Thursday, June 2, 2022

మనకు అందకుండా కప్పిపెట్టబడ్డ చరిత్ర. మీలో ఎంతమంది గోపాల్ ముఖర్జీ గురించి విన్నారు ?

 చరిత్రలో మనకు తెలియనివ్వని కొన్ని నిజాలు. 

మనకు అందకుండా  కప్పిపెట్టబడ్డ చరిత్ర.


మీలో ఎంతమంది గోపాల్ ముఖర్జీ గురించి విన్నారు ?

 

మీలో ఎంతమంది కలకత్తా ను పాకిస్తాన్ లో కలపకుండా అడ్డం పడి కాపాడిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి విన్నారు ? 


90 % విని ఉండరు. ఆ తప్పు మీది కాదు. 


చరిత్ర అంటే 5 స్టార్ సౌకర్యాలతో కూడిన ఆగాఖాన్ పాలెస్ లాంటి జైళ్ళలో సేద తీరుతూ ఆత్మకధలు రాసుకుంటూ వీరపోరాటం చేసిన, ఒంటి మీద ఒక్క లాటీ దెబ్బ పడని వీరస్వతంత్రయోధులు గాంధీ నెహ్రూ చరిత్ర మాత్రమే  అని దరువు చేస్తూ,  మిగతా యోధులందరి పోరాటాలు మరుగుపరచి గాంధీ నెహ్రూ లు మాత్రమే ఒంటి చేత్తో అహింస, సత్యాగ్రహాలు అనే ఆయుధాలతో బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి స్వతంత్రలక్ష్మిని పీక్కొచ్చి మన ఎదాన కొట్టారు అనే చర్వితచరణ అబద్దపు ముతక ముసుగు మనకు కప్పారు కాబట్టి.


మీరు బెంగాల్ కలకత్తా మారణకాండ గురించి విన్నారు కదా ! అలాగే నవకాలీ మారణహోమం గురించి కూడా విని ఉంటారు. అంతేకాదు. బోసినవ్వుల గాంధీ తాత తన అహింసాయుత నిరాహారదీక్ష ఆయుధంతో ఈ అల్లర్లను ఒంటి చేత్తో ఆపేసి మానవత్వాన్నీ సర్వమతసామరస్యాన్నిఎలా కాపాడేసాడో అన్న విషయం కొన్ని వందలసార్లు మీరు విని ఉంటారు.


దాని వెనుక కధ కాస్త విపులంగా :


పాకిస్తాన్ ఏర్పాటు కోసం మహమ్మాదాలీ జిన్నా 1946 ఆగస్ట్ లో  డైరెక్ట్ ఆక్షన్ డే కు పిలుపు ఇచ్చాడు. డైరెక్ట్ ఆక్షన్ డే  అంటే అందిన హిందువులను అందినట్లు ఊచకోత కోసి హింసాకాండ సృష్టించి  భయోత్పాతం కలిగించి పాకిస్థాన్ ఏర్పాటు కు బ్రిటీష్ వారినీ కాంగ్రెస్ నాయకత్వాన్నీ మెడలు వంచటము. 


స్వతంత్రం రావటానికి ముందు భారతదేశం లో కలకత్తా అతిపెద్ద పారిశ్రామిక నగరం , వాణిజ్యకేంద్రం . దేశఅర్ధిక వ్యవస్థకు ఆయువుపట్టు కలకత్తా.   


ఈ కలకత్తా ను రాబోయే రోజుల్లో ఏర్పడబోయే పాకిస్థాన్ కు పొందాలనేది జిన్నా దురాలోచన. జిన్నా కోరుకున్న పాకిస్తాన్ 1947 లో ఏర్పడిన పాకిస్తాన్ కాదు.  


అస్సాం, పంజాబ్, బెంగాల్ పూర్తిగా మరియు బీహార్ లో కోంతభాగం తో కలసి సీంధ్, బెలూచ్మ్ NEFA ప్రాంతాలతో  పాకిస్తాన్ ఏర్పడాలనేది జిన్నా ప్రణాళిక. 


1946 లో బెంగాల్ ముఖ్యమంత్రిగా హుసేన్ షహీద్ సుహ్రవర్ధీ ఉండేవాడు.  కలకత్తా మారణకాండ వెనుకా నవకాలీ మారణకాండ కు సూత్రధారి ఈ సుహ్రావర్ధీనే. ఈ సుహ్రావర్ధీని గాంధీ మహాత్ముడు తన ప్రియతమ దత్తపుత్రుడంటూ అక్కున చేర్చుకునేవాడు. జిన్నా ఈ సుహ్రావర్దీని తన ప్రణాళికలో భాగమయిన బెంగాల్ మారణకాండకు ఎంచుకున్నాడు. 


1946 లో కలకత్తా లో 64% హిందువులు 33% ముస్లిములూ ఉండేవారు.


1946 ఆగస్ట్ 16 . రంజాన్ మాసంలో 18 వరోజు. ఆ రోజు జిహాదీ వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసారు. నమాజ్ కోసం మసీదులకు చేరుకున్నారు. నమాజ్ అనంతరం ప్రణాళిక ప్రకారం అల్లర్లు మొదలెట్టారు. హిందువుల మీద హిందూ దుకాణాల మీదా, ఆవాసాల మీదా దాడులు మొదలు పెట్టారు. హిందువుల ఊచకోత మొదలయ్యింది. అనేకమంది హిందూ స్త్రీలు కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాప్ చేయబడ్డస్త్రీలు రేప్ చేయబడ్డారు చంపబడ్డారు. 


బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సుహ్రావర్ధీ జిహాదీ మూకలకు పోలీసుల ఈ అల్లర్లలొ జోక్యం కలిగించుకోకుండా ఆదేశాలు ఇచ్చినట్లు, పోలీసులు ఈ విషయంలో కలగచేసుకోరు అని హామీ ఇచ్చాడు. 


కర్రలూ కత్తులూ ఇనుపరాడ్ లు పట్టుకుని జిహాదీ మూకలు కలకత్తా మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో యధేచ్చగా చెలరేగిపోయారు. 


ముస్లింలీగ్ ఆఫీసు దగ్గరలో ఉన్న ఒక హిందూ దుకాణంతో దాడి మొదలయ్యింది.  అల్లరిమూకలు ఆ హిందూ షాపును దోచుకుని, తగలబెట్టి యజమానినీ ఆ షాపు ఉద్యోగులను నరికి చంపారు.  అల్లర్లలో హిందువులను నరికి పోగులు పెట్టారు. హిందూ స్త్రీలను ఎత్తుకుపోయి సెక్స్ బానిసలుగా వాడుకున్నారు. 


ఆ విధంగా 1947 ఆగస్టు 16 న డైరెక్ట్ రాక్షన్ డే పేరున యధేచ్చగా హిందువుల మారణకాండ జరిగింది. వేలాదిగా హిందువులు చంపబడ్డారు. 


1947 ఆగస్ట్ 17. మారణకాండకు రెండవరోజు. కేశోరామ్ కాటన్ మిల్స్ లో 600 మంది ఒరిస్సా కూలీలు నరకబడ్డారు. నగరమంతా యధేచ్చగా మారణకాండ జరిగింది. వేలాది మంది హిందువులు ఊచకోత కు గురి అయ్యారు. 


మరణమృదంగం హోరులో హిందువులు కకావికలు అయ్యారు. ఊరు వదిలి పారిఫొవటం మొదలయ్యింది. సుహ్రావర్ధీ అంచనా ప్రకారం హిందువులు పిరికివారు. పారిపోతారు తప్ప ఎదురు నిలిచి పోరాడే దమ్మూ ధైర్యం లేనివారు. ఆగస్ట్ 19 నాటికి కలకత్తా నగరం మొత్తం తమ గుప్పిట లోకి వచ్చితీరుతుంది అని అంచనా వేసుకున్నారు సుహ్రావర్ధీ మరియు ఇతర ముస్లీంలీగ్ నాయకులు.  


అప్పుడే ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్నది. ఆగస్ట్ 18 న గోపాల్ ముఖర్జీ అనే యువకుడు ఈ మారణకాండ ను ఎదిర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆతడు కులానికి బ్రాహ్మణుడే గానీ అతడి వ్యాపారం  ఒక మాంసం దుకాణం.


గోపాల్ ముఖర్జీ 33 ఏళ్ళ యువకుడు, సుభాశ్ చంద్రబోస్ అనుచరుడు, గాంధీ వ్యతిరేకి. గాంధీ బోధించే అహింస,  ఒంటిచేతి చప్పట్ల లాంటి  హిందూ ముస్లిం భాయ్ భాయ్  వంటి వెర్రిమొర్రి పిచ్చి  సిద్దాంతాలకు వ్యతిరేకి. 


గోపాల్ ముఖర్జీ భారత్ జాతియబాహిని అనే వ్యాయమ సంఘటన్ ను నడిపేవాడు. అందులో 500 నుండి 700 మంది సభ్యులు ఉండేవారు. వారందరూ సుశిక్షితులే.  


గోపాల్ ముఖర్జీ తాము పారిపోగూడదనీ, జిహాదీ గూండాలని ఎదిరించి పోరాడాలని ఆగస్ట్ 18 న నిర్ణయించుకున్నాడు. వ్యాయామశాల లోని తోటి సహచరులను కూడా ఉత్తేజపరచి వారికి అవసరం అయిన ఆయుధాలను అందించాడు. ఒక మార్వాడీ వ్యాపారి అవసరమైన ధనసహాయం చేసాడు.


గోపాల్ ముఖర్జీ ముందుగా హిందూ ఏరియాల రక్షణకు ఏర్పాటు చేసాడు,. ప్రతి హిందూ యోధుడూ 10 మంది జిహాదీ గూండాలను చంపాలని నిర్ణయం చేసుకున్నారు. 


ముస్లింలీగ్ దగ్గర బోలెడంత ఆర్ధికవనరులు ఉన్నాయి. వేలసంఖ్యలో జిహాదీ ఉన్మాదులు  ఉన్నారు. కానీ గోపాల్ ముఖర్జీ దగ్గర ఉన్నది కొద్దిమంది యోధులు కొద్దిపాటి ధనం మాత్రమే. అయినా కలకత్తా నగరం చేజారిపోయి  జిహాదీ నగరంగా మారనివ్వగూడదని ధృడసంకల్పం తో బండగా నిలబడిపోరాటం మొదలుబెట్టారు. ఈ పోరాటంలో ముస్లిం స్త్రీల జోలికీ పిల్లల జోలికీ పోగూడదని ఆన పెట్టుకున్నారు. గతంలో చత్రపతి శివాజీ మహరాజ్ గానీ రాణా ప్రతాప్ లాంటి అనేక హిందూ యోధుల బాటనే వారు కూడా ఎంచుకున్నది. 


అజాద్ హిందు ఫౌజ్ నుండి గతంలో సంపాదించిన 2 పిస్టల్స్ గోపాల్ ముఖర్జీ దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్న ఆయుధాలతో వారు, ఆగస్ట్ 18 1946 మధ్యాహ్నం జిహాదీ మూకల మీద పోరాటం మొదలెట్టారు. ఆగస్ట్ 18 న జిహాదీ మూకలు ఒక హిందూ కాలనీ మీద దాడి చేసాయి. గోపాల్ ముఖర్జీ సైన్యం వారిని విజయవంతంగా చావగొట్టి తరిమేసాయి. 


ఆగస్ట్ 18 - 19 మధ్య గోపాల్ సైన్యం అందిన ప్రతి జిహాదీ ఉన్మాదిని అందినట్లు చంపారు. ఆగస్ట్ 19 నాటికి హిందూ ఏరియాల నుండి జిహాదీలను తరిమివేయగలిగారు. 


హిందువులను దద్దమ్మలుగా అంచనా వేసిన సుహ్రావర్దీకి దిమ్మతిరిగింది. హిందువుల ప్రతిఘటనను అతడు అసలు అంచనా వేసుకోలేదు. 


ఆగస్ట్ 19 నాటికి హిందూ ఏరియాలను కాపాడుకోగలిగిన గోపాల్ ముఖర్జీ 20 నుండి హిందువుల మీద దాడికి ప్రతీకారం తీర్చుకోవటం మొదలు పెట్టాడు. అందిన జిహాదీని అందినట్లు నరికారు. 


గోపాల్ ముఖర్జీ ఇచ్చిన ఉత్తేజంతో నగరంలోని హిందువులు సంఘటితంగా ఎదురుదాడులు మొదలుబెట్టారు. ఆగస్ట్ 21 నాటికి హిందువులు ప్రతీకారదాడులు మొదలుబెట్టారు. ఆగస్ట్ 21 నాటికి జిహాదీ మూకలు చంపిన హిందువుల సంఖ్య కంటే హిందువుల చేతుల్లో చచ్చిన జిహాదీల సంఖ్య ఎక్కువ అయ్యింది.  ఆగస్ట్ 22 నాటికి సుహ్రావర్ధీ ప్లాన్ రివర్స్ అయింది. నగరం నుండి హిందువులు కాక జిహాదీలు పారిపోవటం మొదలు అయ్యింది. 


సుహ్రావర్ధికి తత్వం బోధపడింది. ముస్లిములను కాపాడుకోవాలి. వెంటనే కాంగ్రెస్ నాయకుల దగ్గరకి పరుగెత్తికెళ్ళి గోపాల్ ముఖర్జీ ని ఎలాగైనా ఆపాలని వేడుకున్నాడు. కాంగ్రెస్ నాయకులు సెక్యులర్ పరమాత్మలు. ముస్లిముల వెంట్రుక కదిలినా ఓపలేరు. సరిగ్గా సమయం చూసుకుని భవిష్య జాతిపిత సీన్ లోకి విచ్చేసారు. అలవాటయిన నిరాహార అస్త్రాన్ని ప్రయోగించాడు. హిందువులను ఊచకోత కోస్తున్నప్పుడు గుర్తురాని అహింసా సిద్దాంతం హిందువులు తిరగబడి ప్రతీకారం తీర్చుకుంటున్నప్పుడు బొసినవ్వుల గాంధీతాతకు మానవత్వం , సర్వమతసహనం ఇత్యాదివన్నీ గుర్తుకు వచ్చాయి. 


ఈ లోపు సినిమా చివర్లో పోలీసులు పరుగెత్తుకు వచ్చినట్లు, హిందువుల ప్రతీకారదాడులు పెరుగుతున్నప్పుడు పోలిసులకు కూడా శాంతిభద్రతలు కాపాడాల్సిన డ్యూటీ గుర్తుకు వచ్చి లైన్లోకి వచ్చేసారు. 


గాంధీతాత రెండుసార్లు గోపాల్ ముఖర్జీ ని పిలిపించి అహింసా సిద్దాంత ప్రాశస్త్యం గురించియున్నూ హిందూ ముస్లిం భాయ్ భాయ్  బిజినెస్ ప్రాముఖ్యత గురించియున్నూ తీవ్రహితబోధ చేసాడు. కానీ గోపాల్ ముఖర్జీ పట్టింౘుకోలేదు. ఆయుధాలు విడనాడటానికి అంగీకరించలేదు. 


బోసితాత గారి సెక్రటరీ గోపాల్ ముఖర్జీ కి ఎంతో నచ్చచెప్పటానికి చూసాడు. మహాత్ములవారి హితోపదేశం ను పాటించి ఆయుధాలను విడిచి అహింసా మార్గంలోకి రావాలని సూక్తిముక్తావళి దట్టించాడు. 


గోపాల్ ముఖర్జీ సమాధానం ఖరాఖండీగా  ఒక్కటే చెప్పాడు. " హిందువులను నరికి పోగులు పెడుతున్నప్పుడు హిందూ స్త్రీల మీద అత్యాచారం చేసినప్పుడూ గాంధీగానీ గాంధీ ముప్పొద్దులా హిందువులకు ఉపదేశిస్తున్న అహింసా మంత్రం గానీ కాపాడలేదు.  వారిని కాపాడింది ఈ ఆయుధాలే. ఈ ఆయుధాలను అందుకే వదిలే ప్రసక్తే లేదు" 


చివరకు కరడుగట్టిన జిహాదీ మతోన్మాది సుహ్రావర్దీ కూడా హిందువులు శాంతియుతంగా ఉన్నంత వరకే సరి, ఎదురు తిరిగి దెబ్బతీయాలనుకుంటే వారంత ప్రమాదకరం అయిన జాతి మరొకటి లేదు అంటూ  తన పరాజయాన్ని అంగీకరిచాడు. 


మరి గాంధీ పుణ్యాత్ముడి అహింసా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన గోపాల్ ముఖర్జీ పేరు బయటకు వస్తే సెక్యులర్ ఆత్మ పుట్టి మునిగిపోదూ. అందుకే చరిత్రలో గోపాల్ ముఖర్జీ పేరు అనేది కనపడకుండా చేసేసారు. మనకు తెలియనివ్వని ఇలాంటి గోపాల్ ముఖర్జీలు వేనకువేలు. చరిత్రలో గణుతికెక్కిన సుభాస్ చంద్రబోస్, వీర్ సావర్కార్ లాంటి వారిని మరొకరకంగా అణచివేసారు.


స్వతంత్రవీరులను మరచిపోగల దిక్కుమాలిన జాతి ఈ సమస్త భూమండలంలోనూ కేవలం ఒక్క భారతదేశం మాత్రమే.


ఉపసంహారం :


ఆ రోజు సుహ్రావర్ధీ అన్నట్లు హిందువులు శాంతియుతంగా ఉన్నంతవరకే , తిరగపడితే అంతు చూస్తారు అన్న దానికి కొన్ని ఉదాహరణలు.


జిహాదీల కరడుగట్టిన రాక్షస ప్రవృత్తిని శివాజీ మహరాజ్ రాణా ప్రతాప్ లాంటి ఎందరో మొదటి నుండి చివరి వరకూ ఎదిరించి ఆర్ష ధర్మాన్ని, హిందూ సంస్కృతినీ కాపాడగలిగారు. 


గుజరాత్ లో ముస్లిం ల జనాభా కేవలం 10 శాతం మాత్రమే. ఆ కొద్ది జనాభాతో ఎన్నోసార్లు మతహింస సృష్టించారు. సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వారి మీద చర్య తీసుకోలేదు. 1960 లలో జరిగిన మారణకాండలో వేలాది మంది హిందువులు చంపబడ్డారు. అదే 2002 వచ్చే సరికి గోద్రా రైలుదహనకాండలో 59 మంది హిందువులను సజీవదహనం చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటే అదే ముస్లిములు గడగడలాడి పోయారు.


ఆంధ్రప్రదేశ్ లో సలావుద్దిన్ ఒవైసీ అనేవాడు ఒక మామూలు MLA. ప్రతి ముఖ్యమంత్రి అతడి కాళ్ళు కడిగి అడిగినన్ని కాలేజీలూ వరాలు ఇచ్చి కాకా పట్టేవారు. మతకలహాలు సృష్టించినప్పుడు ఓవైసీ మనుషుల కన్నా వారిని ఎదిరించిన వారిని ఎక్కువగా అరెస్ట్ చేసేవారు. ఒక్క అంజయ్య అనే ఆరణాలకూలిగా మహామాన్య మీడియా చులకనగా చుసిన ముఖ్జ్యమంత్రి మతకలహాలలో ఓవైసీ ని ఎదిరించిన ఆలె నరేంద్ర కు ఫ్రీ హాండ్ ఇచ్చాడు. ఆలె నరేంద్ర వాళ్ళను తరిమి తరిమి కొట్టాడు. కిరణ్ కుమార్ రెడ్డి అనే  మగాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇద్దరు జూనియర్ ఓవైసీ లను ఏకకాలంలో లోపల వేసి నెలల తరబడి మగ్గబెడితే ఏమీ చేయలేక సోనీయామాత శరణుతో బయతకు వచ్చారు. 


హిందువుల ను సెక్యులరిజం పేరుతో పదవి కోసం గడ్డి తినే నాయకులు అణచి వేయకపోతే జిహాదీ ఉగ్రవాదానికి నిమిషాలలో మంగళం పాదించగల సమర్ధులు.

No comments:

Post a Comment