Thursday, June 2, 2022

🎻🌹🙏 భూమికి ఎందుకు నమస్కరించాలి....!!

🎻🌹🙏 భూమికి ఎందుకు నమస్కరించాలి....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿మనము ఎన్ని తప్పులు చేసినా, చేయకూడని పనులు చేసినా, చిన్నతనంలో తల్లి (జన్మనిచ్చిన తల్లి) గోరు ముద్దలు తినిపించి,

🌸ఎత్తుకొని, ముద్దాడి, ప్రేమతో బిడ్డే తన లోకంగా జీవిస్తుంది తల్లి..

🌿అలాగే భూమాత మన ఆకలి తీరుస్తోంది.. దాహం తీరుస్తోంది.. సకల జీవరాసులకు, 84 కోట్ల జీవరాసుల ఆకలి దప్పులు తీర్చుతున్న తల్లి భూమాత.

🌸అలాగే 84 కోట్ల జీవరాసుల మల మూత్రములను భరించి స్వీకరిస్తున్న మాత భూమాత..

🌿మనకు 10 సం:ల వయసు వచ్చిన తర్వాత మన తల్లి మన మల మూత్రములను తీసి శుభ్రం చేస్తుందా.?

🌸 మనకు ఎంత వయసు వచ్చినా, మన యొక్క మల మూత్రములను, తన మీద భరించడమే కాక, వాటి వలన దుర్గంథము రాకుండా, తద్వారా వ్యాధులు ప్రబలకుండా,

🌿దానిని తనలో ఐక్యం చేసుకొని,
ఈ జీవ కోటిని అనంత ప్రేమానురాగములతో కాపాడుచున్న మాత భూమాత..

🌸చివరికి మనము మరణించిన తర్వాత మనతో పాటు అమ్మ (కన్నతల్లి), నా వారు నా వారు అని కౌగలించుకొని మనతో సహజీవనము చేసిన భార్య/ భర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు మనతో రాకుండా శ్మశానములో ఆగిపోతే,

🌿నా బిడ్డ ఇంతకాలం (మరణిచిన మృతదేహము ఎలాంటి జీవనమును కలిగి ఉండినా సరే) జీవించి తనువు చాలించాడు.., అని అవ్యాజమైన ప్రేమతో, తన కడుపులో దాచుకునే తల్లి భూమాత...

🌸కేవలం మనలనే కాదు 84 కోట్ల జీవరాసులను ఆదరించే తల్లి భూమాత.

🌿ఇక్కడ ఒక్కక్షణం ఆలోచించండి.., భూమాత అలా తన కడుపులో దాచుకోక వదిలేస్తే, ఆ శరీరాలు కృళ్లి, కృశించి, దుర్గంధ భూయిష్టమై రకరకాల వ్యాధులు (కలరా/ ప్లేగు/మలేరియా) ప్రబలితే,

🌸ఎంత జన నష్టం జరుగుతుందో ఆలోచించండి.. ఏ ఒక్కరు మరణించిన మృతదేహమును ఆ తల్లి కరుణించక, తనలో కలుపుకొనక పోతే

🌿ఈ జనారణ్యములో ఆ మృతదేహమును వదిలేస్తే కలరా/ ప్లేగు/ మలేరియా ప్రబలితే, మిగిలిన జీవరాసులు కూడా భూమి మీద అంతరించి పోవా..?

🌸 అందుకే భూమిపై కాలు మోపే ముందు ఆ తల్లిని క్షమాభిక్ష కోరుతూ ప్రార్థించాలి.. అలా ప్రార్థించ లేకపోతే మనంత కృతఘ్నులు ఈ ప్రపంచములో మరొకరు ఉండరు.

🌿 మిగిలిన జీవరాసుల విషయంలో వాటికి జ్ఞానం లేదు.., ఆలోచించే శక్తి లేదు.. ఆ శక్తి కేవలం ఈ మానవ మాత్రులకు మాత్రమే ఉంది స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సేకరణ

No comments:

Post a Comment