Wednesday, June 8, 2022

🍁పట్టుదల🍁🍃🥀దశరత్ మాంజి..ఓ 26 ఏళ్ల యువకుడు..బీహార్ లోని ఓ మారుమూల గ్రామం..

🍁పట్టుదల🍁

📚✍️ మురళీ మోహన్

🍃🥀దశరత్ మాంజి..ఓ 26 ఏళ్ల యువకుడు..బీహార్ లోని ఓ మారుమూల గ్రామం..

ఇతనికి కొత్తగా పెళ్లయింది, అదే సంవత్సరం అతని భార్య గర్భవతి అయింది.. వీళ్ళు నివసిస్తున్న గ్రామంలో నీళ్ల వసతి లేదు.. నీళ్లు తెచ్చుకోవాలి పక్క గ్రామం వెళ్లి తెచ్చుకోవాలి, వైద్య సౌకర్యం కోసం కూడా వేరే ఊరు వెళ్ళాలి.. వేరే ఊరు వెళ్ళాలి అంటే ఒక కొండ ఎక్కి దిగాలి.. లేదా చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే 70 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి..

ఓరోజు దశరత్ మాంజి పనికి వెళ్తే అతని భార్య అతనికి చద్ది తీసుకుని వెళ్తుంది.. కొండ ఎక్కేటప్పుడు కాలు అదుపు తప్పి కింద పడిపోతుంది..
దూరం లో ఉన్న దశరత్ చూసి ఎవరో పడి పోయారు అంటూ పరుగు పరుగున వచ్చి చూస్తే..అతని భార్యనే..వెంటనే ఆమెను చేతుల్లోకి తీసుకుని కొండ ఎక్కి దిగేలోపే ఆమె ప్రాణం పోయింది..

దహన సంస్కారాలు అయ్యాక నేను ఎంతో ప్రేమించే భార్య లేదు ఇక నేను బ్రతికుండి ఏమి ప్రయోజనం అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ లేదు నేను చనిపోతే మహా అయితే నాలుగు రోజులు నా కుటుంబం ఏడుస్తుంది అంతే గాని నాకోసం ఎవరూ రారు ఇలా సాగుతోంది అతని ఆలోచన ధోరణి..
ఒక రోజు ఇలాగే ఆలోచనలో పడ్డాడు నా భార్యలా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చనిపోకూడదంటే అని ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు అంతే..

ఓ పలుగు, పార పట్టుకుని కొండ వైపు కదిలి కొండను తవ్వడం మొదలు పెట్టాడు.. ఇది చూసిన అతని బంధువులు అతని ప్రయత్నాన్ని అరేయ్ దశరత్ అది కొండరా నీ జీవితం మొత్తం ప్రయత్నం చేసినా అది తవ్వడం పూర్తి కాదని, మాను కొమ్మనికుటుంబ సభ్యులు కొన్ని రోజులు,స్నేహితులు కొన్ని రోజులు, చుట్టు పక్కల వాళ్ళు కొన్ని రోజులు ఎంతో ప్రయత్నం చేశారు..

ఎవరి మాట వినలేదు సరికదా అసలు ఊళ్ళోకి వెళ్లటమే మానేశాడు.. ఎందుకంటే ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు తనని ఆపే ప్రయత్నం చేస్తున్నారని..
అలా ఒకరోజు, రెండు రోజులు కాదు ఏకంగా 22సంవత్సరాలు.. వర్షము చూడట్లేదు,
ఎండ చూడట్లేదు, చలి చూడట్లేదు..తవ్వుతూనే ఉన్నాడు తవ్వుతూనే ఉన్నాడు..చివరికి సాధించాడు..

అది ముగిసే సరికి అతనికి 48 ఏళ్ళు వచ్చాయి. 22 ఏళ్ళు నాన్ స్టాప్ గా పని చేసాడు..
పక్క గ్రామానికి వెళ్ళాలి అంటే ఒకప్పుడు ఒకరోజు పట్టేది ఇప్పుడు కేవలం అరగంట మాత్రమే పడుతుంది..

దినిగురించి తెలుసుకున్న బీహార్ ప్రభుత్వం అక్కడ పెర్మినెంట్ రోడ్ వేయించి ఆ రోడ్ కి దశరత్ మాంజి అని పేరు పెట్టింది..అంతేకాదు ఆ ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కట్టించి అతని పేరే పెట్టింది..
అంతేకాదు కాదు దశరత్ మాంజి పేరు మీద స్కూల్ కూడాకట్టించింది..

అంతేకాదు..బీహార్ లో ఎవరైతే గొప్ప గొప్ప సామాజిక పనులు చేస్తారో వాళ్లకు ఇవ్వడానికి ఒక గొప్ప అవార్డు పెట్టింది.. ఆ అవార్డ్ పేరే..దశరత్ మాంజి..ఇంటర్ లో ఫెయిల్ అయితే ఒడిపోయినట్టు కాదు, డిగ్రీలో ఫెయిల్ అయితే ఒడిపోయినట్టు కాదు..

ఒక పనిలో ఫెయిల్ అయితే ఒడిపోయినట్టు కాదు.. ప్రయత్నం చేయడమే మన ముందున్న లక్షంగా పెట్టుకోవాలి గాని ఇక ఇంతే జీవితం అంటే ఏది సాదించలేము అంటూ ఏది లేదు..🍃🥀

సేకరణ

No comments:

Post a Comment