Tuesday, July 26, 2022

|| మరణం లేని Patriji || మరణం అంటే ఏంటి ?

 || మరణం లేని Patriji ||


మరణం అంటే ఏంటి ? 


అప్పటి వరకు ఉన్న ఉనికి ఇకపై ఉండక పోవడమే మరణం అంటే.


భూమి మీద ఏ ఆధ్యాత్మిక గురువు చెయ్యని విధంగా తాను ఒక్కనే కాదు చాలా మంది జ్ఞానోదయం పొందిన వారు ఉన్నారు అందరి దగ్గర నుండి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పిన ఆయనకు మరణం ఎక్కడిది.


మానం లేదు, అవమానం లేదు అన్నింటినీ ఆస్వాదించాలి అని చెప్పిన ఆ వాక్కుకి మరణం ఎక్కడుంది.


ఆధ్యాత్మిక అందరికీ ఒకటే అని చెప్పి ఆవిధంగానే పల్లే, పల్లే కు ధ్యానాన్ని చేర్చిన ఆయనకు మరణం లేదు. 


అజ్ఞానాన్ని జ్ఞానం అనే విచ్చుకత్తులతో తెగ నరికిన బ్రహ్మజ్ఞాని.


మానవులకు " శ్వాస మీద ధ్యాస " అనే అమృత కలశాన్ని అందించిన అపర బుద్దుడు.


మాంసాహారం తినే వాడు రాక్షసడు, శాకాహారం మాత్రమే మానవుల ఆహారం నిక్కచ్చిగా చెప్పిన ధీరుడు.


ఆయన ఒక మహా జ్ఞానసముద్రం.

ఆయన ఒక ఆద్యాత్మిక విస్పోటనం.

ఆయన ఆద్యాత్మిక విప్లవానికి ప్రాణం పోసిన యోధుడు.

ఆయన చీకటిలో ఉన్న వాళ్ళకు వెలుగు.


ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తే మాటలు అలిసిపోతాయి.

ఆయన అందించిన స్నేహం ఎడారిలో మంచి నీటి సరస్సు లాంటిది.

బరువెక్కిన హృదయలను సేద తీర్చిన మహా వృక్షం ఆయన.

మోడు బారిపోయిన జీవితాలలో ఆహ్లాదాన్ని తెచ్చిన వసంతం ఆయన.

అందరినీ నక్షత్ర వాసులుగా చూసిన ఆకాశం ఆయన.

అందరూ దేవుల్లే అని చెప్పిన సత్యం యొక్క గొంతుక ఆయన.


విప్లవం ఆయనే

విప్లవకారుడు ఆయనే

జననమూ ఆయనే

మరణమూ ఆయనే

జనన, మరణాల మద్యన జీవితము ఆయనే 

దారి ఆయనే 

గమ్యము ఆయనే

నడిచేది ఆయనే, నడిపించింది ఆయనే

ప్రశ్న ఆయనే, సమాధానము ఆయనే


అన్నీ తానై కొన్ని వేలమంది జీవితాల్లో గురువుగా, స్నేహితుడిగా, మార్గదర్శి గా, ఆత్మజ్ఞానిగా, బుద్దుడిగా ఉండి ఎవరూ బర్తీ చేయలేని పాత్రని మా అందరి జీవితాల్లో జీవించిన మీకు తిరిగి కృతజ్ఞతలు ఏలా తెలియజేయాలి sir. 


మా జీవితాలకు సమాధానము మీరు.

మా అభివృద్ధికి మైలురాయి మీరు.

మా ఆద్యాత్మిక అవగాహనకు కొలమానం మీరు.

మా తలరాతలకు శిల్పులు మీరు.

మా జ్ఞానోదయానికి దిక్సూచి మీరు.


మీరే మా మార్గం

మీరే మా గమ్యం


మీకు మాకు వీడ్కోలు లేదు, ఉండదు.

మీ ఈ భూప్రయాణం అప్పుడే ముగిసిందా?


మీరు నేర్పిన Acceptence లేకపోయి ఉంటే మీరు లేరన్న విషయాన్ని విని మా హృదయాలు బద్దలు అయ్యేవి. 


మీరు చెప్పిన మరణం ఒక సంబరం అనే విషయం మాకు తెలియక పోయింటే మా కళ్ళు కన్నీళ్ళతో గోషించేవి.


మాకొసం ఆద్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. 


మీరు ఆశించిన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ స్థాపించడానికి మా చివరి శ్వాస వరకు పని చెయ్యడం మేము మీకు చెప్పగలిగే కృతజ్ఞత, ఇవ్వగలిగే బహుమతి. 


మీరు అందిచిన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్థాము. 

మీరు ఇచ్చిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం.

ప్రపంచాన్ని ధ్యాన మయం, శాకాహార మయం చేస్తాం.

భూమిని స్వర్గంగా చేస్తాం.

మనుషులను దేవుళ్ళుగా తెలుసుకునేలా చేస్తాం.


మరో ప్రయాణానికి, మరో ఉద్యమానికి, మరో విప్లవానికి నాంది పలుకుతాం.


జైహో Patriji జై జై Patriji


అమరులు మీరు మరణం మీకు మణిహారం. 


మనిషి నుండి భగవాన్ గా ఎదిగిన మీకు మా ప్రణామాలు, కృతజ్ఞతలు. 

 బ్రహ్మర్షి  పితామహ సుభాష్ పత్రిజీ🙏

No comments:

Post a Comment