Monday, July 4, 2022

ధార్మిక జీవనాన్ని ఏవిధంగా అలవర్చుకోవాలి ?

💖💖 "269" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖


"ధార్మిక జీవనాన్ని ఏవిధంగా అలవర్చుకోవాలి ?"


"మన తాతముత్తాతలు ఎలా జీవించారో తరచిచూస్తే అది అర్ధమవుతుంది. వారంతా ధర్మం వల్లనే శాంతిగా ఉన్నారు. సత్శీలం గురించి చెప్తే ఎవరికి వారు అది తమకు సంబంధించి కాదనుకొంటూ తప్పించుకుంటున్నాం. మనిషిలో స్వార్ధం రూపుమాపటం కోసం పెద్దలు పూజా, పునస్కారాలను నిర్ధేశిస్తే వాటిని కూడా స్వార్ధానికి వాడుకుంటున్నాం. మన జీవితమంతా సద్గుణాలను నేర్చుకునే సాధనగా మారాలి. మన పిల్లలను కూడా అలాగే పెంచాలి. ఇంట్లో వృద్ధులు ఉంటే చిన్నపిల్లలకు వృద్ధాప్యం గురించి తెలుస్తుంది. వారికి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను తాతయ్య, బామ్మల నుండి కథల రూపంలో నేర్చుకుంటారు. ముసలివాళ్ళకు సేవచేయటం ద్వారా వారికి పుణ్యం వస్తుంది. మనం నేడు వృద్ధులకు చేసే సేవచూస్తేనే రేపటి మన వృద్ధాప్యంలో మన పిల్లలు తిరిగి మనకు ఆ సేవ చేయగలుగుతారు. బడిలో అనేక పాఠ్యాంశాలు చెప్తారు గానీ జీవితపాఠాలు చెప్పరు. మనకట్టు, బొట్టు, సంప్రదాయం గురించి బోధించే బామ్మలు, తాతయ్యలను వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లో చేరిస్తే వారు మన ఆత్మీయతను మాత్రమే నష్టపోతారు. కానీ మనం, మనపిల్లలు జీవితానికి అవసరమైన ఎన్నో మార్గదర్శకత్వాలను కోల్పోతాం ! ధార్మిక జీవనానికి దూరమవుతాం !!"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

No comments:

Post a Comment