Saturday, July 30, 2022

గాఢనిద్రలో వేటితో పనిలేకుండానే శాంతి వస్తుంది, మెలకువలో అలా ఎందుకు సాధ్యం కావటంలేదు ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"292"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     🌼💖🌼💖🌼💖🌼

           🌼💖🕉💖🌼

                 🌼💖🌼

                       🌼


*"గాఢనిద్రలో వేటితో పనిలేకుండానే శాంతి వస్తుంది, మెలకువలో అలా ఎందుకు సాధ్యం కావటంలేదు ?"*

**************************


*"గాఢనిద్రలో లభించే శాంతి మనలోని ఆత్మతత్వానికి నిదర్శనం. మనం శాంతి, తృప్తిని సుఖసంతోషాల ద్వారా పొందాలని అనుకుంటున్నాం. అందుకే శాంతి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అనుకున్న పనులు చేయటం ద్వారా, శరీరాన్ని సుఖంగా ఉంచడం ద్వారా మాత్రమే శాంతి కలుగుతుందని మన భావన. శరీరంతో అనుకున్నవి చేయగలిగినప్పుడు, మనసుతో ఇష్టమైన విషయాలు భావన చేయగలిగినప్పుడు కలిగే అనుభూతిని శాంతిగా భావిస్తున్నాం. నిజానికి శాంతి, తృప్తి మనలోని ఆత్మ సుగుణాలు. శరీర క్రియలతో, మనోభావాలతో పనిలేకుండా అవి మన సొంతం. పగలంతా అనేక శరీర క్రియలతో కష్టసుఖాలు అనుభవిస్తున్నాం. స్వప్నంలో దేహంతో పనిలేని అనేక మానసిక భావనలతో కూడిన సంతోష, దుఃఖాలను పొందుతున్నాం. నిద్రలో అప్రయత్నంగా శాంతి పొందటానికి అదే కారణం" !*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼

            

No comments:

Post a Comment