Tuesday, July 26, 2022

శ్రీ రమణ మహర్షి సూక్తులు

 అరుణాచలరమణ👏


పునర్జన్మ ఉన్నట్టా, లేనట్టా? 

(రమణ మహర్షి వృత్తాంతాలు)


రచయిత : నీలంరాజు లక్ష్మి ప్రసాద్ 


కథ : ఈ పుస్తకంలోని వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురిత మయినవి.  ఇందులోని సూక్తులు కమలాకర వెంకటరావు గారు సంకలనం చేసి అనువదించిన "శ్రీ రమణ మహర్షి సూక్తులు" పుస్తకం నుండి సంగ్రహించ బడినవని రచయిత తెలిపారు. 


కథానిక :

1) గతాన్ని ముట్టుకోకు, తవ్వకు.  కోరికలు గతం నుండి పుట్టుకిచ్చినవే. గతం, భవిష్యత్తు రెంటినీ వదిలేసి వర్తమానంలో జీవించడమే ఆనందం. 

2) ప్రపంచంలో ప్రతి మనిషి తనకు అందుబాటులో వనరులను అతి వేగంగా వ్యర్థ పరుస్తున్నాడు.  అవే వనరులను తయారు చేయడానికి ప్రకృతికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 

3) భౌతిక ప్రపంచంలోని భాగ్యం ఎంత సమకూర్చుకున్నా మనకు కొరత తీరేది కాదు. సంపన్నులైన ఇంకొంత సంపద కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ హృదయ సంపద ఉన్నవారు భౌతిక వస్తువులకు దూరంగా ఉంటారు. 

4) తాను కర్తను అనుకోకుండా కర్మ చేయడమే కర్మ యోగం 

5) పాండిత్యానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం వల్ల లభించే అత్యంత సుఖం సాఫల్యం వేరు. 

6) సాధన లక్ష్యం అజ్ఞాన నివృత్తి కొరకై ఉండాలి.  జ్ఞానం అనేది మనలోనే ఉంది.  దాన్ని వెలికి తీసే ప్రక్రియే సాధన. 

7) భక్తితో, సంపూర్ణ ఓరిమతో పెట్టేది ఏదయినా తిన్న వారికీ, పెట్టినవారికి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. 

8) నిజంగా మీ మేలు కోరేవారు ఎవరు కూడా తాము మీకన్న అధికులమైనట్లు మాట్లాడరు. 

9) భూమి మీద పుట్టిన సామాన్య మానవులందరికీ శత్రువులుంటారు. 

10) గురువులను తలకెత్తుకునే ముందు వారు ఇలాంటి బరువు మోపుతున్నారో తెలుసుకోవాలి. 

11) ఆత్మకంటే వేరుగా చూడబడినప్పుడు జగత్తు అసత్యం, ఆత్మను ఆత్మగా చూసినపుడు జగత్తు సత్యం. 

12) మహాత్ముల హృదయమెప్పుడు శాంతంగానే ఉంటుంది. 

13) మోక్షం అంటే నీవు మరల పుట్టని వాడని తెలుసుకో 

14) జ్ఞానీ నిశ్చలంగా కనిపిస్తాడు (జడత్వం ల), కానీ వారిలో అంతులేని జ్ఞానముంది. 

15) ఆలోచనలను జయించినవాడే యోధుడు 

16) మానవ జన్మదిన ఎత్తిన తరువాత దూషించబడని వాడుండడు. 

17) ఉపనిషత్తులు మనదేశంలో పుట్టినవి అని చెప్పుకోవడం కాదు, వాటిని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది ముఖ్యం 

18) భగవంతుడున్నాడా లేదా అనేది కాదు ముఖ్యం, నీ గురించి నీవు ముందు తెలుసుకుంటే భగవంతుని గురించి నీకే తెలుస్తుంది 

19) భగవద్దర్శనం మనస్సులో కలిగేది, బాహ్యంగా కనిపించేది కాదు 

20) మనిషి మనిషికి శ్రధశక్తుల్లో తేడా ఉంటుంది. వాటిని కొలిచి చూసుకువడం మంచిది 

21) ఆనందం అనేది ఆశతో, కోరికతో కాక ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి 


 రమణ మహర్షి తన జీవితంలో వివిధ సందర్భాల్లో వ్యక్త పరచిన నిజాలు.  వీటిలో మనం నమ్మనివి, నమ్మేవి..  ఆచరించలేనివి, ఆచరించదగినవి ఎన్నో ఉన్నాయి.  వారి జీవితం పూర్తిగా చదవాలన్న మన జీవితం సరిపోదు. 

No comments:

Post a Comment