Thursday, April 7, 2022

🔥 కోపం🔥 & భయం

🔥 కోపం🔥
🕉️🌞🌎🏵️🌼🚩

కోపమున ఘనత కొంచమైపోవును' అని వేమన అంటే 'తన కోపమే తన శత్రువు'అన్నాడు సుమతీ శతక కర్త బద్దెన. మరో మహాత్ముడు ' కోపము కలిగిన వారికిఏపనియు
ఫలింపకుండు, యగ్గులు కల్గున్ పాపపు పనులను చేయుచు ఛీ పొమ్మని పిలుచుకొనుట చేకూరు సుమీఅన్నారు. ప్రతి మనిషికి ఒక సొంత రాజ్యాంగం ఉంటుంది. అదీ తన మైండ్లోనే తనుతన
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సంఘంలోని తోటివారు, ప్రభుత్వం, ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. తాను అనుకున్న దానికి, వ్యతిరేకంగా ఏదైనా జరిగితే దానిని మనస్సు ప్రతిఘటించడం వలన నాడులు ఉద్రేకపడి అది కోపంగా బహిర్గతమవుతుంది. కోపం "మొదటి స్థాయి"లో ఉన్నపుడు ముఖం, కళ్ళు ఎర్రబడడం గుండె వేగం పెరగడం, ఎదుటి వారిని తిట్టడం లేదా తనలో తానే తిట్టుకోవడం జరుగుతుంది..

రెండోస్థాయిలో కొట్టడం, మూడవ స్థాయిలో చంపడం వరకు దారితీస్తుంది సహజంగా ఎదుటివారు తనమాట విననపుడు, తనని మోసం చేసినపుడు, ఏదైనా అన్యాయం జరుగుతున్నపుడు, తనని ఎవరైనా అనవసరంగా తిట్టినపుడు, కొట్టినపుడు చులకన చేసినపుడు, తన కుటుంబ సభ్యులకు, ఆప్తులకు హాని కల్గించినపుడు. తాననుకున్న పని సరిగా నెరవేరనపుడు, లక్ష్యం సిద్ధించనపుడు, మనిషికి సహజంగా కోపం వస్తూ ఉంటుంది..

"ఉత్తమేతు క్షణం కోప:, మధ్యమే ఘటికాద్వయం | అధమే స్యాదహోరాత్రం పాపిష్టి మరణాంతికః ॥

కనక మనకు వచ్చే కోపం పాల మీద పొంగులా తగ్గేట్టు సాధన చేయాలి మరియు ఒక సంఘటన బాహ్యం/అంతర) జరిగినపుడు దానిని ముందు మనసులో "సరే" అని అంగీకరిస్తే దానికి ప్రతిచర్మ విచక్షణతో చెయ్యగల్గుతాం. కోపం వలన కలిగే 8 వ్యసనాలు : చాడీలు చెప్పడం, మంచి వారిని అవమానించడం, ద్రోహానికి పాల్పడటం, ఈర్షశా ద్వేషం, హింసించి పరుల ధనాన్ని అపహరించడం, దూషించడం, అకారణ దండన.కోపం వలన పగ
కలుగుతుంది. పగకు 5 కారణాలను భారతం చెప్పింది..

1. స్వీకృతం 2 స్థల తగాదా 3. మాట పట్టింపు 4. జాతి వైరం 5. కీడు కల్గించిన వారిపై ప్రతీకారం భగవద్గీతలో చెప్పిన కోపం వలన కలిగే నష్టాలు మోహం కలిగి, జ్ఞావత
శక్తి నశించి, బుద్ధి చెడి అదోగతి పాలగును. కోపాన్ని జయించుటకు ఉపాయాలు కొన్ని:

1. సంఘటన ఏదైనా మానసికంగా అంగీకరించడం
2. కోపం వస్తుందని అనిపించినపుడు పది దీర్ఘశ్వాసలు తీసుకోవడం లేదా గురునామాన్ని జపించడం, 100 అంకెలు లెక్కపెట్టడం
3. అక్కడ నుండి. తాత్కాలికంగా తప్పుకోవడం

4. చర్చను వాయిదా వేయడం

5. చల్లటి నీరు, పాలు, మజ్జిగ త్రాగడం
6. అవకాశం ఉంటే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం

7. చిరునవ్వును తెచ్చుకోవడం

8. కోపం వలన కలిగే నష్టాలను గుర్తుకు తెచ్చుకోవడం
9. నేను "శాంత స్వరూపాన్ని" అని పదేపదే అనుకోవడం







భయం :

భర్తృహరి మనుష్యులందరికి ఏదోఒక భయం ఉంటుంది. వైరాగ్యమే అభయం అన్నారు . (పద్యం 'భోగే రోగ భయం..... ప్రతి మనిషికి భయం అనేది పుట్టుకతో వచ్చే గుణం. భయం రెండు రకాలు.
అవి -
1. అవసరమైన భయం
2. అనవసరమైన భయం.

1. అవసరమైన భయం :
ఇది తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే మనిషి ప్రాణాలకే మువ్ప రావచ్చు.

ఉదాహరణకు శాస్త్రజ్ఞులు ఒక ఎలుకలో పిల్లి గురించి కలిగే భయానికి సంబంధించిన కణాలను తొలగించారు. అప్పుడా ఎలుక పిల్లి ముందుకు వెళ్ళి నిర్భయంగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆ పిల్లి చటుక్కున దానిని నోట కరుచుకుపోయింది. కనుక మనిషికి అవసరమైన భయం ఉండడం వల్లనే అన్ని రకాలుగా జాగ్రత్తపడుతుంటాడు.

2. అనవసరమైన భయం:

మనిషి తన మనసుకు ఇష్టం లేనిదేదో జరుగుతుందన్నప్పుడు భయం కల్గుతుంది. తద్వారా దుఃఖం కల్గుతుంది. డిప్రెషన్ (దిగులు) కలుగుతుంది. ప్రతి మనిషి తనకు తన వారికీ ఏదైనా కష్టనష్టాలు జరుగుతాయేమోనని ఊహించుకుని భయపడుతుంటారు. ముఖ్యంగా తనకు వచ్చే రోగాల గురించి తోటి జీవుల వల్ల వచ్చే ఆపదల గురించి ప్రకృతి వైపరీత్యముల గురించి మనిషి ఎప్పుడూ భయపడుతుంటాడు. మరణం గురించి అయితే ఎప్పుడూ భయమే. శ్రీకృష్ణుడు గీతలో "జాతన్య హిదువో మృత్యు...." అన్నాడు. _సుఖనంతరం దుఃఖం, దుఃఖాస్యానంతరం సుఖం, చక్రవత్సరివర్తంతే" అలాగే

స్థిరంజీవనంలోకే, అస్థిరం యౌవనం ధనం, అస్థిరం దారపుత్రామ కీర్తిర్యపరమేయ " అని అన్నారు మహాత్ములు ప్రతి జీవికి ఆహారం, భయం, నిద్ర, మైధునం సహజం.
సిరిదావచ్చిన వచ్చును. సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదాపోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

కనక తనకు కల్గిన సుఖాలు ఎక్కడ కరిగి, తరిగి పోతాయోనని మనిషి ఆనవసరంగా భయపడుతుంటాడు. భయాన్ని జయించటానికి కొన్ని ఉపాయాలు ....

1. తాను ధైర్యవంతునిగా భావిస్తూండటం
2. ధీరత్వం కల్గిన వివేకానంద, నేతాజీ వంటి మహాత్ములను స్మరించడం

3. అనవసర భయానికి గల కారణాలను గుర్తించి, విశ్లేషించి దానికి పరిష్కారాన్నికనుక్కోవడం

4. ఒకే ఒక దైవాన్ని పూర్తి శరణం పొంది, సర్వకాల సర్వావస్థలలో ఆయననుమరిస్తూ జరుగుతున్నది / జరగబోయేది ఆయన సంకల్పమేనని తలంచి
స్వీకరించడం

5. భయం తీవ్రత ఎక్కువగా ఉంటే కౌన్సిలింగ్ ద్వారా మేలు పొందడం

6. భయం ఊరకుక్క లాంటిది. పారిపోతే వెంటబడుతుంది. ఎదురుతిరిగితేతోకముడుస్తుంది..

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment