Monday, April 18, 2022

స్నేహం దాని పరిమళం..

నేటి జీవిత సత్యం.
🌸 స్నేహం దాని పరిమళం.. 🌸

స్నేహం ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగమై ఉంది.... అది ఏ రూపేణా అయిన కాని స్నేహం ప్రతిఒక్కరి జీవితంలో ఉంది... స్నేహానికే మనం ఎందుకు విలువ ఇస్తున్నాము అని చూడగలిగితే స్నేహం యొక్క పరిధి అవగాహనకు వస్తుంది...
స్నేహంలో ఉన్నది ఏమిటో చూద్దాం....

అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంటుంది... అలాగే ఎదుటి వారి అభిప్రాయాలను ఖండిచే స్వేచ్ఛ కూడా ఉంటుంది...

ఇంట్లో అన్ని విషయాలను పంచుకోలేనివి స్నేహంలో పంచుకుంటాం...

స్నేహంలో మొదట పరిధులు పెట్టుకొని మొదలు పెట్టి ఆ స్నేహాన్ని విశ్వసించడం మొదలవగానే పరుదులను మనమే తుడిచివేస్తాం... (మిగతా బంధాలలో ఇది కుదరని పని)...

తెలియని విషయాన్ని తెలియదు అని తేలికగా చెప్పేది స్నేహంలోనే...

స్నేహం కొత్తపుంతలు తొక్కేకొలది స్నేహితులే అన్ని అవుతారు... బంధాలు రెండోపక్షం అవుతాయి...

స్నేహం బలపడక ముందు కొద్దిపాటి ఘర్షణ ఉండవచ్చు కానీ ఆ స్నేహాన్ని బలపరచేదే
ఘర్షణ అని అర్ధం చేసుకుంటాము...

ఇది సహజంగా జరిగే స్నేహం తాలూకా దారి లేదా వృద్ధి చెందే తీరు..
అదే ఆధ్యాత్మిక దారిలో ఎలా ఉంటుందో చూద్దాం..

ఆధ్యాత్మిక దారిలో స్నేహానికి ఉన్న స్థితి అద్భుతమైనది... ఇక్కడ నిత్యం కలిసే ఉందాం అనే భావనే ఉండదు...

అనుభవాలు, ఆచరణ మార్గాలు, తోటివారితో సమభావం, జీవితంలో చేసిన ప్రయోగాలు అవి అవగాహన కల్పించే తీరు ఎక్కువ మందిని స్నేహితులుగా మారుస్తాయి...

ఈ స్నేహంలో ఎవరి దారి వారిదే... ఎవరి ప్రశ్నపత్రం వారిదే అని స్పష్టంగా తెలుసుకునే ఉంటారు...

వీరికి స్నేహంలో పరుదులు ఉండవు... అంటే ప్రకృతి,, పంచభూతాలు, చెట్లు, జీవజాతులు ఒకటేమిటీ అందరితో వీరికి స్నేహం మిత్రుత్వం సహజం...

ఆధ్యాత్మిక స్నేహం ఉన్నతమైనది అనేది చెప్పటం కంటే అనుబవానికి తెచ్చుకోవడం అద్భుతః...

ఇక్కడ స్నేహంలో అనుభావాలే హోదా... ఆచరణే అంతస్తులు... తోటివారితో ఉండే సమతత్వం అత్యున్నత స్థితి... ఇదే అందరికి వర్తిస్తుంది..

ఆధ్యాత్మిక స్నేహంలో అంతా దైవాలుగా పరిగణనలోకి తీసుకోవడం.... ఇంకా ఎదగాలి అని భరోసా ఇవ్వడం షరామాములు విషయం..

ఆధ్యాత్మిక స్నేహంలో ఒకరి అవసరం గురించి ఎప్పుడూ చెప్పరు.. కేవలం చేసే పని గురించి మాత్రమే చెబుతారు..
దానికి తగ్గట్టుగా ఏమిచెయ్యాలి అనేది మన నిర్ణయం...

ఇంతవరకు స్నేహం గురించి చెప్పటానికి కారణం తరతమ భేదాలు అనేవి ఆధ్యాత్మిక దారిలో ఉండవు ఒకవేళ నచ్చకపోయినా మౌనంగా ఉంటారు... ఖండించరు.. అనుభవం ద్వారా తెలుసుకుంటారు అని వదిలేస్తారు.... ఆధ్యాత్మికత మనిషిలో అంతటి మార్పు తెస్తుంది...

స్నేహానికి.... జయహో..
స్నేహంలో ఉన్న స్వేచ్చకు... జయహో...
స్నేహంలో ఉండే స్వచ్ఛతకు జయహో...

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment