🪔🪔అంతర్యామి 🪔🪔
🌺🌺జీవితం అంటే..🌺🌺
🦋జీవితంలో నిజంగా మనం జీవిస్తున్నామా?
🎈ఇది అంతుచిక్కని ప్రశ్న.
🍁వ్యధలతో, బాధలతో, అసంతృప్తులతో, నిరాశా నిస్పృహలతో జీవితమంతా గడిచిపోయింది.
🍁వెనక్కి తిరిగి చూసుకుంటే చివరకు మిగిలేది ఏమిటి? అనంతమైన పశ్చాత్తాపం కళ్ల ముందు సాకారమవుతుంది.
🌿 దేవుడిచ్చిన బహుమానమైన ఈ జీవితం ఇలా నిష్ఫలంగా ముగిసిపోతుందనే చింతన చరమాంకంలో వేధిస్తుంది. అందుకే ముందే మేల్కోవాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
🍁శాశ్వతంకాని దేహం మీద మమత్వాన్ని వదిలిపెట్టి శాశ్వతుడైన పరబ్రహ్మను భజించమని జగద్గురువు ఆదిశంకరులు మహోపదేశం చేశారు. 🍁అవిద్య, రాగద్వేషాలు, జీవితంపట్ల నిర్లక్ష్యం, మానవీయత లేకపోవడం, జడత్వం- వీటిని పంచ మహాదుఃఖాలుగా పతంజలి మహర్షి అభివర్ణించారు. 🍁జీవితమంటే చావు వచ్చేంతవరకు కొనసాగించే పయనం ఎంత మాత్రమూ కాదు.
🍁‘మృత్యువు నిన్ను నీడలా ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. అది నిన్ను అక్కున చేర్చుకోకముందే, దాన్ని జయించాలి. 🍁మరణించే నువ్వు జీవించాలి’ అని ఉపనిషత్తులు ప్రబోధించాయి.
🍁అన్ని దుఃఖాలకంటే మరణ దుఃఖం అతి భయంకరమైనది.
🍁మరణ దుఃఖాన్ని, మృత్యుభీతిని అధిగమించడం ఎలా?
🌺పరమాత్ముడికి ప్రియమైన రీతిలో మనం జీవన సంవిధానాన్ని అవలంబించడం ద్వారా మృత్యువునైనా ప్రియమైన మిత్రుడిగా మార్చుకోవచ్చు.
🍁నిష్కామ భావంతో కర్మాచరణ చేస్తూ, ధర్మపథంలో పయనించడం ద్వారా, చింతనామృతాన్ని నిరంతరం ఆస్వాదించడం ద్వారా జీవన మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు.
🍁మాననీయమైన మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడిపినవారే చిరంజీవులు. అలాంటివారే అసలైన కీర్తిశేషులు!
🍁మనిషి తన జీవితాన్ని ధర్మానికి అనుగుణంగా మలచుకుంటే మరణ భయం నుంచి బయట పడవచ్చు.
🍁 తన కోసం, సమాజం కోసం, దైవం కోసం ఎలాంటి కర్తవ్యాల్ని ఆచరించి తరించాలో తెలుసుకుని మసలుకోవచ్చు.
🍁 తనను తాను తెలుసుకోలేనివాడు సామాన్యుడు.
🍁ఆ జ్ఞానాన్ని పొందినవాడు మాన్యుడు.
🍁 సమస్త ప్రాణులపట్ల అనురక్తిని ప్రదర్శిస్తూ, సర్వభూతాల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉంటూ, సకల జనుల పట్ల దయాభావాన్ని ప్రకటిస్తూ, అహంకార రహితులై, సుఖదుఃఖాల్లో సమభావం కలవారే తనకు ప్రియమైనవారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు.
🍁 క్షమ, నిగ్రహం, ప్రేమ, సత్యసంధత, రుజువర్తన, వినయం, భూతదయ, సేవాతత్పరత ఈ అష్టసూత్రాల్ని జీవితానికి అనుసంధానించుకోవడం ద్వారా లోకాన్ని వశం చేసుకోవచ్చని భాగవతం ప్రతిపాదించింది.
🍁జీవన రథానికి ఇంధనం ఆత్మవిశ్వాసం. 🍁‘బతుకు అనేది మెతుకుల కోసం పోరాటం కాదు. 🍁బతుకు గతుకుల మయం కాకూడదు.
🍁బతుకు అతుకుల బొంతగా కనిపించకూడదు.
🍁ఈ బతుకు దయగల భగవంతుడిచ్చిన అపురూప అవకాశం.
🍁దాన్ని అందిపుచ్చుకో.
🍁చరితార్థుడిగా మిగిలిపో!’
🍁- ఓ సూఫీ కవిత వెల్లడించిన జీవన సత్యమిది.
🍁జీవితం పట్ల భయం ఉండకూడదు. భక్తి ఉండాలి. 🍁శేష ప్రశ్నగా మిగిలే భవిష్యత్ జీవితంపట్ల వర్తమానంలో ఆందోళన అనవసరం.
🍁ధీరచిత్తంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సదా సమాయత్తంగా ఉండాలి.
🍁ఇదే ఉదాత్త చరితుల ఉత్తమలక్షణం.
🍁ధైర్యం, నిర్భయత్వమనేవి ఆత్మజ్ఞానంతోనే సిద్ధిస్తాయి.
🍁సర్వశుభంకరమైన ధర్మకర్మల్ని ఆచరిస్తూ కర్మసాక్షి అయిన భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడనే ఎరుకను కలిగిఉండాలి.
🍁తరతరాలుగా అనుసరిస్తున్న ఆధ్యాత్మిక జీవన సంవిధానాన్ని పాటించాలి.
🍁నైతికశీల సంపత్తితో వేదవిహితమైన విధివిధానాలతో జీవన సంగీతపు మధురిమల్ని ఆస్వాదించాలి.
🍁జీవితనౌకను వెలుగు తీరానికి చేర్చాలంటే ముందు అంతర్వీక్షణతో మనలో కాంతిని నింపుకోవాలి.
🍁హృదయాలయంలో జ్ఞానజ్యోతుల్ని ప్రజ్వలింపజేసుకోవాలి!

No comments:
Post a Comment