Sunday, April 17, 2022

🥭😋మామిడి పండు మాయా సారం😋🥭

🥭😋మామిడి పండు మాయా సారం😋🥭

రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే "వ్యామోహం" అని అంటారు.😛

మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే "వాత్సల్యం" అని విశదీకరించారు😛.

చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే "ఆప్యాయత" అని చాటి చెప్పారు.😛

పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే "లోభం" అని అన్నారు.😛

మన పండంతా తిని ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే "అసూయ" అని వివరించారు.😛

మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, "క్రోధం" అని వివరంగా తెలిపారు.😛

మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే "అహంకారం" అని చాటారు.😛

మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే "మమకారం" అని తెలిపారు.😛

అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా "ఆత్రం" అని విశదీకరించారు.😛

ఒక పండు ఆరగింపు ముద్దు,
రెండు కద్దు
మూడు అసలే వద్దు,
ఉండాలి దేనికయినా సరిహద్దు.
దీనినే స్వీయ నియంత్రణ* అని విపులీకరించారు మన పెద్దలు.😛

ఇదీ మామిడిపండు రసలీలాసారం..

🥭🥭🥭🥭🥭🥭

సేకరణ

No comments:

Post a Comment