*🕉️ జై శ్రీన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴దేవునికి మన హృదయమే అసలైన నివాసస్థలం అని మనం నమ్మాలి. హృదయం నుండి వచ్చే బోధనను అనుసరించాలి. వాటిని అనుసరించడానికి మంచి పద్ధతులను అవలంబించాలి. మన పూర్వీకులు చెడును అధిగమించడానికి, మన ఇంద్రియాలపై నియంత్రణ పొందడానికి ధ్యానము, యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులను, పవిత్ర మార్గాలను ఇచ్చారు. ఆ మార్గం గుండా జీవనం సాగించదానికి మనం ప్రయత్నం చేయాలి. కోపం మరియు ద్వేషాన్ని నియంత్రించడానికి నాడు ఋషులు తమ గ్రామాలను వదిలి అడవికి వెళ్లారు. ఈ రోజు కోపం, ద్వేషాన్ని వదిలించుకోవడానికి అడవికి పోనవసరంలేదు. ఉన్నచోటనే ఉంటూ సాధన చేసుకోవచ్చు. మనం కోపంనకు ఆస్కారమున్న వాతావరణంలో జీవిస్తూ దానిని నియంత్రించగలగాలి. అది అసలైన సాధన. అది అసలైన ఘనమైన విజయము!. అంతేకాని కోపానికి ఆస్కారం లేని అడవిలో నివసిస్తూ మన కోపాన్ని నియంత్రించామని చెబితే అది అర్థవంతమైనది కాదు. అందువల్ల కోపం, ద్వేషం వంటి భావోద్వేగాల పెరుగుదలకు తగినంత అవకాశం ఉన్న ప్రపంచ పరిసరాలలోనే ఉంటూ ధ్యానము, స్మరణ, జపం, యోగము వంటి ఏదో ఒక సాధన చేసి వాటిని నియంత్రించడం నేర్చుకోవాలి. అది ఒక ఘనమైన విజయం అవుతుంది.🌴_*
No comments:
Post a Comment