వద్దకు వెళ్ళాడు. తన హనుమద్రామాయణాన్ని
చూపించాడు. అది పఠించి విస్మయం చెందిన వాల్మీకి

యీ మహాకావ్యం భూలోకంలో కలియుగంలో ప్రచారం చెంది ప్రజలంతా శ్రీరామభక్తి తో ఆధ్యాత్మిక ను పెంపొందించుకోవడానికి హనుమ తిరిగి మరోజన్మ ఎత్తాలని అభిలషించాడు

ఆ విధానంగానే జరిగింది.

కలియుగంలో హనుమంతుని అంశగా తులసీదాసు అనే సద్బ్రాహ్మణునిగా జన్మించి గొప్ప రామభక్తునిగా పేరుపొందాడు.

తులసీదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని సందర్శించాలని ఆయన జన్మభూమియైన అయోధ్యకి పయనమైవెళ్ళాడు.

తులసీదాసు అక్కడ ఒక
మర్రిచెట్టు క్రింద ఆశీనుడైనాడు. అప్పటికే అక్కడ ఒక సాధువు తన రాకకోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక వ్యాస పీఠం అలంకరించి
పెట్టాడు.

తులసీదాసు అక్కడి కి వస్తాడని తన
గురువుగారు ముందుగానే ఆదేశించినట్లు చెప్పాడు.

1575వ సంవత్సరంలో ఒక నవమి రోజున శ్రీ రాముని
స్తుతించి, రామచరిత
కావ్యాన్ని వ్రాయ ఆరంభించాడు
తులసీదాసు.

సులభ శైలి లో ఏడు కాండాలుగా
రచన సాగించాడు.

మానస సరోవరమనే ఆత్మజ్ఞానం సాధించడానికి సప్తసోపానాలు యీ రామాయణ కావ్యం అనేంత విశిష్టంగా యీ మహాకావ్యం రూపుదాల్చాలని భావించి తన గ్రంధానికి ' రామచరిత మానస్ ' అనే
పేరును పెట్టేడు తులసీదాసు.

రెండు సంవత్సరాల ,ఏడు
మాసముల,ఇరవై ఆరు రోజుల లో అద్భుతమయమైన శ్రీ రామాయణ కావ్య రచన ముగిసింది.

ఆ సంవత్సరం సీతా కళ్యాణ మహోత్సవం రోజునే ఆయన కావ్యరచన ముగించడం విశేషంగా చెపుతారు.

తులసీదాసు తన కావ్య రచన పూర్తి చేసి వారణాశికి
తిరిగి వెళ్ళి పోయాడు.

అక్కడ కూడా ఆయన కావ్య ప్రశస్తి ఆయనకంటే ముందే చేరింది. తులసీదాసు అన్ని వర్గాల ప్రజల మన్నలు పొందడం ప్రారంభించాడు.

తులసీదాసు పొందుతున్న కీర్తిని సహించలేని కొందరు
అసూయా పరులు ఆలయంలో వున్న రామచరిత మానస్ తాళపత్ర గ్రంధాలని అపహరించడానికి
ఇద్దరు మనుష్యులను వినియోగించారు.

వారిద్దరూ రాత్రి వేళ ఆలయానికి వెళ్ళగా అక్కడ ఇద్దరు వీరులు ధనుర్బాణాలతో కాపలా
కాస్తూ వుండడం చూసి,ఆశ్చర్యంతో వారు తమ యజమానులకు యీ విషయాన్ని తెలిపారు.

తులసీదాసు భక్తిప్రపత్తులు గ్రహించి వారు మరుసటిరోజు, తులసిదాసు వద్దకు వెళ్ళి
జరిగినది చెప్పి, క్షమాపణ కోరుకొన్నారు.

రామచరిత మానస్ మధురాతిమధురమైన కావ్యంగా ప్రసిద్ధి చెంది,ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను రేకెత్తించింది.

సీతారాముల జీవితాన్ని ఛందోబధ్ధంగా స్తుతించిన అద్భుతమైన రామాయణం తులసీ రామాయణం.

తులసీదాసు గొప్ప సంస్కృత పండితుడు. రామాయణంతో పాటు మరో పన్నెండు గ్రంధాలను కూడా రచించాడు...జై శ్రీరామ్...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సేకరణ

No comments:

Post a Comment