ఆకాశమే నీ హద్దురా!
----------------------------------
గాయాల్ని లెక్క పెట్టకు
నీ ఆస్థులు అవి కదరా
చీకట్లను తిట్టుకోకు
నీ నేస్తులు అవి పదరా
కన్నీళ్లేన్ని కార్చిన
ఏమున్నదనా సందేహం
బొట్టు బొట్టుకూ ఉన్నది మూల్యం
నిను నడిపే తైలం
ఒక్కొక్కో రాయిని పేర్చితే
అవుతుందో దుర్గం
ఒక్కొక్కో లోయను దాటితే
నీదేలే ఆ శిఖరం
రాయికి ఉలి పోట్లు తప్పవు
శిల్పం అయ్యే వరకూ
మనిషికి ఆటుపోట్లు తప్పవు
గమ్యం చేరే వరకూ
సులభంగా దొరికిందేదీ
సుఖమివ్వదు నీకు
పోరాడి గెలిచిన గవ్వ
నిను వీడదు ఎపుడూ
నిను నమ్మేవాడుండడు
పడిపోయావా
నీవెంట ఎవ్వడు నడవడు
నువ్వోడావా
నీలోని నిన్ను గెలుచుకో
నీ సమరంలో
లోకాన ముందు నిలుపును
ఈ పందెంలో
ఆలోచన ఆయుధమైతే
అమ్ముల పొదిలో
నీదేరా పైచేయి
విజయపు బరిలో!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
----------------------------------
గాయాల్ని లెక్క పెట్టకు
నీ ఆస్థులు అవి కదరా
చీకట్లను తిట్టుకోకు
నీ నేస్తులు అవి పదరా
కన్నీళ్లేన్ని కార్చిన
ఏమున్నదనా సందేహం
బొట్టు బొట్టుకూ ఉన్నది మూల్యం
నిను నడిపే తైలం
ఒక్కొక్కో రాయిని పేర్చితే
అవుతుందో దుర్గం
ఒక్కొక్కో లోయను దాటితే
నీదేలే ఆ శిఖరం
రాయికి ఉలి పోట్లు తప్పవు
శిల్పం అయ్యే వరకూ
మనిషికి ఆటుపోట్లు తప్పవు
గమ్యం చేరే వరకూ
సులభంగా దొరికిందేదీ
సుఖమివ్వదు నీకు
పోరాడి గెలిచిన గవ్వ
నిను వీడదు ఎపుడూ
నిను నమ్మేవాడుండడు
పడిపోయావా
నీవెంట ఎవ్వడు నడవడు
నువ్వోడావా
నీలోని నిన్ను గెలుచుకో
నీ సమరంలో
లోకాన ముందు నిలుపును
ఈ పందెంలో
ఆలోచన ఆయుధమైతే
అమ్ముల పొదిలో
నీదేరా పైచేయి
విజయపు బరిలో!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
No comments:
Post a Comment