Tuesday, May 24, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

మన జీవితంలో కాలం ఎవ్వరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచుతుందో ఎవరికి తెలియదు.

ఒకటి చెప్పాలంటే, మనసుకి ఆశ ఎక్కువ దేన్నైనా కావాలి అంటుంది,కాని కాలానికి అనుభవం చాలా ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలి అదే ఇస్తుంది కాబట్టి జీవితం,

కాలం ఇవి రెండు గొప్ప గురువులు...
కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో...జీవితం చెబుతుంది..!!
జీవితం ఎంత విలువైందో...కాలం చెబుతుంది.....

ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా మన ప్రశ్నకు సమాధానం లభించదు.

అక్కడితో ఆ విషయం వదిలేసేవాడు నిరాశావాది. జవాబు లేని ప్రశ్న ఉండదు అనుకునేవాడు,సాధించే వరకు నిద్రాహారాలు మాని శోధించాలి,సాధించాలి అనుకునేవాడు ఆశావాది.

విజయం కొందరి పక్షాన ఉండటానికి కారణం ఈ లక్షణమే! ప్రశ్నకు తగ్గ సమాధానం లభించడం అంత సులభం కాదు.

ప్రశ్నించే వ్యక్తిలో ఓర్పు, నేర్పు, సమాధానం రాబట్టే నైపుణ్యం ఉండాలి.

అప్పుడే మనిషిగా పుట్టినందుకు ఒక్క విషయంలోనైనా పట్టు సాధించినప్పుడే మన జన్మ సార్ధకమైనట్టు ...

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment