Tuesday, July 26, 2022

మంచి మాట...లు(26-07-2022)

మంగళవారం --: 26-07-2022 :-- ఈరోజు మంచి మాట...లు

శుభోదయం ఇది పొద్దునే ఒకరిని పలకరించే పదమే కాదు . నేనింకా ఈ ప్రపంచంలోనే ఉన్నాను నీకెప్పుడు ఆత్మీయంగా తోడుంటాను . ఎవరున్నా లేకున్నా ఒక మిత్రునిగా వెన్నంటి ఉంటానని ఆత్మీయంగా దైర్యం చెప్పే రక్షణ పదం .

బంధం అయినా పరిచయం అయిన కోత్తలో చూపించే అభిమానం కడదాకా ఉండదు, దీనికి కారణం మారిపోయే మనషులదో లేదా కొత్తగా చేరిన పరిచయాలదో తెలియదు .

విలువ అనేది మనకు మనం నిర్మించుకున్న కంచుకోట లాంటిది,,. ఒక్కో మాట జారిన ప్రతి సారీ ! కోట బిటలు వారి ఒక్కో రాయి కింద పడి చివరికి కోట కూలే ప్రమాదం ఉంది, మాట్లాడేముందు జాగ్రత్త ఉండాలి,,,అంటే మనం మాట్లాడే మాట అవతలివారిని ఇబ్బంది పెట్టేలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి .

ఈ ప్రపంచంలో
అత్యంత స్వార్థపూరిత జీవి ఏదైనా ఉందంటే అది మనిషే . అవసరాన్ని బట్టి మనుషులు మారతారు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది

మరిగే
వేడి నీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో పరిష్కారం కూడా అలాగే కనిపించదు . మనకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతతమైన మనస్సు తో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది .

సేకరణ ✒️
మీ ...AVB సుబ్బారావు *9985255805💐🤝🙏

No comments:

Post a Comment