Tuesday, May 24, 2022

విజయం అంటే ఏమిటి?

ప్లీజ్. అందరూ మనసుపెట్టి ఒక్కసారి చదవండి. విజయం అంటే ఏమిటి?

మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ…. “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.
అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.
[ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]

బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు! అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.

మరో యువకుడు లేచి “విజయం అంటే బలం / శక్తి” అన్నాడు.

అలా అయితే అలెగ్జాండర్ , నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.

మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట!
మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు.

”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.

మా అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.

చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - “విజయం అంటే ఏమిటి?” అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?” ‘తెలియదు’ అన్నారు.
అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , అందరూ…?”

”ఓ , తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు.

”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అంది : “సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే…. తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!”

నా గురించి నేను దు:ఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment