నేనో జ్ఞాపకాన్ని!
--------------------------
నన్నెవరందువా?
నేనో సుదూర ప్రాంత వాసిని,
యాత్రికుడను,
దేశ దిమ్మరిని,
నింగి లోని ఆ మేఘం వలె,
నిశీధిలో రాలు ఉల్క వలె,
వలసవచ్చు పక్షి వలె,
తిరుగాడువాడను!
నేస్తం!
నేను కవిని కూడా!!
నా పాటలు విందువా?
చలి నెగళ్ల వద్ద పాడు మధుర గీతాలు,
వసంతాగమనమున కోయిల కుహూరుతాలు,
ఏకాంత శిశిరాన
భగ్నప్రేమికుడి విషాదగీతాలు,
ఏవి విందువు?
ఏమిటీ తేరిపార చూస్తున్నావు?
నా పాదాల పగుళ్ళా?
ఇవేంటి మరి!
నీకు కనపడవు కానీ,
నా హృదయంలో ఎన్ని శకలాలో!!
యాత్రానుభవాలు,
నా పాదాలకు పగుళ్ళనూ,
జీవితంలో గాయాలు,
హృదయంలో ముక్కలనూ మిగిల్చాయి!!
నా నేత్రాలు అలాగున్నవేమి అని అంటున్నావా?
అయ్యో ..పిచ్చి నేస్తం!
కన్నీరు ఇంకిపోయిన నేత్రాలివి!
భావాలూ,అనుభూతులూ నలిగిపోయిన గాజు కళ్ళు ఇవి!!
ఈ రేయి ఇచట బస,
రేపెచ్చటికో నా దెస!
ఈ క్షణాలు నీవే నేస్తం,
బ్రతికుంటే తిరిగొస్తా నీ కోసం!
లేదనుకో,
నీతో ఉంటాయి నా గీతాలు,
నా జ్ఞాపకాలు!!
-------- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
--------------------------
నన్నెవరందువా?
నేనో సుదూర ప్రాంత వాసిని,
యాత్రికుడను,
దేశ దిమ్మరిని,
నింగి లోని ఆ మేఘం వలె,
నిశీధిలో రాలు ఉల్క వలె,
వలసవచ్చు పక్షి వలె,
తిరుగాడువాడను!
నేస్తం!
నేను కవిని కూడా!!
నా పాటలు విందువా?
చలి నెగళ్ల వద్ద పాడు మధుర గీతాలు,
వసంతాగమనమున కోయిల కుహూరుతాలు,
ఏకాంత శిశిరాన
భగ్నప్రేమికుడి విషాదగీతాలు,
ఏవి విందువు?
ఏమిటీ తేరిపార చూస్తున్నావు?
నా పాదాల పగుళ్ళా?
ఇవేంటి మరి!
నీకు కనపడవు కానీ,
నా హృదయంలో ఎన్ని శకలాలో!!
యాత్రానుభవాలు,
నా పాదాలకు పగుళ్ళనూ,
జీవితంలో గాయాలు,
హృదయంలో ముక్కలనూ మిగిల్చాయి!!
నా నేత్రాలు అలాగున్నవేమి అని అంటున్నావా?
అయ్యో ..పిచ్చి నేస్తం!
కన్నీరు ఇంకిపోయిన నేత్రాలివి!
భావాలూ,అనుభూతులూ నలిగిపోయిన గాజు కళ్ళు ఇవి!!
ఈ రేయి ఇచట బస,
రేపెచ్చటికో నా దెస!
ఈ క్షణాలు నీవే నేస్తం,
బ్రతికుంటే తిరిగొస్తా నీ కోసం!
లేదనుకో,
నీతో ఉంటాయి నా గీతాలు,
నా జ్ఞాపకాలు!!
-------- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
No comments:
Post a Comment