Monday, June 13, 2022

మంచి మాట..లు(12-06-2022)

12-06-2022:-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట.లు

మన ఎదురుగానే మాట్లాడే వారు స్నేహితుడు. నలుగురిలో విమర్మించే వారు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడే వారు ద్రోహి. మనకు సాయం చేసే వారు మిత్రుడు. మనకు మంచి మాటలు చేప్పేవారు గురువు నీతిగా బ్రతికే వారు మనిషి.

మీరు మీ జీవితంలో ఎవర్ని విమర్శించకండి... వీలు అయితే ప్రోత్సహించండి.. లేదా సైలెంల్ గా ఉండండి. అంతే కాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది.

మనిషిని చూడరు.. మనస్సును చూడరు.. వ్యక్తిత్యాన్ని చూడరు.. కనిపించింది, వినిపించింది నమ్మేస్తారు. మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరోకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి నేస్తమా!

నేటి సమాజంలో సాయం చేసే వారు తక్కువ. నీతులు చెప్పేవారు ఎక్కువ. తనను తాను మలుచుకోలేని వారు కూడా ఇతరుల జీవితాల్లో మలుపులు తిప్పడంలో అనుభవజ్ఞులు అవుతున్నారు.

ఒకే రకమైన మెటీరియల్స్ తో అడ్డు గోడ నిర్మించవచ్చు..బ్రిడ్జి నీ నిర్మించవచ్చు.. గోడ మనుషులను విడదీస్తుంది.. బ్రిడ్జి మనుషులను కలుపుతుంది

బతికి ఉన్నప్పుడే భగవద్గీత చదవండి తరవాత చదువుదాం అనుకుంటే ఆచరించటానికి సమయం ఉండదు.. చివరికి శవం ముందు వినిపించినా ఉపయోగం ఉండదు..

సేకరణ ✒️AVB సుబ్బారావు 🤝

No comments:

Post a Comment