నేటి జీవిత సత్యం. ఎవరికైనా తప్పదు పరీక్ష!
ఏ మనిషిని అయినా వస్తువునైనా అనేక విధాలుగా పరీక్ష చేసిన తరవాతే దాని విలువను, గుణాన్ని నిర్ధారిస్తారు. ఇది సహజం. ఒక విద్యార్థి ఎంత జ్ఞానం సంపాదించాడో తెలుసుకోవడానికి అధ్యాపకుడు పరీక్షిస్తాడు. అనేక రీతులుగా ప్రశ్నలు వేసి జవాబులు రాబడతాడు. అధ్యాపకుడు సంతృప్తి చెందితే ఆ విద్యార్థి కృతార్థుడవుతాడు. ఏ ఉద్యోగార్థికైనా ఇలాంటి పరీక్ష తప్పదు.
ఉద్యోగం, వృత్తిరీత్యానే గాక, కుటుంబంలోని సభ్యులకూ పరీక్షలుంటాయి. అవి చెప్పిరావు. ఎప్పుడైనా, ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా పరీక్షలొస్తాయి. అవి సమస్యలుగా పరిణమించి వాళ్లను వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఇంటి యజమానినీ యజమానురాలినీ మానసిక సంఘర్షణలకు గురిచేస్తాయి. అటువంటప్పుడే ధైర్యంతో, సహనంతో, వివేకంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు.
నిరంతరం భగవంతుణ్ని పూజించి ఆరాధించే భక్తుడికీ పరీక్షలు తప్పవు. సచ్ఛరిత్రులకు, సచ్ఛీలురకూ పరీక్షలుంటాయి. సత్యవ్రతుడైన హరిశ్చంద్రుణ్ని విశ్వామిత్రుడు పరీక్షించాడు. సతీ అనసూయను త్రిమూర్తులు పరీక్షించారు. సతీసావిత్రిని యమధర్మరాజు పరీక్షించాడు. యక్షుడు అనేక ప్రశ్నలు వేసి ధర్మరాజు విజ్ఞతను పరీక్షించాడు. దేవేంద్రుడు, అగ్నిదేవుడు డేగ, పావురాల రూపంలో వచ్చి శిబి చక్రవర్తి దానశీలతను పరీక్షించారు. సతీసక్కుబాయి పరీక్షలకు గురైనదే. పరమశివుణ్ని పతిగా పొందాలని కఠిన తపోదీక్షలో నిమగ్నమై ఉన్న పార్వతిని కపట బ్రహ్మచారి వేషంలో శివుడు వచ్చి అనేక ప్రశ్నలతో పరీక్షిస్తాడు. ఆమె జవాబులు విన్న ముక్కంటి తనపట్ల ఆమెకు గల అచంచలమైన అనురాగాన్ని గ్రహిస్తాడు.
ద్రోణుడు విలువిద్యలో అర్జునుణ్ని పరీక్షించి, అతడి విద్యాకౌశలాన్ని మెచ్చుకున్నాడు. గణాధిపత్యం ఇచ్చే సందర్భంలో పరమేశ్వరుడు కుమారస్వామిని, గణపతి పరీక్షిస్తాడు. త్రిమూర్తుల్లో ఎవరు సహనంగలవారో
తెలుసుకోవాలని ప్రయత్నించి భృగుమహర్షి భంగపాటు చెందుతాడు.
బ్రహ్మ, విష్ణువు నేనంటే నేను అధికుణ్ని అని కలహించుకుని తీర్పుకోసం వచ్చినప్పుడు పరమశివుడు ఇద్దరినీ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో విఫలురైనందుకు శివుడు వారిని శపిస్తాడు. నాస్తికుడైన మంజునాథను పరీక్షించి, చివరికి పరమభక్తుడిగా చేసుకుంటాడు
ఈ గాథల వల్ల మనిషి ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని క్లిష్టమైనవీ కావచ్చు, మరికొన్ని అత్యంత సంక్లిష్టమైనవి కావచ్చు. ఈ సమస్యలే పరీక్షలు. వీటిని ఎదుర్కోవడానికి ఓర్పు
కావాలి. వివేకం, వివేచన అవసరం. సమస్యలు
ఎదురైనప్పుడు ఆవేశపడటమో, కుంగిపోవడమో, ఎదుటివారినో పరమాత్మనో దూషించడమో వాంఛనీయం కాదు. కుటుంబసభ్యులతో చర్చించుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. సాధారణంగా స్వయంకృతాపరాధం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం ఉంటుంది. పెద్దరాయి అడ్డమైనప్పుడు ప్రవహించే నీరు పక్కదారి చూసుకుని వెళ్ళిపోతుంది కదా! ఇది ప్రారబ్ధం అని కూర్చునేవారు సాఫల్యం పొందలేరు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎన్ని పరీక్షలనుంచి అయినా, సమస్యలనుంచి అయినా బయటపడవచ్చు. ధ్యానం, ఆధ్యాత్మిక చింతన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సత్సాంగత్యం వల్ల సానుకూల దృక్పథం గోచరిస్తుంది. బోధన కంటే శ్రవణం గొప్పది. శ్రవణం కంటే సాధన గొప్పది. సాఫల్యమనే వృక్షానికి సాధనే బీజం. గ్రీష్మమనే ఏ పరీక్షకైనా నీడనిచ్చేది ఆ వృక్షమే.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment