Sunday, April 17, 2022

కవిత్వం గురించి కవి "దండమూడి శ్రీచరణ్" గారి గురువుగారు చెప్పిన కొన్ని విషయాలు ...

మా గురువు గారి ఉపదేశాలు!
----------------------------------------
కవిత్వం గురించి మా గురువుగారు కొన్ని విషయాలు చెప్పారు.అవి ఇవి:

*కవిత రాయాలని కూర్చొని రాయకూడదు.కవిత రాయాలనిపించి కూర్చొని కవిత రాయాలి!

*కవిత ఉద్దేశం నీ చదువరిలో అనుభూతి ప్రేరేపించడం.నువ్వు అనుభూతి చెందనప్పుడు అది సాధ్యపడదు

*కవిత నువ్వొక్కడివే కాదు రాసేది.ముగ్గురు రాస్తారు.ఒకరు ఆస్వాదకులు.రెండవవారు విమర్శకులు.మూడోవారు మీరు.ఈ ముగ్గురూ మీలోనే ఉండాలి.అప్పుడే మంచి కవిత రాస్తారు.

*కవిత బాగా రావాలంటే మీ ఆత్మ అందులో ఉండాలి.అది ముఖ్యం.అప్పుడు మీ కవిత చదువరి ఆత్మను కదిలిస్తుంది.

*పద సంపద మీ వద్ద బాగా ఉంది కదా అని క్లిష్టమైనవి,అరుదైనవి, మీకు గొప్పగా అనిపించినవి అయిన పదాలు వాడకూడదు.ఏ పదం మీ భావాన్ని బాగా వ్యక్తీకరించగలదో తెలిసి ఉండడమే విజ్ఞత!అప్పుడే చదువరిని మీ కవిత స్పందింపజేయగలదు.

*మీకే స్పష్టత లేకుండా కవిత రాయకూడదు.

*కవిత మనసులోని సంగీతానికి అనుగుణ్యంగా రాస్తే,ఆ శైలి బాగా ఆకట్టుకుంటుంది.అంటే ముందుగా మీ మనసులో సంగీతం ఉండాలి.

*మీ కవితలో ఎవరినీ కించపరచరాదు. ఇతరుల పట్ల సంస్కారం చూపాలి.సహృదయత ఉండాలి. అది మీకు హుందాతనాన్ని ఇస్తుంది.

*కవిత బలంగా రావాలి అని ఘాటు పదాలు వాడాల్సిన అవసరం లేదు.ఎప్పుడు ఏ పదం సముచితమో అదే పదం వాడాలి.

*కవిత్వం గౌరవం తెస్తుంది నిజమే.అయితే ముందుగా కవిత్వాన్ని ప్రేమించాలి.

--- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

No comments:

Post a Comment