109. గ్రంథం: నా గురువు
రచన: జ్ఞానశిశువు
స్వరూపమే స్వదేశము
_
3-10-2021 ఆదివారం
ఈ ఉదయం 10 గంటలకు నేనూ ప్రసాదు కేరళా అంగట్లో టీ త్రాగి, గురువుగారికి సమోసాలు పార్శిల్ చేసుకుని తీసుకెళ్లాం.
వేణుగారి అమ్మాయి కాఫీ పెట్టి తీసుకొచ్చింది అందరికీ...
గురువుగారితో కలిసి అందరం సమోసా తిని, కాఫీ త్రాగాం.
వీడియోకాల్ లో మురుగానంద, శివస్వామి, పలనాటి శ్రీను, యజ్ఞేశ్వర శర్మ, లీలమ్మ... గురుదర్శనం చేసుకున్నారు.
లీలమ్మ ఓ ప్రశ్న అడిగారు... మనోనాశం, మనోలయం అంటే ఏమి? అని
నాశనమైతే తిరిగి పూర్వస్థితిని పొందే అవకాశం ఉంటుంది. లయమైతే ఎప్పటికీ పూర్వస్థితిని పొందే అవకాశం ఉండదు.
మరణంలో జరిగేది - మనోనాశం. మోక్షంలో జరిగేది - మనోలయం.
మరణంలో నాశనమైన మనసు తిరిగి మొలకెత్తుంది... జన్మకారణం.
భగవంతునిలో లయమైన మనసు తిరిగి మొలకెత్తదు... జన్మరాహిత్యం.
అజ్ఞాని మనసు సంసారమనే తడినేలలో వేసిన విత్తనం లాంటిది. అది మొలకెత్తుతుంది.
జ్ఞాని మనసు జ్ఞానాగ్నిలో వేగిన విత్తనం లాంటిది. అది మొలకెత్తదు.
సముద్రంలో కలిసిన నది వలె నామరూపాలు లేకుండా సముద్రమే(దైవమే) అయిపోవడమే మనోలయం.
మా వాడు స్టేట్స్ లో ఉన్నాడు... అని చెప్పుకు తిరిగే అమాయకపు తండ్రులంతా పార్కుల బెంచీలమీద, ఆశ్రమకుటీరాల్లో "ఏకాంతం" పేరుతో "ఒంటరితనాన్ని" అనుభవిస్తున్నారు.
పైగా ఆ వలస జీవులు స్టేట్స్ లో ఉండి క్రొత్తగా అనుభవించేది ఏమీలేదు... వీకెండ్ డేస్ లో అస్థిమిత భోగాలు తప్ప.
ఇల్లు, కారు, ఉద్యోగం... అన్నీ తత్కాలికమే... అని గ్రహించేలోపే గ్రీన్ కార్డు వచ్చేస్తుంది...
భారతదేశ సంస్కృతికి వారసులు కావలసినవారు విదేశీ బానిసత్వానికి శాశ్వత సభ్యత్వత్వం వచ్చినందుకు... ఇక్కడ ఏం చేయాలో దిక్కు తోచని దిక్కుమాలిన తండ్రి వేడుక చేసుకుంటాడు.
కొడుకు కొన్న కారును, కొడుకు కన్న కొడుకును వీడియోకాల్ లో చూసి తృప్తి పడవలసిందేగాని, ఆ కారులో తిరగలేడు. ఆ మనవణ్ణి ఎత్తుకోలేడు.
బాగున్నావా నాన్నా!అనగలడేగాని, నాన్న ఎలా ఉన్నాడో జీవితాంతం తెలుసుకోని కొడుకు కొన్న కారును వాట్సప్ లో గర్వంగా అందరికీ షేర్ చేసుకుంటాడు.
ముద్దాడలేని మనవడి ఫోటోను అందరికీ చూపించి, మా వంశోద్ధారకుడు అని మురిసిపోతాడు.
మనవళ్ల ముడ్డి కడగడానికి నానమ్మలకు విదేశీప్రయాణ యోగమేగానీ, తాతయ్యలతో అక్కడ అవసరమే లేదు.
రిటైర్డ్ అయ్యక వచ్చే ఫించను కూడా కొడుకును స్టేట్స్ పంపడానికి చేసిన అప్పును తీర్చడానికే తన శేషజీవితాన్ని గడిపేస్తుంటాడు.
మనం చేస్తున్న ఘనకార్యమేమి? స్వదేశీ బిడ్డలను ఎగుమతి చేస్తున్నాం. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం.
మన భారతీయ చైతన్యాన్ని విదేశీయులకు ఎగుమతి చేస్తున్నాం.
అక్కడి జడవస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం.
మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ మాటలు గుర్తుకొస్తున్నాయి-
విదేశాలకు చదువు చెప్పడానికే వెళతానుగానీ, చదువుకోవడానికి వెళ్లను... అన్నారు.
T.V. లో అన్ని రకాల ఛానళ్లూ ఉంటాయి. మనం ఏ ఛానల్ పెట్టుకుంటే ఆ ఛానెల్ ప్రదర్శితమౌతుంది.
మన హృదయపేటిక కూడా అలాంటిదే. అన్ని జన్మలూ అందులోనే ఉన్నాయి. మనం ఏది ఎన్నుకుంటే, పైకి ఆ జన్మ ప్రదర్శితమౌతుంది. మిగతా అన్ని జన్మలూ సూక్ష్మరూపంగా ఉంటాయి.
మరణించేముందు సద్భావనతో ఉండమన్నారంటే, మరో మంచి ఛానెల్ ను, అనగా మరో మంచిజన్మను తీసుకునే దిశగా వెళతాడు... అని.
జన్మ పరంపర అంటే ఒక జన్మ తర్వాత మరొక జన్మ అని కాదు.
అన్ని జన్మలయొక్క సమిష్టిరూపంగా నీవున్నావు T.V. వలె.
ఇప్పుడే మానవ జన్మగా ఉండేది నీవే. ఇప్పుడే చెట్టుజన్మగా ఉండేది నీవే. ఇప్పుడే పిట్ట జన్మగా ఉండేది నీవే.
ఇప్పుడే సకలజన్మల రూపంలో ఉండేది నీవొక్కడివే.
జన్మపరంపర ఉండేది అడ్డానికి(Horizontal).
నిలువుకి(vertical)కాదు.
జీవించడం చేతగానివాడే పునర్జన్మ గురించి, జన్మరాహిత్యం గుఱించి ఆలోచిస్తాడు...
రసజ్ఞత లేని మనసే మోక్షాన్ని కోరుకుంటుంది.
మోక్షం అంటే ఏమి?మరుజన్మ లేకపోవడమా?నిజంగా అదే అయితే అలాంటి మోక్షం నాకొద్దు అంటాను. ప్రకృతి రసాస్వాదనమే తపస్సు... అన్నారు చలం.
భగవంతుడు మనకు పంచేంద్రియాలను ఇచ్చింది వాటిని మూసి పెట్టడానికీ కాదు, అణగద్రొక్కడానికి కాదు, జయించడానికీ కాదు.
భగవంతుణ్ణి అయిదు విధాలుగా అనుభవించడానికి ప్రకృతి చేసిన ఏర్పాటే ఈ పంచేంద్రియాలు.
ఇంద్రియసుఖం ఆత్మసుఖానికి భిన్నమైనదేమీ కాదు. వీటి ద్వారా మనం అనుభవించేది ఆత్మనే.
ఇది కాదు, ఇది కాదు అని అనడం వేద విధానం.
ఇది కూడా, ఇది కూడా అని ఉండడం మన గురు విధానం.
సుఖం అనేది ఇంద్రియాలకు సంబంధించినది. సంతోషం అనేది మనసుకు సంబంధించినది. ఆనందం అనేది ఆత్మకు సంబంధించినది.
ఒకటి బావినీరు.
ఇంకొకటి నది నీరు.
ఇంకొకటి సముద్రపు నీరు.
నీరుగా అంతా ఒకటే.
ఆత్మగా అంతా ఒకటే.
అన్ని అనుభవాలూ ఆత్మానుభవాలే. అన్ని సుఖాలూ ఆత్మసుఖాలే. అన్ని శక్తులూ ఆత్మశక్తులే.
మోక్షం అంటే జడత్వం కాదు, చైతన్యం.:మోక్షం అంటే నిరాశావాదం కాదు, ఆశావాదం. మోక్షం అంటే వైరాగ్యం కాదు, వైభోగం.
మోక్షం అంటే మరుజన్మ లేకుండా చేసుకోవడం కాదు, ఎన్ని జన్మలైనా సరే ఈ జీవన మాధుర్యాన్ని చవి చూడ్డానికి ఉవ్విళ్లూరటం.
ఈ భూ గ్రహాన్ని పాడు చేసుకుని, అంగారక గ్రహానికి ప్రయాణం చేయడం గొప్ప సైన్స్ అని చంకలు గుద్దుకుంటోంది మానవసమాజం.
ఈ లోకంలో సుఖపడడం చేతగానివాడు, స్వర్గలోకసుఖాలను అభిలషిస్తూ కర్మలు చేసేవాడు వెర్రివాడు.
ఈ దేశంలో గోచీ పెట్టుకొని వ్యవసాయం చేయడంలో ఉన్న స్వేచ్ఛ, విదేశాల్లో కోటు బూటు వేసుకుని ఉన్నా సరే అతడు ఓ బానిస.
ఏదయినా సరే-
ఈ లోకంలోనే సాధించండి.
ఈ గ్రహంలోనే సాధించండి.
ఈ దేశంలోనే సాధించండి.
ఈ దేహంలోనే సాధించండి.
అదే గురువుగారు చెప్పిన ఇప్పుడు-ఇక్కడ-ఇలా.
ఎప్పుడో-ఎక్కడో-ఎలాగో అనేదే మాయ. ఇప్పుడు-ఇక్కడ-ఇలాగు అనేదే సత్యం.
ఉన్నచోటనే హాయిగా జీవించగలిగే పరిస్థితులను దూరం చేసుకొని, మరో దేశంలో, మరో గ్రహంలో, మరో జన్మలో, మరో లోకంలో సుఖపడదామనే ఆలోచనే ఇన్ని పరుగులకు, ఇన్ని వ్యధలకు కారణమైంది.
పరుగెత్తే కుందేలు పదేళ్లే బ్రతుకుతుంది. నిదానంగా సాగే తాబేలు వందేళ్లు జీవిస్తుంది. అని సామెత.
పరుగు - దుఃఖం.
నెమ్మది - సుఖం.
పరుగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్లుత్రాగడం మేలు.
మన ఋషులు తపస్సులు చేసి ఉన్నచోటునే ఉంటూ దేవుణ్ణి తమ వద్దకు తీసుకురాగలిగారు.
ఆది శంకరులు తామున్న చోటుకే నదిని రప్పించుకోగలిగారు.
ఎండమావుల వెంట పరుగులు మానండి. ఉన్నచోటనే ఉంటూ సుఖంగా జీవించగలిగే జీవనవిధానాన్ని ప్రసాదించిన సంస్కృతి మనది.
స్వరూపమే స్వదేశము. స్వరూపనిష్ఠయే పరమసుఖము.
🙏🌷శుభమ్ భూయత్ 🌷🙏
🍁🍁🔅🍁🕉️🍁🔅🍁🍁
సేకరణ

No comments:
Post a Comment