Sunday, April 24, 2022

కధ - 'పిట్ట కథే' అయినా దీని నుండి మనం చాలా నేర్చుకోవలసి ఉంది. ఇక కథ....‌

ఒక చిన్న పిట్ట కథ
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

😊‌ కధ - 'పిట్ట కథే' అయినా దీని నుండి మనం చాలా నేర్చుకోవలసి ఉంది. ఇక కథ....‌😊

💫‌ ఇంట్లోకి పక్షులు రావాలని మా ఊరి నుంచి ధాన్యము కంకులు తీసుకొచ్చి మేడపైన కట్టాను, అబ్బే... ఏడాది గడచినా ఆ కంకులు ఏమాత్రము తరగలేదు.

💫 ఆ తరవాత కొన్ని మందార మొక్కలు వేశాను. ఆ మొక్కల మీద ఉన్న పురుగుల్ని తినేవి ఆ పక్షులు.
[("మీ మనుషుల్లా ఫ్రీ ఫుడ్ కి కకుర్తి పడే వాళ్ళము కాము" అన్నట్నిటనిపించేది)].

💫 ఆ మొక్క కాస్త పెద్దదయ్యి కొమ్మలు వచ్చేసరికి కొన్ని పక్షులు గూడు కట్టుకొని, రోజూ రావడము జరిగేది, ప్రతీ సంవత్సరం మెటర్నిటీ హాస్పటల్ కి వచ్చినట్టు వచ్చి, గుడ్లు పెట్టుకునేవి.

💫 రోజూ పిల్లలకు తిండి తెచ్చే తల్లి పక్షి ఒకరోజు పొద్దుట నుంచీ రాలేదు. ఆ పిల్లలు ఒకటే అరుపులు, ఆకలికో, మరి అమ్మ కనపడలేదనో! మధ్యాహ్నం ఆ పిల్లలు అరుస్తుంటే బెంగ వేసి వాటి దగ్గరకు వెళ్ళాను. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో తల్లి పక్షి "జాగ్రత్త" అన్నట్టు, నా నెత్తి తాకుతూ వేరే చెట్టు మీదకి వెళ్ళి అరవడం మొదలెట్టింది. అంతే.... ఈ పిల్లలు కిలకిలలు. ఆ తల్లి వీటి దగ్గరకు రాలేదు, పిల్లలే చిన్న చిన్నగా ఎగురుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళాయి, అంతే అన్నీ కలిసి ఒక్కసారి గగనం అంతు చూడటానికి వెళ్ళిపోయాయి.

💫 ఆ తల్లి పిల్లలకు ఒక పూట తిండి ఇవ్వక ఎగరడం నేర్పింది కదా!

💫 ఇవన్నీ చూస్తుంటే వీటికి ఇవన్నీ ఎవరు నేర్పారు?

💦 నిన్నటి వరకు మొగ్గగా ఉన్న పూవ్వులో మకరందము,
💦 అప్పుడే పుట్టిన చేప పిల్లకి ఈదడం...
💦 ఇలా ఇవన్నీ... నేర్పేది ప్రధమ గురువు ప్రకృతి. "యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా... " అన్నట్టు ఆ తల్లే అన్నీ నేర్పుతోంది.

💫 ప్రకృతి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తోంది.. మనల్ని బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతికే అవకాశం ఇవ్వమని.

💫 కానీ మనమే నేను, నా తరవాత నా కొడుకు, ఆ తరువాత నా మనవడికి, ఆ తరవాత వాడి కొడుక్కి.. ఇలా తరతరాలకు సంపాదించేసుకుంటూ ప్రకృతిని ఎంత ఇబ్బంది పెడుతున్నామో కదా!

💫 ఒకప్పుడు తరిగిన కూర ముచికలు మొదలైనవి మొక్క మొదట్లో పోసేవాళ్లము, ఇప్పుడు ప్లాస్టిక్ సంచులలో.. అవి కుళ్ళుకుళ్ళీ ఎన్నేళ్లకో ఆ ప్లాస్టిక్ నుంచి బయటకు వస్తాయి. ఎక్కడా ఒక్క మొక్క పెంచము...

💫 ప్రకృతి అన్నీ సహిస్తుంది.... ఎందుకంటే, తను "ఆబ్రహ్మకీట జనని" కదా. కరుణతో శాకాంబరీదేవి గా అన్నీ ఇస్తుంది.

💫 సముద్రం మీద ప్రపంచంలోనే పెద్ద ఆనకట్ట కట్టి భూమి తిరిగే సమయాన్ని తగ్గించేసి చాలా గర్వంగా విర్రవీగామే, ఎన్నో టవర్లు కట్టి ఈ జీవిని దాని బ్రతుకు దాన్ని బ్రతకనివ్వకుండా రాక్షసులము అయ్యాము కదా... ప్రకృతి వాటికి కూడా తల్లే... ఊరుకుంటుందా?

💫 నాకన్నా దక్షుడు ఎవడూ లేడని ఏనాడైతే మనిషి అహంకారానికి పోయాడో.. ఆ నాడే దక్షయజ్ఞవినాశిని గా అవతరించడానికి పూనుకొని... ఇదిగో ఇలా బుద్ధి చెబుతూ ఉంటుంది.

💫 ఎంత కరుణారస సాగరి అయినా ఆ ప్రకృతిని బాధిస్తే "మహాప్రళయ సాక్షిణి " అవుతుంది.

💫 మనమే ఈ ప్రకృతికి, భూగోళానికి పట్టిన వైరస్‌లము, దానికి మందు గా ఇదిగో ఈ "కరోనా" ను సృష్టించింది.

💫 దాని మూలంగా చైనా లో గాలి కాలుష్యము తగ్గిందిట, ఇటలీ లో నదులలో కాలుష్యము తగ్గిందిట. ఈ కొద్దిరోజుల్లో మనమెంత కాలుష్యాన్ని అరికట్టామో గుర్తుతెచ్చుకోండి.

💫 కొన్నిరోజులు నీళ్ళు పోస్తేనే నాలుగు పువ్వులిచ్చి ధన్యవాదాలు చెబుతుంది మొక్క.

💫 మనకిన్ని ఇచ్చిన ప్రకృతికి మనమూ తగిన విధంగా ధన్యవాదాలు చెప్పలేమా?

💫 ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్లాస్టిక్ వాడకం మానేద్దాము, వేరే జీవాలకు బ్రతికే అవకాశం ఇద్దాము. పొద్దుటే పూజలో "వాయుర్వా అపాం పుష్పం .... ఆ యతనావాన్ భవతి " అని నీటిని, భూమి, గాలిని రక్షిస్తాను అని మనోపుష్పం (మంత్రపుష్పం) పట్టుకొని ప్రమాణం చేస్తాము కదా.. అలా వాటిని రక్షిద్దాము. అప్పుడే అసలైన శ్రీమంతులము.. అంటే "పుష్పవాన్, ప్రజావాన్, పశుమాన్ (భూమి, సంతానము, పాడి కలిగి ఉండటం) అవుతాము.


సర్వేజనాః సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
లోకాః సమస్తా సుఖినోభవంతు

సేకరణ

No comments:

Post a Comment