Sunday, April 24, 2022

జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?

జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?

ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.

ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.

ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.

ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.

అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.

సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.

అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.

ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు...

✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

సేకరణ

No comments:

Post a Comment