19-07-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట. లుఓటమి భయం ను గెలిచిన వ్యక్తే జీవితం లోనూ గెలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు
మనకు చేతనైనా చేతకాక పోయినా ఎదుర్కోనవలసిన యుద్ధం జీవితం.. అది మనల్ని చంపదు కానీ చావుదెబ్బలు కొడుతుంది మనం కీంద పడితే అది యుద్ధమే ఎప్పుడైతే ఎదురక్కొని పడిలేస్తావో అది జీవితం
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు..ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు.. ఈ జన్మకే వాళ్ళు మన..జీవిత భాగస్వాములు..ఈ జన్మకే వాళ్ళు అక్కా చెల్లెల్లు అన్నా తమ్ముళ్ళు
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు సనిహితులు ఈ జన్మకే.. కేవలం ఈ జన్మకే మహా అయితే మరో కొన్ని సంవత్సరాలు తప్పు చేసినా క్షమిద్దాం ఆనందంగా భరిద్దాం ప్రేమిద్దాం పోయాక ఫోటోను ప్రేమించే కన్నా ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం .గొప్ప సంస్కారం
రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తా మన్నా నమ్మకం లేని బతుకులు మనవి.., ప్రాణం ఉంటే ఏమి పోతే ఏమి, ధర్మంగా ఒక్కరోజు బతికినా చాలు ఈ జన్మకి.... కానీ నేడు ఈ మాటకు అర్దం మారిపోతుంది..దోచుకో.. దాచుకో.. ఇదే నేటి మాట
అసూయ అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి ఈ వ్యాధి.. సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనీయరు..
ఇది సత్యం..
ఒక కాకికి తిండి దొరికితే చుట్టు పక్కల ఉన్న కాకులను తినడానికి పిలుస్తుంది, కానీ ఈ అలవాటు మనుషులకు ఎందుకు రాలేదో...
🌺 సర్వేజనా సుఖినోభవంతు 🌺
సేకరణ ✍️ AVB సుబ్బారావు .
No comments:
Post a Comment