Wednesday, August 31, 2022
అన్ని కాలములలోను, అన్ని అవస్థలలోను చైతన్యము ఒక్కటి మాత్రమే నిలచి ఉంటుంది.
🕉️ శ్రీ గురుభ్యోనమః*
అందరిలోను సత్యం ఉన్నది*
జిన్నూరు సెప్టెంబర్ 23, 1994*
అందరిలోను సత్యం ఉన్నది. మానవుడు తన హృదయములో ఉన్న సత్యమును గురించి శ్రవణము చేసి, మననం చేస్తే అమృతత్త్వమును పొందుతాడు.
సత్యం హృదయంలో సిద్ధంగానే యున్నది. అది అనుభవైకవేద్యము. దేశ కాలములు దానిని తాకవు. దేహము, మనస్సు దానిని పరిమితము చేయలేవు. సత్యం తెలియకపోవటమే అజ్ఞానం. సమాజములో ఉన్న అన్ని అనర్ధములకు అజ్ఞానమే కారణం.
జ్ఞానఫలం శాంతి! అజ్ఞానఫలం అశాంతి! జ్ఞానమునకు, కర్మకు విరోధము లేదు. జ్ఞానము, అజ్ఞానము పరస్పర విరుద్ధములు.
ఏనాటికైనా సత్యమును మానవుడు తనలోనే కనుగొనవలెను. అది వెలుపల దొరకదు. సత్యాన్వేషకుడు కానివాడిని ప్రపంచం నిరంతరం వ్యామోహపరుస్తూ ఉంటుంది. మానవ మానసం జ్ఞానాన్ని లోపల వెతకటం మాని వెలుపల వెతకటానికి అలవాటు పడిపోయింది. అందువలన మానవ హృదయంలో ఉన్న సద్వస్తువు నిజమైనప్పటికి నిజము కాని దానివలె కనిపిస్తున్నది.
అజ్ఞానము కల్ల విషయములను సృష్టించి వాటితోనే తిరుగుతూ ఉంటుంది. ప్రయత్నము చేసి అజ్ఞానమును తొలగించుకుంటే దానికి సంబంధించిన బాధలు, వ్యధలు నశిస్తాయి. అజ్ఞానము తలంపులకు లోబడి ఉంటుంది. చైతన్యము తలంపులకు అతీతమై ఉంటుంది. అన్ని కాలములలోను, అన్ని అవస్థలలోను చైతన్యము ఒక్కటి మాత్రమే నిలచి ఉంటుంది.
చైతన్యమే పూర్ణజ్ఞానము!*
భగవాన్ శ్రీరమణుల నిరాడంబరత్వం వర్ణనాతీతం
ఒకరోజు భగవాన్ దగ్గర చనువుగల ఒక భక్తుడు వచ్చి, తన్ను ఎవరో సదా దూషిస్తున్నారని భగవానుతో పదేపదే చెప్పసాగాడు. భగవాన్ విని ఊరుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సమాధానం రాకపోవటం వల్ల ఆ భక్తుడు ఆగలేక "అనవసరంగా అలా తిడుతుంటే నాకు కోపం వస్తోంది. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగడం లేదు, ఏం చెయ్యాలి?" అన్నాడు. భగవాన్ నవ్వుతూ "ఏం చెయ్యాలా? నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో, సరిపోతుంది" అన్నారు. అక్కడున్న భక్తులందరూ నవ్వసాగారు. ఆ భక్తునికి ఏమీ తోచక, "సరిపోయింది, నన్ను నేనే తిట్టుకోవాలా?" అన్నారు.
"అవునయ్యా! నీ శరీరాన్ని గదా వారు దూషించేది. కోపతాపాలకు నిలయమైన ఈ శరీరం కంటే, మనకు శత్రువులెవరు? దీన్ని స్వతహా మనమే ద్వేషించవలసి ఉంది. మనమట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు, ఎవరైనా దూషిస్తే, మనల్ని ప్రబోధిస్తున్నారని తెలివి తెచ్చుకొన, వారితో కలసి దాన్ని నిరసించాలి. అంతేకానీ ఎదురు తిడితే ఏం లాభం? మనల్ని దూషించేవారినేమ మిత్రులుగా భావించాలి. వారి మధ్య ఉంటేనే మనకు మేలు. పొగిడేవారి మధ్య
ఏమరిపోతాం అన్నారు భగవాన్.
ఆ చమత్కార సమాధానంలోఎంత ఆధ్యాత్మిక బోధ ఇమిడి ఉందో? నిరాడంబరుడు :::; భగవాన్ శ్రీరమణుల నిరాడంబరత్వం వర్ణనాతీతం భక్తులు విలువైన వస్తువులు తెచ్చి యిస్తే, "ఇది మనకెందుకండోయ్" అంటూ వాటిని తాకేవారు కూడా కాదు. వారి నిరాడంబరతను తెలిపే కొన్ని సంఘటనలు.... 1. 1947 సం.లో బెంగుళూరు నుండి బోసు అనే భక్తుడు వచ్చి ఖరీదైన పెన్సిళ్ళు భగవానుకి ఇచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక భగవాన్ వాటిని కృష్ణస్వామికిస్తూ "ఇవి భద్రంగా దాచి ఉంచవయ్యా, మన సొంత పెన్సిలు ఎక్కడో ఉండాలి అది తెచ్చి యివ్వు" అన్నారు.
అవి తీసుకొని,ఇంకొక మంచి పెన్సిలు ఇచ్చాడు కృష్ణస్వామి. దాన్ని అటు ఇటు తీప్పి చూసి, "ఇదెందుకయ్యోయ్, ఇది దేవరాజు మొదలియారుది. ఇది కూడ భద్రంగా ఉంచు. మన సొంత పెన్సిలు ఉండాలి కదా! అది తెచ్చివ్వు" అన్నారు భగవాన్. కృష్ణస్వామి వెతికి అది కనిపించలేదన్నాడు. "అయ్యయ్యో! అది మన సొంత పెన్సిలయ్యా, సరిగ్గా చూడండి" అన్నారు భగవాన్. ప్రక్కనే ఉన్న మొదలియార్ "అదేమిటి భగవాన్! ఇవన్నీ మాత్రం సొంతం కాదా?" అన్నారు.
భగవాన్ పవ్వుతూ"అది కాదండీ ఇది మీరిచ్చారు, అవి బోసు తెచ్చాడు, ఇవి ఎంతో ఖరీదైనవి. అజాగ్రత్తగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు. స్వామి అందరికీ ఉమ్మడియేకదా. అయ్యో! ఇంత ఖరీదైనది భగవానుకు ఇచ్చామే, పోయిందే అని మీరు అనుకుంటారు. ఇదంతా ఎందుకు? మన సొంత పెన్సిలైతే ఎలా ఉనచుకున్నా పరవాలేదు. దాని వెల అర్దణా. అది కూడా కొన్నది కాదు. ఎక్కడో దొరికిందని ఎవరో తెచ్చి ఇచ్చారు. అది మన సొంతం. అది పోయినా ఎవరూ అడగరు.అందుకే అది కావాలంటున్నాను. ఇవన్ని గొప్పవారు వాడేవి, మనకెందుకు? మనమేమీ పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? మన వ్రాతకు ఇది సరిపోతుంది" అని చెప్పి చివరికి దాన్ని వెతికించి తెప్పించుకున్నారు భగవాన్.
సాధకుడు తన జీవితంలో ఎలా వుండాలి
సాధకుడు తన జీవితంలో ఎలా వుండాలి
కమలం బురదలో పుడుతుంది, నీటిపైన జీవిస్తుంది...
ఈ రెండింటిని తనలో చేర్చు కోదు, ఆడవారు కంటికి పెట్టుకునే కాటుక గ్రుడ్డు కు అంటదు...
పచ్చళ్లు, కూర్మాలూ, ఎన్ని తిన్నా గాని నాలుకకు జిడ్డు అంటదు...
అట్లే సాధకుడు, జగత్తులో ఉన్నప్పటికీ, జగత్తు మనలను అంటకూడదు...
సుఖ దుఃఖములు, సంయోగ వియోగములతోనూ, మనకు సంబంధముండకూడదు...
అభిమాన, అహంకారములున్నచోట, దైవభక్తి ఉండజాలదు...
నేను కీర్తనలు బాగా పాడుతున్నాననీ, నా పూజా మందిరాన్ని రంగుల దీపాలతో బాగా అలంకరించాననీ గర్వపడవద్దు...
మన అలవాట్లల్లో వైఖరిలో మంచి పురోగతి ఉండాలి...
అది లేనప్పుడు సాధన వ్యర్థమైన కాలక్షేపమే...
కలి మహత్మ్య మేమో కానీ ఈరోజు ఆడంబర భక్తి తాండవ మాడుతోంది...
దైవము దేనినీ ఆశించడు, పరోపకారం, దీన ప్రాణులకు చేతనైనా సహాయ సహకారాలు అందించడం స్మరణ అనేది ఒక స్టాంపు, మననం అనేది ఒక చిరునామా, నామమును స్మరించాలి, ఆయన రూపమును ధ్యానించాలి... అంతేచాలు. అదే ఆయనను చేరుతుంది.
ఓం నమః శివాయ
7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."
7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."
🌿1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.
🌿2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.
🌿3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.
🌿4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.
🌿5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.
🌿6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.
🌿7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.
🌻🌻🌻🌻🌻🌻
(మీ....ఆదిత్యనారాయణ.....తిప్పానా)
సేకరణ
🌿1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు.
గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.
🌿2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?
జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.
ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,
ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.
🌿3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?
జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.
గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే.
🌿4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?
జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.
గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.
🌿5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.
🌿6వ ప్రశ్న: మనకు దగ్గరగా వున్నది ఏది?
జ: తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.
గురువు: మనకు దగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.
అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.
🌿7వ ప్రశ్న: ప్రపంచంలో సులువైనది ఏది ?
జ:తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం
గురువు: ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.
🌻🌻🌻🌻🌻🌻
(మీ....ఆదిత్యనారాయణ.....తిప్పానా)
సేకరణ
స్వధర్మం
వ్యక్తిగత ధర్మం
కుటుంబ ధర్మం
భందువుల ధర్మం
స్నేహితుల ధర్మం
సాటి మనిషితో ధర్మం
సామాజిక ధర్మం
ఆర్థిక ధర్మం
రాజ్య పరిపాలన ధర్మం
పరిపాలన ధర్మం
ఈ ధర్మాలు ఏమిటో
తెలియాలంటే
ముందుగా కనీసం వారానికి ఒక్కసారి అయినా నిన్ను నీవు ప్రశ్నించుకో
నివేవరివో నీవెందుకు జివిస్తున్నవో ఎవరికోసం జివిస్తున్నవో , ఆ వారమంతా
ఎలాగ ఆలోచిస్తున్నావు , ఎలాగ ప్రవర్తిస్తున్నావు
ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు చేస్తున్న పని
చెయ్యదలుచుక్కున్న పని
ఎలాగ చేస్తున్నావు , యేమి ఆశించి చేస్తున్నావు, ఎంత మందితో కలిసి పని చేస్తున్నావు
ఎన్ని ఏండ్లని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నావు
దాని వల్ల కలిగే ఉపయోగాలు
ప్రయోజనాలు లాభ నస్టాలు మంచి చెడులు
తెలుస్తాయి
అదే ప్రప్రథమ స్వధర్మం
ఈ స్వధర్మం ఎప్పుడైతే అర్థం అవుతుందొ. ఇక ఇతర
ధర్మాలన్ని. అర్ధం అవుతాయి
అంతేకాని
దేవాలయం కట్టేసాము
ప్రతి రోజు దేవాలయానికి వెళుతున్నాను
హుండీలో కాసుల వర్షం కురిపిస్తున్నాను
ఓ పది పందికి భోజనం పెట్టేసాను వస్త్ర దానం చేశాను
సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి చుట్టూ తిరిగే మనుషులను చూసి దాన ధర్మాలు చేసేసి ,
గుడికి వెళ్ళి గుడిలో గుండ్రంగా తిరుగుతూ రక రకాల సంఖ్య ప్రకారంగా ప్రదక్షిణలు చేసి
గంట కొట్టేసి దణ్ణం పెట్టేసి
బయటకు రాగానే నా నా రకాల గబ్బు పనులు చేస్తూ
బతికేస్తు
నేను ధర్మాన్ని అచరిస్తునాను
నేను నిజాయతీ పరుడిని
నేను నీతి నిజాయితీ విలువలు సంప్రదాయాలు పాటించే వాడిని అని అనుకోకు.
ఓ పది మందికి మంచి చేసేసి
మరో. వంద మందకి ద్రోహం
చేసేసి
నేను నేనూ అంటూ బతికేసి
నా కుటుంబం
నా కులం
నా డబ్బు
నా అధికారం
నేను అధికారిని
నేను అంత నేను ఇంత
నేనెవరో తెలుసా
నాకు అన్ని రకాల పలుకుబడి వున్నది
ఇది కాదు ధర్మం అంటే
నా నా రకాల గబ్బు పనులు చేస్తూ బతికేస్తు వునంత కాలం
ఎన్ని పురాణాలు గ్రంధాలు
ఇతిహాసాలు భగవత్గీత
రామాయణం మహాభారతం
లాంటివి చదివినా విన్నా చూసిన.
ప్రయోజనం. ఫలితం
????????????????
స్వధర్మం అంటేనే తెలియనప్పుడు
ఇక మిగిలిన ధర్మాలు ఎలాగ తెలుస్తాయి...
పరమపద సోపాన పథము గురించి చాలామందికి తెలియని అద్భుత రహస్యాలు...
పరమపద సోపాన పథము గురించి చాలామందికి తెలియని అద్భుత రహస్యాలు...
వైకుంఠపాళి లేదా పరమపద సోపానము ప్రాచీన భారతీయ ఆట. సుమారు 2వ శతాబ్దములో నుండి ఈ ఆట భారతదేశములో ఉన్నదని చారిత్రీక ఆధారాలు ఉన్నాయి. మన తెలుగువారికి సుపరిచితమైన ఆట.. గవ్వలతో ఆడతారు.. ఈ ఆట యొక్క రూపకర్తలకు నిజంగా జోహార్లు...
ఎన్నో విశేషాలు వున్నాయిందులో..! ఆట పేరు పరమపద సోపాన పటము, "పరమ పదం" అంటే వైకుంఠం లేదా సద్గతి అని అర్ధం.. తద్విష్ణోః పరమం పదం అనేది వేదోక్తి. దీని ప్రకారం విష్ణుమూర్తి ఉండే ప్రదేశమే పరమపదం." అంటే వైకుంఠం. పరమ పదం మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణ వచనం. మోక్షప్రాప్తి తరువాత సద్గతి పొందిన మనిషికి మరుజన్మ ఉండదు. ఆ లక్ష్యాన్ని అందుకొనడానికి ప్రయత్నించడమే ఈ ఆటలోని ముఖ్యోద్దేశం.
మనం జీవితంలో ఏ పనులు చేస్తే మనమా లక్ష్యానికి దగ్గరగా వెళ్తామో ఆ ఉన్నతిని సూచించే నిచ్చెనల గళ్ళలో వ్రాసి వున్నాయి. అవి వరుసగాఇలా వున్నాయి. సుగుణం సాలోక్యానికి, సత్ప్రవర్తనము గోలోకానికి, నిష్ఠ తపోలోకానికీ, యాగము స్వర్గలోకానికీ, భక్తి బ్రహ్మ లోకానికీ, చిత్తశుద్ధి మహా లోకానికీ, జ్ఞానము కైలాసానికీ సోపానాలుగా ఉన్నట్లు చూడగలం..
అక్కడకు చేరిన తరువాత ఇక జన్మరాహిత్యం, ఈశ్వరత్వం తో కూడిన పరమపదాన్ని చేరటానికి మన వంతు వచ్చేవరకూ(అంటే సరైన పందెం పడేవరకూ..) ఎదురు చూడడమే. అలాగే అంతవరకూ పోయిన పిదప మత్సర్యమూ, అహంకారం దరి చేరామా మ్రింగడానికి పాము సిద్దంగా వుంటుంది. అది మనల్ని పుణ్య హీనులుగా చేసి రాక్షసులను, హీన జన్ములుగానూ చేస్తుంది. ఈ మొత్తం త్రోవలో మనం మనలోని పాముల లాంటి అవలక్షణాలను ఎన్నో దాటుకొని రావలసి వుంటుంది.
అవి మనలోనే వుండక్కరలేదు. ఆ లక్షణాలు కలిగిన రాక్షసుల దరిచేరినా అధోగతి ( పాము మింగి క్రిందకు పడిపోతాం) పట్టక తప్పదు. ఈ రకంగా సత్య పథంలో ప్రయాణించి, పరమపదాన్ని చేరే మార్గానికి ఈ పటం ఒక'సూచిక' గా మనం అన్వయించుకోవచ్చు.
ఆట తీరు...
వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ) ని ఆ ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం.
ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్ళు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందెం వేస్తూ పందాన్ని బట్టి ఆటకాయలను నడుపుతూ ఉంటారు. ఆరు గవ్వలుగాని లేదా పాచికలుగాని పందెం వేస్తూ ఆడుతారు. ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు. అయితే ఆడే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరకం ఆటకాయలను ముందుగా ముందే నిర్ణయించుకోవాలి.
వైకుంఠపాళీ పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలు గల గళ్ళల్లో నిచ్చెనలు ఉన్నాయి. ఏ పందానికైనా ఆటకాయ ఆయా గళ్ళలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 16 (సుగుణం) గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో28 (సాలోక్యం) గడిని చేరుకుంటుంది. అలా చేరుకోవడాన్ని 'నిచ్చెన ఎక్కడం' అంటారు.
పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెనెక్కడ మవుతుందని చెబుతారు. అప్పుడు పై పందెం వేసుకునే అవకాశం ఇస్తారు. పై పందెంవల్ల మళ్ళీ నిచ్చెన ఎక్కినత్లయితే మళ్ళీ మరో పై పందెం- ఇలా ఆట కొనసాగుతూ ఉంటుంది. ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి.
ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి/మింగి ఆటకాయ పాము తోక చివరివరకూ కిందికి దిగిపోతుంది. కాగా 26 (ద్వేషం) గడిలో ఉన్నది పాము కరచినప్పుడు దాని తోక ఉన్న 3వ గడికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పాము మూలంగా ఆటకాయ పాతాళం చేరుకుంటుంది. ఇట్లు పాముతోక దగ్గరకు రావ్డాన్ని 'పాము మింగడం' అంటారు.
ఇక106వ గదిలో ఉన్న పెద్ద పాము మింగిందంటే ఆటకాయ ఒకేసారి 1వ గడిని చేరుకుంటుంది. చివరకు 121 గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ చేరుకున్నట్లయితే పుణ్యపథంలో పడ్డట్టే. అలా, ఆ తరువాతనున్న 132వ గడిని దాటి పైనున్న స్వర్గధామన్ని ఆటకాయ చేరుకుంటుంది.
అక్కడినుండి చివరివరకూ వెళ్ళి తిరుగుముఖం పట్టి మధ్యనున్న విరాట్ స్వరూపాన్ని చేరుకోవాలి. తిరుగు ముఖం పట్టి, వచ్చేటప్పుడు ఏ పందెంలో సరిగ్గా విరాట్ స్వరూపాన్ని చేరుతుందో ఆ పందెం పడినప్పుడే ఆటకాయ పండినట్లు చెప్పవచ్చును. అంతవరకూ ఆ వరుసలో ముందరికీ వెనుకకూ ఆటకాయను నడుపుతూ ఉండాలి.
విరాట్ రూపానికి ఆ వైపూ ఈ వైపూ ఉన్న బొమ్మల్ని ద్వారపాలకులనీ, వారు విరాట్ దర్శనం కాకుండా అడ్డగిస్తూ ఉంటారనీ, అందువల్ల వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాతనే ఆఖరికి విరాట్ దర్శనం అవుతుందని అర్థం చేసుకోవచ్చు...
.
.
#'నేను'_అంటే_ఎవరు? శరీరమా? లేక ఆత్మా?
#'నేను'_అంటే_ఎవరు? శరీరమా? లేక ఆత్మా?
'నేను' అనే పదాన్ని కూడా ఉచ్చరించే స్థితిలో లేదు నేటి సమాజం. అంతగా మనుష్యులందరూ, వారి వారి పనులతో, మరియు సమస్యలతో సతమతమవుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటిది, వారు నేనెవరు? శరీరమా లేక ఆత్మా? అని తెలుసుకునేంత సమయం ఎక్కడుంటుంది? కానీ, వారికి ఎన్ని పనులున్నా మరియు ఎన్ని సమస్యలున్నా, మనసు మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోతుంది. అది ప్రతి రోజూ గుర్తు చేస్తూ ఉంటుంది. దానిని మనం లెక్క చేయం. ఎందుకంటే.. అది మనకు గుర్తు చేసిన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో, ఎలా ముందుకు అడుగు వేయాలో, మనకు తెలియదుగనుక. పోనీలే ఎప్పుడైనా మనం తెలుసుకోవాలని ఎవరినైనా అడుగుదామంటే, వారికీ తెలియదు. పోనీలే అని వారి వారి మత గ్రంధాలు చెదివి తెలుసుకుందామనుకుంటే, అది పూర్తిగా అర్ధం కాదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలో తెలియక, మళ్లీ మన పనులలో మనం తలమునకలై, దానిని వదిలేస్తుంటాం..
నీవెవరు? అన్న విషయాన్నీ మరియు దేవుడు ఎవరన్న జ్ఞానాన్నీ తెలుపడానికి, ఈ భూమి మీదకు వచ్చిన పరమాత్మ స్వరూపులయిన వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వంటి వారు బోధనలు చేసినపుడు, వారిని దేవుడు అని అంటాము.. కానీ, వారు బోధించిన జ్ఞానాన్ని మాత్రం అంతగా పట్టించుకోము. పైగా, అప్పుడు కూడా మనం మన అల్పమైన కోరికలను కోరుకుని, వారిని కూడా ఇబ్బంది పెడతాము. వారు మన దౌర్భాగ్య పరిస్థితిని చూసి, వీళ్ళకు నచ్చచేప్పేదెలా? అని మదనపడ్డారు. ఇదే విషయాన్ని సాయిబాబా స్వయంగా తన భక్తులతో ఇలా చెప్పారు.. నా దగ్గర చాలా జ్ఞాన సంపద ఉన్నది.. నేను మీకందరికీ బంగారు వస్త్రాలు ఇద్దామని అనుకుంటే, మీరు మాత్రం, నా దగ్గరికి వచ్చి, చినిగిపొయిన పాత వస్త్రాలను అడుగుతున్నారు.. మరీ అల్పమైన కోరికలను కోరితే, నేనేం చేసేది? అని అయన భక్తులతో చెప్పి, ఎంతగానో మదనపడ్డారట..
కానీ, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. నేనెవరు? పోనీ కాసేపు నేను శరీరం అని అనుకుందాం.. నేను శరీరం అని అనుకుంటే, మనకు మొదటగా వచ్చే జ్ఞాపకం, మన పేరు. అది ఏదైనా కావచ్చు.. సరే, మనం శరీరం అనుకుంటే, ఇలానే శాశ్వతంగా శరీరంతోనే ఉంటామా? అంటే, లేదు.. అని మొదటగా మన మనస్సు, మనకు జవాబు చెప్పేస్తుంది. అప్పుడు మనకు, అవును మరి నిజమే కదా? మన పూర్వీకులు ఎవరూ ఇప్పుడు లేరు.. వారంతా చనిపోయారు కదా? అంతేగాక, ఈ శరీరం శాశ్వతంగా ఉండాలని ఎన్నో తపస్సులు చేసి, మరియు ఎన్నో వరాలు పొందిన రాక్షషులు కూడా, చివరకు నాశనమయ్యారు.. అంటే, శరీరాన్ని విడిచారు కదా? అని మనకు గుర్తు వస్తుంది. అయితే 'నేను' ఈ శరీరం కాదు.. మరి నేనెవరు? అనేది ఇక్కడ మనకు తేలాల్సిన విషయం!
ఈ శరీరం నువ్వు కాదు అనే విషయాన్ని తెలుపడానికే, శ్రీ షిరిడి సాయిబాబా వారు, తన భక్తులకు ఒకసారి ఈ విధంగా చేసి చూపారు. అదేంటంటే, బాబా ఒకసారి తన భక్తులతో, ‘నేను ఈ శరీరాన్ని వదలి వెళ్లి, మూడు రోజుల తరువాత తిరిగి వస్తాను’ అని చెప్పారు. రెండు రోజుల తరువాత, భక్తులు ఏంచేయాలో పాలుపోక సతమతమవుతూ వుండగా, ఆ ఊరి పెద్ద, వేరే పట్టణం నుండి వైద్యుణ్ణి పిలుచుకుని వచ్చి, శవానికి పరీక్ష చేయించాడు. అప్పుడా వైద్యుడు, 'ఈయన చనిపోయాడు, బ్రతికే అవకాశం లేదు' అని చెప్పాడు. అపుడా ఊరి పెద్ద, దహన సంస్కారాలు చేయండని చెప్పాడు. కానీ, ఊరి వారందరి బలవంతం కారణంగా, మూడు రోజుల తరువాత బాబా వస్తానని చెప్పారు.. కాబట్టి మూడు రోజులు వేచి చూద్దామన్నారు. అందరూ ఎదురు చూస్తుండగా, మూడు రోజుల తరువాత బాబా మరల తన శరీరం లోకి వచ్చారు. చూశారుగా.. సాయిబాబా ఎంత గొప్ప ప్రయోగం చేశారో. దేనికి ఇదంతా చేయవలసి వచ్చిందంటే.. ఈ శరీరాలు మీరు కాదు! అని నిరూపించడానికే, ఆ మహానుభావులు ఆ విధంగా, ప్రత్యక్షంగా చేసి చూపించారు..
మరి నేను ఈ శరీరం కాదన్నప్పుడు, నేను వేరే ఏదైనా ఉండి ఉండాలి.. “దేన్నయితే మనస్సు గ్రహించలేకపోయినా, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో.. దేన్నయితే కళ్ళు చూడలేకపోయినా, దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో.. దేన్నయితే చెవులు వినలేకపోయినా, దేనిచేత చెవులు వినేశక్తిని పొందగాలుగుతున్నాయో.. దేన్నయితే ముక్కు వాసన చూడలేకపోయినా, దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో.. అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా తెలియపరిచారు. అంటే, మన శరీరం, మనస్సు మరియు బుద్ధి, అన్నీ ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి మాత్రమే శాశ్వతం.. అదియే నీవు.. ఆ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో, అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది.. అప్పుడు శరీరంలోనివి ఏవీ పనిచేయవు..
మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి, లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు.. ఆత్మ రాజయినప్పటికీ, సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన, మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ, అహంకారంతో ప్రవర్తించడం జరుగుతోంది. మనస్సనే మంత్రి, రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే మనిషి ఆత్మే 'నేను' అనే జ్ఞానాన్ని తెలుసుకుని, అంటే, రాజే 'నేను' అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకుని, పనిచేసుకుంటూ వెళతాడో, అప్పుడు మనస్సనే మంత్రి ఏమీ చెయ్యలేడు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన, మనస్సు ఆత్మలో లయించ వలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై, శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి, 'నేనే ఆత్మను' (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేళతామో, అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది.....
ఆత్మ.....
''అది (ఆత్మ) కదులుతుంది (కాని) కదలదు..
అది దూరస్థం కాని మన దగ్గరే, లోపలే, ఉంటుంది.''...
ఈశావాస్య ఉపనిషత్తు అలా అంటుంది...
'తదేజతి తన్నైజతి తద్దూరే తద్వన్తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||
ఇక్కడ దేశమూ, కాలమూ కలిగించే మానసిక అవస్థల గురించే కాక వాటి ప్రభావం నుండి విముక్తులం కావాలన్న ఆసక్తినీ కలిగిస్తుంది. ఈ ఉపనిషత్తులోనే దీని తర్వాత వచ్చే మంత్రాలలో, దేశకాలాలు ఆత్మస్థితాలే అని గమనించమని వుంటుంది. ఇది గ్రాహ్యమైతే, ఇక కోపం లేదు. మోహం లేదు, దుఃఖం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే, మానసిక సంక్షోభం లేదు.
ఆ తరువాత ఇంకొక మంత్రం.. ఆత్మ విశ్వవ్యాప్తమవటం వల్ల దూరాన్ని అధిగమించిందనీ, ఆ పిదప ఆత్మ కాలాతీతమనీ కూడా చెప్తుంది.
మొత్తం మీద ఉపనిషత్తులు.. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించే దృశ్యమాన జగత్తు దేశ కాల సంయోగ జన్యమనే సత్యాన్ని ఎప్పుడో చెప్పింది. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం విషయంలో ఇది ఒక సిద్ధాంతము మాత్రమే. ఉపనిషత్తులు ఇది స్వానుభవంలో అనుభవించ వలసిన అనుభూతి అని అంటాయి. వేదాలకు శిరోభూషణాలైన ఉపనిషత్తుల సందేశమిదే...
Ganesha The Ashtottara Sathanaamam
https://youtu.be/C0t7oPz77vc
https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v
*Telugu Swadhyaya and Satsangs*👆
https://chat.whatsapp.com/BCoUmijlWWq9AUDjbxjqgp
*English Swadhyaya and Satsangs*👆
https://chat.whatsapp.com/HCp3Sc4fGjO5eFXYj6YYqQ
*Hindi Swadhyay and Satsangs*👆
*Amritham Gamaya Telegram Telugu*
https://t.me/+ZiFi4_FG_T9lZWE1
🌺 Amritham Gamaya 🌺
Let all the knowings you are pursuing outside you become known and become you. When the knowings are known, you Become that. You become Sri Ganesh. You are Sri Ganesh. You Are That. Thou Art That. Tatwamasi - SathChith.
The Ashtottara Sathanaamam integrates each of 108 qualities and attributes of higher dimension of the deity to manifest whole spirit of the form of almighty as only ONE without Second. Ekamevaadwiteeyam. Lord Sri Ganesh Ashtottaram recited by Guruji SathChith at the request of some of the seekers on the eve of Sri Ganesh Chaturdhi on 31st August 2022.
1) Om Vinayakaya namaha – Blessed Lord of all
2) Om Vighnarajaya namaha – He king of obstacles who can mitigate the obstacles.
3) Om Gauriputraya namaha – He son of Goddess Gauri
4) Om Ganesvaraya namaha – He blesses leader of all Ganas
5) Om Skandagrajaya namaha – He is the elder brother of Skanda(Subrahmanya)
6) Om Avyayaya namaha – He who is stable and does not change
7) Om Putaya namaha – He who shines
8) Om Dakshaya namaha – He who is an expert
9) Om Adhyakshaya namaha – He who presides
10) Om Dvijapriyaya namaha – He who likes the twice born
11) Om Agnigarbhachide namaha – He who has fire in his stomach
12) Om Indrasripradaya namaha – He who granted wealth to Indra
13) Om Vanipradaya namaha – He who grants voice
14) Om Avyayaya namaha – He who never alters
15) Om Sarvasiddhipradaya namaha – He who grants all occult powers
16) Om Sarvajnanayaya namaha – He who knows everything
17) Om Sarvaripriyaya namaha – He who is liked by every one
18) Om Sarvatmakaya namaha – He who is the soul of everyone
19) Om Srushtikatre namaha – He who creates
20) Om Devaya namaha – He who is God
21) Anekarchitaya namaha – He who is worshipped by several
22) Om Sivaya namaha – He who is Lord Shiva himself
23) Om Suddhaya namaha – He who is cleanliness
24) Om Buddhipriyaya namaha – He who likes knowledge
25) Om Santaya namaha – He who is a saint
26) Om Brahmacharine Naamaha – He who is a Brahma chari
27) Om Gajananaya namaha – He who killed Gaja mukhasura
28) Om Dvaimatreyaya namaha – He who is double
29) Om Munistutyaya namaha – He who is worshipped by sages
30) Om Bhaktavighnavinasanaya namaha – He who removes obstacles in path of devotion
31) Om Ekadantaya namaha – He who has only one tusk
32) Om Chaturbahave namaha – He who has four different aspects
33) Om Chaturaya namaha – He who is clever
34) Om Saktisamyutaya namaha – He who is with power
35) Om Lambodaraya namaha – He who has a broad paunch
36) Om Surpakarnaya namaha – He who has winnow like ears
37) Om Haraye namaha – He who is Hara (shiva)
38) Om Brahmaviduttamaya namaha – He who an expert in knowledge of Brahma
39) Om Kalaya namaha – He who is a crescent
40) Om Grahapataye namaha – He who is chief of planets
41) Om Kamine namaha – He who desires
42) Om Somasuryagnilochanaya namaha – He who has Sun
43) Om Pasankusadharaya namaha – He who holds the rope and the goad
44) Om Chandaya namaha – He who is fierce
45) Om Gunatitaya namaha – He who is as bright as Sun
46) Om Niranjanaya namaha – He who is spotless and pure
47) Om Akalmashaya namaha – He who does not have any stain
48) Om Svayamsiddhaya namaha – He who has become sidha himself
49) Om Siddharchitapadambujaya namaha – He whose feet is worshipped by saints
50) Om Bijapuraphalasaktaya namaha – He who likes to get results of Bhija
51) Om Varadaya namaha – He who gives boons
52) Om Sasvataya namaha – He who is perennial
53) Om Krutine namaha – He who performs
54) Om Dvijapriyaya namaha – He who likes the twice born
55) Om Vitabhayaya namaha – He who is never afraid
56) Om Gadine namaha – He who is our ultimate goal
57) Om Chakrine namaha – He who is Lord Vishnu
58) Om Ikshuchapadhrite namaha – He holds the bow of sugarcane
59) Om Sridaya namaha – He who blesses with wealth
60) Om Ajaya namaha – He who is not born
61) Om Utpalakaraya namaha – He holds lotus in his hand
62) Om Sripataye namaha – He who is the lord of wealth
63) Om Stutiharshitaya namaha – He who becomes happy because of prayer
64) Om Kuladribhettre namaha – He who broke the mountain
65) Om Jatilaya namaha – He who is an ascetic
66) Om Kalikalmashanasanaya namaha – He who destroys the ills of Kali age
67) Om Chandrachudamanaye namaha – He who wears the crescent
68) Om Kantaya namaha – He who is very pleasing
69) Om Papaharine namaha – He who cures sins
70) Om Samahitaya namaha – He who has an affable personality
71) Om Asritaya namaha – He who protects
72) Om Srikaraya namaha – He who does good deeds
73) Om Saumyaya namaha – He who is very peaceful
74) Om Bhaktavanchitadayakaya namaha – He who fulfills the desire of devotees
75) Om Santaya namaha – He who is peaceful
76) Om Kaivalyasukhadaya namaha – He who grants the pleasure of salvation
77) Om Sachidanandavigrahaya namaha – He who is the personification of divine joy
78) Om Jnanine namaha – He who is wise
79) Om Dayayutaya namaha – He who is merciful
80) Om Dantaya namaha – He who has a tusk
81) Om Brahmadveshavivarjitaya namaha – He who abandoned enmity to Lord Brahma
82) Om Pramatta daityabhayadaya namaha – He who is fearful to Asuras
83) Om Srikanthaya namaha – He who is the glorious light
84) Om Vibhudesvaraya namaha – He who is the God of all divine beings
85) Om Ramarchitaya namaha – He who is in the mind of Rama
86) Om Vidhaye namaha – He who is very learned
87) Om Nagarajayajnopavitavate namaha – He who wears snake as sacred thread
88) Om Sthulakanthaya namaha – He who has very gross body
89) Om Svayamkartre namaha – He who is made by himself
90) Om Samaghoshapriyaya namaha – He who likes the singing of Sama Veda
91) Om Parasmai namaha – He who is beyond everything
92) Om Sthulatundaya namaha – He who has a big tusk
93) Om Agranye namaha – He who is the first
94) Om Dhiraya namaha – He who is brave
95) Om Vagisaya namaha – He who is the God of words
96) Om Siddhidayakaya namaha – He who makes things happen and removes obstacles
97) Om Durvabilvapriyaya namaha – He who likes Bilwa leaves and Durva grass
98) Om Avyaktamurtaye namaha – He who does not have a clear form
99) Om Adbhutamurtimate namaha – He who has a wonderful form
100) Om Sailendratanujotsanga Khelanotsukamanasaya namaha – He who gets pleased by playing with the lord of Mountains
101) Om Svalavanyasudhasarajita Manmathavigrahaya namaha – He who has a pretty form like nectar and has a form like God of love
102) Om Samastajagadadharayai namaha – He who carries all the universe
103) Om Mayine namaha – He who has an illusory form
104) Om Mushikavahanaya namaha – He who rides on the mouse
105) Om Hrushtaya namaha – He who is pleased
106) Om Tushtaya namaha – He who is always satisfied
107) Om Prasannatmane namaha – He who has a very pleasant attitude
108) Om Sarvassiddhipradayakaya namaha – He who grants all powers
Om Gam Ganapathaye Namaha
అగ్నిచే కాల్చబడిన విత్తనాలు మొలకెత్తలేవు. అట్లే జ్ఞానాగ్నిచే దగ్ధమైన కర్మలు జీవుని అంటుకోలేవు. నేతితో వండిన పదార్థములైనను అవి నాలుకకు అంటుకోవు. అద్దములో పడిన ప్రతిబింబము అద్దానికి అంటుకోదు. అట్లే శివజ్ఞానము పొందిన వారికిని లోకవ్యవహారములు అంటుకోవు. అట్టివారు దగ్ధరజ్ఞువులగుదురు.
హృదయ పద్మమనెడి పీఠమున జ్ఞానమనెడి దీపము గల ఈ శరీరాన్ని శివుని గృహంగా మలచుకోవాలి. శివపరమాత్మ సర్వప్రాణుల హృదయములనెడి గృహమందున్నాడు. కావున సర్వప్రాణులను ప్రేమించాలి.
సూర్యుడు ఒక్కడే అయినను తన తేజస్సు చేత విశ్వమంతా ప్రకాశంతో నింపుచున్నాడం. ఆత్మస్వరూపుడైన శివుడు ఇచ్చా, జ్ఞాన, క్రియ, శక్తి భేదములచే విశ్వవ్యాపకుడై శోభించుచున్నాడు. ఆకాశమున పుట్టిన మబ్బులు ఆకాశమందే అణగిపోయినట్లు శివజ్ఞానము పొందిన వారి యందు వివిధ వికారాదులన్నియు అణగిపోవును.
సూర్యోదయము నుండి పనిచేయకుండా వ్యర్థంగా కాలము గడిపివేసి, ఆత్రపడకుండా సాయంసంధ్యాసమయము సమీపిస్తున్నదని తలంచి కాయకష్టము చేసి రేపటికేదైనా తినడానికి సంపాదించుకోవడానికి పనికోసం వెంపర్లాడుచున్నట్లు ఆశత్ర పడకుండా వయస్సుండగనే పరమేశ్వరుని శరణాగతి పొంది తరించాలి. దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకోవాలి గదా!
ఉపదేశ రత్నములు
ఉపదేశ రత్నములు :-
👉 నిన్ను నువ్వు తెలుసుకో.
👉 నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి.
👉 నీ మనో వృత్తిని జయించు.
👉 సర్వదా నీ యొక్క వాక్ దోషాలను కనిపెట్టి ఉంచు.
👉 సమస్త చరాచర జీవకోటి ఈశ్వరుని విలాసంగా బావించు.
👉 నీ దృష్టిని ఎల్లప్పుడూ ఈశ్వరుని యందు ఉంచు.
👉 ఈ సృష్టి అంతా మాయా విలాసమే అని తలంచు.
👉 సమాధిలో గోచరించే దశవిధ నాదములకు భ్రమ పడకు .
👉 సమాధిలో కనబడే వివధ రకాలైన వెలుగులకు భ్రమించకు.
👉 నిత్య తృప్తే పరమ ఐశ్వర్యం అని భావించు.
👉 అహంకారమే అన్ని అనర్థాలకు కారణం అని గ్రహించు.
👉 అంతఃకరణ శుద్ధికి నిష్కామ కర్మ యోగాన్ని సాధనంగా ఆచరించు.
👉 మనశ్శాంతిని మనశుద్దిని పొందటమే మానసిక తపస్సు అని గుర్తించు.
👉 పరమానందమే నీ లక్ష్యం గా ఉంచుకో.
👉 జ్ఞానాగ్ని ప్రజ్వలించే వరకు తపస్సు చేయి.
👉 విషయాసక్తే బంధహేతువు అని తెలుసుకో.
👉 సర్వభూతములను సమదృష్టితో చూడు.
👉 ధ్యానం చేసే సమయంలో త్రిగుణాలకు లోబడకు.
👉 సర్వభూతములను ఆత్మ రూపంగా చూడు.
👉 అష్ట సిద్ధుల విషయంలో మోహం పొందకు.
👉 మానవ సేవనే మాధవ సేవ అని గుర్తించి నిరంతరం సేవ చేయి.
👉 జిహ్వాచాపల్యాన్ని జయించు.
చేసుకున్నదే అనుభవిస్తాం!
చేసుకున్నదే అనుభవిస్తాం!
🔹🔸🔹🔸🔹🔸🔹
శ్రీకృష్ణపరమాత్మ ‘మనస్సు’ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ‘జీవుడు’, ‘పూర్వజన్మ కర్మ’ అందులో లీనం కావడం, కాకపోవడం గురించి చెబుతూ ఉంటే అర్జునుడికి ప్రాథమికమైన సందేహం వచ్చింది.
భగవద్గీత మూడో అధ్యాయం 36వ శ్లోకంలో అర్జునుడు ఇలా అడుగుతున్నాడు.
అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః
అనిచ్ఛన్నపి వార్ష్ణాయ బలాదివ నియోజితః
భగవాన్ ‘‘ఇంత చక్కని ధర్మశాస్ర్తాలు కలిగిన దేశంలో పాపాత్ములు ఎక్కువై పోతున్నారు. పాపానికి పురిగొల్పుతున్న శక్తి ఏమిటి?’’ అని అడిగాడు అర్జునుడు.
మనిషి బాగుపడడానికి, పాడైపోవడానికి అన్ని రకాల కారణాలు చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.
మనిషి చెడిపోవడానికి మనస్సే కారణమని స్పష్టంగా చెప్పాడు.
సంపద మీద కాంక్ష తీసుకోండి. వంద ఉన్నవాడికి వెయ్యి కావాలి. వేలు ఉన్న వాడికి లక్షలు కావాలి. లక్షలు ఉన్న వాడు కోట్లు కావాలని కోరుకుంటాడు. లక్షల కోట్లు సంపాదించిన వారు కూడా సుఖంగా ఉండడం లేదు. వాళ్లూ ఆందోళన పడుతున్నారు. లోకంలో భయాందోళనలు పెంచుతున్నారు. నిజంగా డబ్బు సుఖాన్నిస్తే ఆ డబ్బుని అనుభవిస్తూ హాయిగా ఉండవచ్చు కదా! యాభై, వంద గదులు కట్టుకుని ఉన్న వారు కూడా సుఖంగా లేరు. ఈ ఆకలికి అంతులేదు. కోరికలతోపాటు క్రోధం కూడా మహాపాపాలు చేయిస్తుంది.
ఉదాహరణ దుర్వాస మహర్షి. ఆయన మహాతపస్వి. కానీ ఒక్క కోపం ఆయన జీవితాన్ని తినేసింది.
ప్రతిదానికి పూర్వజన్మ కర్మ ఉండదు. కావాలని చేసుకుని అనుభవిస్తున్నవే అన్నీ! మనసులో పుట్టిన రాగద్వేషాలు, కామక్రోధాలు మనిషిని బలహీనుణ్ణి చేస్తున్నా, ఆ సంగతి గమనించుకోవడం లేదు.
- గరికిపాటి నరసింహారావు గారు
🔹🔸🔹🔸🔹🔸🔹
జీవిత సత్యాలు
ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం
జనరల్ బోగీలో వెళ్ళినా,
ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు .అలాగే పక్కనెంత మందున్నా, ఎంత సంపదున్నా ఏంటి ?30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే..
పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !
ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే...ఇద్దరూ గెలుస్తారు
ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి
దేవుడి కోసం తీర్ధాలు, పుణ్య క్షేత్రాలంటూ తిరుగుతారు , ఆయనెక్కడో లేడు.
శ్వాస తీసుకుంటూ సృష్టితో మనమేసుకున్న 'లంకె'లోనే వున్నాడు.
కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు.
నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు.
కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే...
నీకు గొడుగుపట్టి కాపాడతాడు... ఈ సత్యాన్ని గుర్తుంచుకో
కొబ్బరిచెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగి పోతాయి.
పుండు మానితే పొలుసు అదే పోతుంది.
పుండు మానకుండానే పొలుసు పీకేస్తే…
పుండు తీవ్రమై రక్తం కారుతుంది .అలాగే
జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి.
ఆత్రపడితే లాభం లేదు !
సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి ముందుకు చూడు.
నీపై నీకు నమ్మకం కావాలి.
నీపై నమ్మకం నీకు బలం.
నీపై అపనమ్మకం అవతలివారికి బలం !
నీ బలం ఎవరికీ తెలియక పోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !
మరణం ఎంతో మధురమైనది. ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్ట లేరు.
ప్రకృతికి కూడా అదంటే ఎంతో పక్షపాతం !
ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది.
నీ పరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు
నీ రోగాలను తగ్గించగలడు. కావున
వాటిని ఆరోగ్యంగా వుంచుకో.
వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. మరి నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ? అందుకే ప్రతిరోజు ధ్యానం చేస్తూ మలినాన్ని కడిగేయి
నిజాయితీపరులు సింహం లాంటి వాళ్ళు.
సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం.
నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !
ముని-మహర్షి-తపస్వి-యోగి.వీరు వేరు వేరు. మౌనంగా వుండేవాడు ముని.
నియమ నిష్టలతో తపింప చేసుకునే వాడు తపస్వి. అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి. ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి.
పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. అలాగే జీవితం కూడా నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !
ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నా వాళ్ళనుకుంటూ) బతికేశావు.
ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం
నువ్వు బతుకు.
వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో అసలు జన్మ వుందో లేదో తెలీదు.
నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు'
అనుకుంటుంటే వాళ్ళు తన తర్వాత
వాళ్ళ వాళ్ల కోసమే' బతుకుతారు.
నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !
అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈ మాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. అది తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా..
అందుకే ఈ జీవితమంతా !మన మరణం దగ్గర పడితేనే మహా సత్యాలు బోధపడ్తాయ్.
పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది.
వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు.
వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు .తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి ? అందుకే మానవులుగా బ్రతకటం కన్నా మానవత్వంతో బ్రతుకుదాం.
సేకరణ. మానస సరోవరం 👏
ధ్యానం మన రాతను మార్చగలదు..
ధ్యానం మన రాతను మార్చగలదు..
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫
🌈 రైతు విత్తనాలను భూమిలో నాటినపుడు అవి నేలలో సరిగ్గా పడినా, తలక్రిందులుగా పడినా, పైకే మొలుస్తాయి. అలాగే, ధ్యానం చేసిన వారికి సత్ఫలితం తప్పక లభిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి.
🌈 అయితే కర్మ అనేది ఉంది. కాబట్టే .... కర్మ భూమిపైన జన్మించాము. భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు. కారణం ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు.
🌈 దేహంతో ఉన్నంత వరకే జీవికి స్వార్థం, ఆశ, భయం , ప్రేమ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆత్మ వివేకం కలిగినది..
🌈 మనలో పంచ భూతాలు ఉంటాయి, నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాప పుణ్యాలకు పద్దు రాస్తుంది.. అదే "చిత్రగుప్తుడు".
🌈 చిత్ర మైన ఆత్మ గుప్తంగా దాగి ఉంది పాప పుణ్యాలు లెక్క రాస్తుంది. మిగిలిన మూడు భూతాలు మన ఆలోచనను బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తుంది..
🌈 నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము ఎటువైపు ఉన్నాము అర్థం కాదు. కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి సృహ వస్తుంది.. అందుకే వెంటనే లేచి వెళ్లకూడదు రెండు నిముషాలు ఆగి పడక దిగాలి అంటారు.
🌈 ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా ధ్యానం చేసే వాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే ఎక్కువగా వాళ్ళు తలచే దైవాన్ని, క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు............
🌈 Astrol Journey స్వప్నం తోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే ధ్యానంలో లో కూడా అది సాధ్యం అవుతుంది...
🌈 దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మ లో చేరలేక అధికంగా రోదిస్తాడు. విలువైన మానవ జీవితాన్ని పాప కర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధ పడతాడు. అయితే ఆ కర్మలలో పుణ్యం దైవ కార్యాలు, కూడా చేసుకొని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది, కానీ వారు చేసుకున్న పాపము ,పుణ్యం ఆధారంగా వారి తల రాతని వారే రాసుకుంటారు.
🌈 ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు, తమ తల రాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్ధం కలుగుతుందో అని చెయ్యి వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదిటి గీతలుగా రాసుకుంటారు..
🌈 నీ తల రాత నీచే రాయబడినది , నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మాను సారం నువ్వు కోరుకున్నదే, కానీ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుడు ని నిందించ కూడదు..
🌈 ఎవరైనా ధ్యాన సాధనకు అర్హత ఉన్న వాళ్లే .. నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పని లేదు కారణం దైవానికి బేధభావం లేదు. బ్రతికి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు - మారడానికి..
🌈 అలాగే ఒక బాధ తో పాటు మంచినీ.. మంచి అవకాశాన్నీ కూడా ఇస్తూనే ఉంటాడు. అది గుర్తించాలి అంటే మన బుద్ది కి వివేకం ఉండాలి , అది కలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, సేవ, సత్సంగం, గురు సేవ, ఆలయ దర్శనం, దానం, ధర్మం, ఇలా ఎదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ వెన్నంటే వస్తాయి.
🌈 మనసు నిలకడకు ధ్యానమే ముఖ్య ఆయుధం, ఆధారం, గొప్ప మార్పుకి అవకాశం..
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
సేకరణ
మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
🎊💦🦚🍇🥀🌺🌷
👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !
👉🌱11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉🌱 15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !
👉🌱16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !
👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .
సేకరణ
🎊💦🦚🍇🥀🌺🌷
👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !
👉🌱11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉🌱 15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !
👉🌱16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !
👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .
సేకరణ
వినాయకుని నామాలు, వాటి అర్ధాలు......!!
🎻🌹🙏వినాయకుని నామాలు, వాటి అర్ధాలు......!!
🌹1. వాతాపి గణపతి :🌹
🌸గాలిని పానం చేయడం అని అర్థం. అంటే ప్రాణాయామాది సాధనల వల్ల వాయువుని నియంత్రించడం.
🌿 అదే వాతాపి లక్షణం. వినాయకుడు మూలాధార అధిష్టాన దేవత. కుండలినీ జాగరణ అక్కడే ప్రారంభమౌతుంది.
🌸 అటువంటి యోగంలో ముఖ్యమైనది వాయునియంత్రణ. ఏనుగు నీటిని లోనికి, పైకి పీల్చిన్నట్లు మూలాధారములోని కుండలినిని పైకి తీసుకువెళ్తేనే సిద్ధి.
🌿 కనుక ప్రాణవాయువును నియంత్రించి ఆ ఊర్ధ్వ దిశలో పయనింపచేసే చైతన్యమే వాతాపి అలా యోగశక్తిగా ఉన్న గణపతినే వాతాపి గణపతి. అంటారు.
🌹 2. ఉచ్చిష్ట గణపతి : 🌹
🌹అక్షరములకు ప్రభువు ఓంకారం. గణపతి ఓంకార స్వరూపుడు.
🌿 అక్షరములు అన్ని వెలువడేది నోటినుండే. నోటి నుండి వచ్చినది ఉచ్చిష్టo. కనక అక్షరపతే ఉచ్చిష్ట గణపతి.
🌹 3. మహాగణపతి/వరసిద్ధి వినాయకుడు :🌹
🌸మహా అనేది పరబ్రహ్మ వాచకము. గణపతి సర్వదేవతాత్మకడు. 11 చేతుల(10 చేతులు,1తొండం) తో వుంటాడు.
🌿ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా, వారి వారి ఆయుధాలను ధరిస్తాడు.అవి:
🌸ఒక చేతిలో చక్రం-పద్మం--విష్ణులక్ష్మీ తత్వం.
ఒక చేతిలో త్రిశూలం-పాశం--శివ పార్వతి తత్వం.
🌿చెఱుకువిల్లు,నల్లకలువ- మన్మధుడు, రతీదేవి తత్వం.
వరికంకి, గద- భూదేవి వరాహస్వామి తత్వం.
🌸బీజాపూరం(దానిమ్మ పండు), ఏకదంతం -- పుష్టి, పుష్టి పతి తత్వం.
ఇక తొండంలో రత్న ఖచిత కలశం- మోక్షానికి సంకేతం.
🌹 4. లక్ష్మీ గణపతి :🌹
🌸ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం! అదే లక్ష్మీ అంటే. (గాయకుడికి- పాడగలడమే శక్తి)
🌷గణపతి యొక్కశక్తి యే లక్ష్మీ అంటే.( విష్ణుపత్ని లక్ష్మి అని ఇక్కడ కాదు.)🌷
🌹 5. నాట్య గణపతి :🌹
🌸ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు.ఆనంద గణపతే నాట్య గణపతి అన్నా తాండవ గణపతిఅన్నా కూడా.
🌿కాలం లయాత్మకo, ఊపిరీ లయాత్మకo అలా లయాత్మకంగా గమనం చేసే చైతన్యమే నాట్య గణపతి.
🌹 6. హేరంబ గణపతి :🌹
🌸శుభమైన శబ్ద స్వరూపుడు అంటే ఓంకార స్వరూపుడు.
హే=దీనులు, రంభ=పాలించువాడు దీనులను పాలించువాడు.
🌹 7. వినాయకుడు :🌹
🌿విగతనాయకుడే వినాయకుడు . అంటే ఆయనకు పై ఇక వేరే నాయకుడు లేరు. వినయమును ఇచ్చువాడు వినాయకుడు.
🌹8. మూషిక వాహనుడు :🌹
🌸గుండె గుహలోని జీవుడనే ఎలుక, ప్రపంచం చుట్టూ తిరిగి, విషయవాంఛలన్నీ ఆ హృదయ గృహలో అనుభవిస్తూ ఉంటాడు.
🌷 ఆ జీవాత్మని అధిష్టించిన పరమాత్మ మూషిక వాహనుడు.. .
🌿నోరుఅనే కలుగులో తిరిగే నాలుకే ఎలుక. దాన్ని అధిష్టించి వచ్చే అక్షరపతే గణపతి- మూషిక వాహనుడు.
🌸🌹09. గణపతి :🌹
మనుషులు, ఇంద్రియములు, పంచప్రాణాలు.
🌿ఇలా ఏమి చూసినా గణములే.
ఆ గణములన్నిటికీ పతియే - గణపతి....శుభ మస్తు..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
అరిషడ్వర్గాలు
అరిషడ్వర్గాలు
➖➖➖1. కామము:– ఇది కావాలి, అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
2. క్రోధము:– కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
3. లోభము:– కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.
4. మోహము:– తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.
5.మదము:– తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల అది తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
6. మాత్సర్యము: – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.
ఈ అరిషడ్వర్గాలు నుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.
బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం
బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:
బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.
మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.
తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.
మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు
దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది.
గణేష చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు ? పొరాపాటున చూస్తే ఏం చేయాలి... ?
🎻🌹🙏 గణేష చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు ? పొరాపాటున చూస్తే ఏం చేయాలి... ?
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿వినాయకుడు , విఘ్నేశ్వరుడు , గణాధిపతి , గణనాథుడు ఇలా ఎన్నో పేర్లు గణేషుడికి ఉన్నాయి.
🌸ఏ పూజ చేసినా అందులో ముందుగా ప్రార్థించేది గణపతినే. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు (ఆటంకాలు) రాకుండా కాపాడుతాడని గణేషుడికి ముందుగా పూజలు చేస్తారు.
🌿ఇక ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేపడతారు.
🌸నవరాత్రుల అనంతరం గణేషున్ని ఘనంగా సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు.
🌿అయితే వినాయక చవితి రోజున గణేషుడికి పూజ చేయడంతోపాటు మనం చేయకూడని పని కూడా ఇంకోటి ఉంటుంది.
🌸 అదేనండీ , చంద్రున్ని చూడడం. చాలా మంది పండితులు , పెద్దలు వినాయక చవితి రోజు చంద్రున్ని చూడవద్దని , అలా చూస్తే నీలాపనిందల పాలు కావల్సి వస్తుందని చెబుతారు.
🌿 అయితే దాని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
🌸సర్వ గణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయంపై దేవతలందరూ శివున్ని కోరగా ,
🌿 అప్పుడు శివుడు వినాయకుడు , కుమార స్వామిలలో ఎవరో ఒకరు గణాధిపతిగా ఉంటారని , అందుకోసం వారిద్దరికీ పోటీ పెడతానని చెబుతాడు.
🌸ఈ క్రమంలో వారిద్దరినీ పిలిచి శివుడు ఏం చేయమని చెబుతాడంటే , ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులు , పుణ్యక్షేత్రాల్లో ఎవరైతే ముందుగా స్నానం ఆచరించి
🌿తమను చేరుకుంటారో వారికే గణాధిపత్యం వస్తుందని శివుడు చెబుతాడు.
🌸అప్పుడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ముల్లోకాలను చుట్టి రావడానికి బయల్దేరతాడు.
🌿ఈ క్రమంలో గణేషుడు ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివపార్వతులకు నమస్కారం చేస్తూ
3 సార్లు వారి చుట్టూ తిరుగుతాడు.
🌸 అలా తిరిగే క్రమంలో గణేషుడు ప్రతి సారి కుమారస్వామికి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తూనే ఉంటాడు.
🌿దీంతో తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయగానే గణేషుడు ముల్లోకాలను చుట్టి వచ్చినట్టు అవుతుంది.
🌸ఈ క్రమంలో కుమారస్వామి కన్నా గణేషుడే మొదట వచ్చినట్టు అవుతుంది. అప్పుడు శివుడు సంతోషించి గణేషున్నే సర్వ గణాలకు అధిపతిని చేస్తాడు.
🌿అప్పుడు జరిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాలను గణేషుడు సుష్టుగా తింటాడు.
🌸దీని వల్ల తల్లిదండ్రుల ఆశీర్వచనాలను తీసుకునే క్రమంలో వంగినప్పుడు అతనికి ఇబ్బందిగా ఉంటుంది.
🌿 సరిగ్గా నమస్కారం చేయలేకపోతాడు. అప్పుడు చంద్రుడు గణేషున్ని చూసి నవ్వుతాడు.
🌸దీంతో పార్వతిదేవి ఆగ్రహం చెంది చంద్రుడికి శాపం పెడుతుంది. చంద్రున్ని చూసిన వారందరూ నీలాపనిందలకు గురి కావల్సి వస్తుందని అంటుంది.
🌿ఎవరైతే బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నాడు చంద్రున్ని చూస్తారో వారు నిందల పాలు అవుతారు అని శాపాన్ని మారుస్తుంది.
🌸 అప్పటి నుంచి చవితి రోజు చంద్రున్ని ఎవరూ చూడకూడదని చెబుతూ వస్తున్నారు.
🌿అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చవితి నాడు ఆవు పాలు పిండుతుండగా అందులో చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది.
🌸దీంతో తాను నిందల పాలు కావల్సి వస్తుందని కృష్ణుడు చింతిస్తుంటాడు.
అనుకున్నట్టుగానే శ్యమంతకమణి అనే మణిని అపహరించినట్టు అతని మీద నింద పడుతుంది.
🌿 దీంతో ఎలాగో కష్టపడి శ్రీకృష్ణుడు ఆ మణిని తెచ్చి ఇచ్చి తన నిందను పోగొట్టుకుంటాడు. అయితే ఆ సంఘటన జరిగిన తరువాత శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు.
🌸ఎవరైతే వినాయక చవితి రోజు పూజలు చేసి గణేషుడి ఆశీర్వచనాలు పొందుతారో వారికి చంద్రున్ని చూసినా ఏమీ అవదని అంటాడు.
🌿అప్పటి నుంచి చాలా మంది చవితి రోజు వినాయకున్ని కచ్చితంగా పూజించడం మొదలు పెట్టారు.
🌸 మరో పరిహారం కూడా ఉంది. చంద్ర దర్శనం చేసిన వారు దోషం పోవడానికి ఈ క్రింది శ్లోకం చదివినా మంచిదని అంటున్నారు...🚩🌞🙏🌹🎻
🌷సింహః ప్రసేన మవధీత్ సింహొజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యోషస్సః మంతకః..🌷
సేకరణ 👌
*🌿🌸🌿 వాసవి ప్రసాద్ 🌿🌸🌿*
Monday, August 29, 2022
మూడు ప్రశ్నలు (మూలం: Three questions – Leo Tolstoy)
*🍁మూడు ప్రశ్నలు*🍁
📚✍️ మురళీ మోహన్
ఆ రోజుకి సభ చాలించి లేవబోతూ రాజు మంత్రి కేసి చూసేడు.
“ఇంకా ఏదైనా మిగిలి ఉందా?”
“మీకు కోపం రాదని చెప్తేనే కానీ చెప్పడానికి లేదు. ఆ మధ్య మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పినవాళ్ళని దండించేరు కనుక అలా అడగవలసి వస్తోంది.” చెప్పేడు మంత్రి.
ఆ రోజు సంతోషంగా ఉన్నాడేమో ఏవిటో కాని, రాజు నవ్వుతూ చెప్పేడు, “ఆ శిక్షలు మిగతావాళ్లకే లెండి. చెప్పండి ఏమిటి సంగతులు?”
“మన రాజ్యపు సరిహద్దు చివరలో ఒక ఊరికి బైటగా ఒక సాధువున్నాడనీ ఆయన మీ సందేహాలకి సరైన సమాధానం ఇవ్వగలడనీ చారుల ద్వారా తెల్సింది.”
“ఆ సమాధానాలు నాకు నచ్చకపోతే?”
“సమాధానాలు నేను చెప్తానని ఆయన అనలేదు మహారాజా. ఆయన ఆశ్రమంలోంచి బయటకి రాడు. ఎవరైనా కలవాలనుకుంటే ఆయన దగ్గిరకే ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. రాజహోదాలో కాకుండా మామూలు బట్టలు వేసుకుని వెళ్తే తప్ప ఆయన మీతో మాట్లాడడని చెప్తున్నారు. చారులు చెప్తే విన్నాను తప్ప ఆయన నాకు పంపించిన వార్త కాదండి ఇది.”
“నేనొక్కణ్ణే వెళ్ళాలా? దారిలో నన్ను హత్య చేసి మరొకడెవడో రాజ్యం సంపాదించడానికి వేసిన ఎత్తులా లేదూ?”
“అది కూడా విచారించాను లెండి. ఆ సాధువు నిజంగా సాధువే. ఎవరో పంపిన గూఢచారి కాదు. ఆయన జ్ఞాని అని ప్రజలు చెప్పుకుంటున్నారు. మన దగ్గిరకి ఇలాంటి విషయాలు అంత తొందరగా రావు కదా?”
“అయితే?”
“మీరు వెళ్తానంటే రెండు షరతులు. ఒకటి, మీ వెంట కొంచెం దూరంగా మిమ్మల్ని రక్షించడానికి చారులు వస్తారు. కానీ ఆశ్రమంలో చారులూ, అంగరక్షకుడూ అడుగుపెట్టడానికి లేదు. మీకు మీరే రక్షించుకోవాల్సి ఉంటుంది లోపలకి
వెళ్ళాక…”
“సాధువుకెన్నేళ్ళుంటాయి?”
“ఆయనకి డబ్బై పైనే ఉండొచ్చు. మీకు ఆయన వల్ల ఏమీ ప్రమాదం రాదు. రెండోది, మీకు ఆయన సమాధానాలు నచ్చకపోతే సాధువుని ఏమీ చేయకూడదు. నేను విన్న ప్రకారం ఆయన జ్ఞానే, కానీ ఆయన్ని దండించడం వల్ల మనకి వచ్చేది ఏమీలేదు, ప్రజాగ్రహం తప్ప.”
“ఆ మాత్రం అర్ధం అయింది లెండి. నన్ను నేను రక్షించుకోగలను. వచ్చే వారానికి ఏర్పాట్లు చేయండి. చూద్దాం ఏమౌతుందో ఈ సారి. ఇప్పటికి ఎంతమంది వచ్చినా నోటికొచ్చిన సమాధానాలు చెప్పడమే గానీ ఏవీ సరిగ్గా ఆలోచించి చెప్పినట్టు కనబడదు.”
“సరే. ఈ సారెందుకో మీకు సరైన సమాధానాలు దొరుకుతాయని నాకనిపిస్తోంది.”
ఆ పై వారం రాజు మామూలు మనిషిలాగా బయల్దేరేడు సాధువుని కల్సుకోవడానికి. రాజుకి కనబడకుండా చారులు వెనకనే బయల్దేరేరు. మంత్రి చెప్పడం ప్రకారం సాధువు ఆశ్రమం ఊరి బయట, కానీ రాజు నడుస్తూంటే తెలిసి వచ్చినదేమిటంటే, ఊరికి దూరమే.
రాజు ఆశ్రమానికి వెళ్ళేసరికి, సాధువు పాదులు తవ్వుతూ ఆరుబయట ఉన్నాడు. రాజు లోపలకి రావడం చూసేడు తలెత్తి. ఓ క్షణం తర్వాత రాజు లోపలకి వచ్చినట్టు గమనించి పట్టించుకోనట్టూ మళ్ళీ మొక్కల మీద దృష్టి సారించేడు. రాజు సాధువు దగ్గిరకి వెళ్ళి కాసేపు ఆగి అన్నాడు.
“మీరు జ్ఞానసంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”
రాజు మాట్లాడుతూంటే సాధువు విన్నాడు గానీ ఏమీ సమాధానం చెప్పలేదు. సమాధానం మాట అటుంచి, మొక్కలకి గొప్పులు తవ్వడం చేస్తూనే ఉన్నాడు. కాసేపు గడిచేసరికి సాధువుకి చెమట్లు పట్టేయి. ఇది చూసి రాజు చెప్పేడు.
“మీరు అలిసిపోయేరు. కాసేపు అలా కూర్చోండి, వీటి సంగతి నేను చూస్తాను.” ఇలా అని ఆయన తవ్వే గునపం చేతిలోకి తీసుకున్నాడు. సాధువు మొహంలో సంతోషం కనిపించింది.
ఎంతసేపు ఇలా తవ్వినా సాధువు రాజు ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు, ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు తవ్వడమే గానీ. దాదాపు సాయంత్రం అవుతూంటే రాజు మళ్ళీ అడిగేడు సాధువుని, “మీరు మంచి జ్ఞానులని మా మంత్రి చెప్తే విని ఇలా మిమ్మల్ని నా సందేహాలు అడుగుదామని వచ్చాను. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే సరే, నేనేమీ అనుకోను. కానీ…”
సాధువు నోరు విప్పేలోపుల దూరంగా ఎవరో పరుగెడుతున్నట్టు చప్పుడైంది. “ఇటు వైపు ఎవరో వస్తున్నట్టున్నారే? చూద్దాం రా,” అంటూ అటువైపు నడిచేడు. రాజు అనుసరించేడు.
వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఒకాయన కడుపు చేత్తో పట్టుకుని వస్తున్నాడు. కడుపులో కత్తీ, కారే రక్తంతో భయానకంగా ఉంది పరిస్థితి. సాధువూ, రాజూ అతణ్ణి తీసుకెళ్ళి ఆశ్రమం లోపల గుడిసెలో పడుకోబెట్టేరు. రాజు గాయాన్ని శుభ్రం చేస్తూంటే, సాధువు పక్కనుంచి సహాయం చేశాడు చేతనైనంతలో. కాసేపటికి రక్తం కారడం తగ్గాక అతనికి తాగడానికి ఏదో ఇచ్చి పడుకోబెట్టారు. ఈ తతంగం అయ్యేసరికి బాగా చీకటి పడింది.
బాగా అలిసిపోయిన రాజు, సాధువు ఉంటున్న ఆశ్రమంలో ఏమి తింటున్నాడో చూసుకోకుండా ఉన్నదానితో కడుపు నింపుకుని, ఉత్తరక్షణంలో నిద్రలోకి జారిపోయేడు. ఇంతటి శరీర శ్రమ అలవాటులేని రాజుకి ఆ నిద్ర ఎంతగా పట్టిందంటే కళ్ళు తెరిచేసరికి మర్నాడు బారెడు పొద్దెక్కి ఉంది.
గాయం తగిలిన మనిషి రాజు లేవడం చూస్తూనే, లేచి వెంటనే చెప్పేడు చేతులు జోడించి, “మీరు నన్ను క్షమించాలి మహారాజా!”
రాజు అతనికేసి నిశితంగా చూసి అన్నాడు, “మీరెవరో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఎందుకు క్షమించడం?”
“నేనెవరో మీకు తెలియకపోవచ్చు. కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. మా అన్న చేసిన తప్పుకి అతన్ని ఉరి తీయించి ఆస్తి జప్తు చేసుకున్నారు మీరు. మిమ్మల్ని ఎప్పటికైనా చంపాలని నేను అనుకున్నాను. నిన్న ఒక్కరూ ఇలా బయల్దేరారని తెల్సిన వెంటనే నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను – తోవలో చంపేయడానికి. కానీ వెనకాల వచ్చే మీ అనుచరుల్లో ఒకడు నన్ను గుర్తు పట్టి కడుపులో బాకు గుచ్చాడు. పారిపోయేను ఇటువైపుకు వాళ్ళకి కనబడకుండా అక్కడ్నుంచి. ఏదో పొదల్లోనో, తుప్పల్లోనో పడిపోయుంటే రక్తం కారిపోయి చచ్చిపోయి ఉండేవాణ్ణి. కానీ మీరు కనిపించి ఆశ్రమంలో గాయానికి కట్టు కట్టడం వల్ల బతికాను నిన్న రాత్రి. నేను మిమ్మల్ని చంపుదామనుకుంటే మీరు నన్ను చావకుండా రక్షించారు. అందుకే మిమ్మల్ని క్షమించమని ఆడిగేను,” అని చెప్పి తల దించుకున్నాడు ఆగంతకుడు.
రాజు మొహంలో ఒక్కసారి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కనబడింది. మళ్ళీ అన్నీ కనుక్కుని న్యాయం జరిగేలా చూస్తానని ఆగంతకుడికి హామీ ఇచ్చేడు అక్కడికక్కడే. గుడిసెలోంచి బయటకొచ్చి సాధువుని చూసి చెప్పేడు రాజు, “మీరు సమాధానం చెప్తారేమో అని చూశాను నిన్నంతా. చూడబోతే మీకు తెలియదో, లేకపోతే చెప్పడం ఇష్టం లేదో. రాజ్యం మంత్రులకొదిలేసి నేనిక్కడ కూర్చోవడం కుదరదు కదా? అందుచేత శెలవు ఇప్పించండి. వెళ్ళాలి.”
సాధువు చెప్పేడు “నీకు అన్ని సమాధానాలూ నిన్ననే దొరికాయి కదా? ఇంకా చెప్పడానికేం ఉంది?”
“అవునా? అదెలా?” రాజు ఆశ్చర్యపోయేడు.
“నువ్వు నిన్న వచ్చినప్పుడు నేను పాదులు తవ్వుతున్నాను. నా మీద జాలిపడి గునపం తీసుకుని నువ్వు తవ్వడం మొదలు పెట్టావు. అలా జాలి పడకుండా నీ దారిన నువ్వు వెళ్ళినట్టైతే ఈ ఆగంతకుడు నీ మీద దాడి చేసి నిన్ను చంపి ఉండేవాడు. అప్పుడు నాతో ఉండకుండా వెళ్ళిపోయినందుకు నీకు చెడు జరిగి ఉండేది. అందువల్ల అప్పుడు నీకు అన్నింటికన్నా ముఖ్యమైన మనిషిని నేను. ముఖ్యమైన సమయం పాదులు తవ్వే సమయం. ముఖ్యమైన పని నాకు పాదులు తవ్వడంలో సహాయం చేయడం.
ఆ తర్వాత ఈ ఆగంతకుడు వచ్చినప్పుడు ముఖ్యమైన పని ఆగంతకుడి గాయానికి కట్టుకట్టడం. ముఖ్యమైన మనిషి ఆగంతకుడే. సరైన సమయం ఆగంతకుడికి సహాయం చేస్తూ మంచి చేసే సమయం. ఇవన్నీ చూస్తే తెలుస్తోందిగా? అన్నింటికన్నా ముఖ్యమైన సమయం ఇప్పుడే. ఎందుకంటే భూత, భవిష్యత్ వర్తమానాల్లో ఈ ప్రస్తుత సమయంలోనే మనకి ఏ పని అయినా చేయగలిగే అధికారం, స్తోమతా ఉన్నది. అందరికన్నా ముఖ్యమైన మనుషులు – ఆ సమయంలో నీ కూడా ఎవరు ఉంటే వాళ్ళే. ఎందుకంటే జీవితంలో ఎవరికి ఎవరితో సంబంధాలు ఉంటాయో, అవి ఎప్పుడు ఎలా ఉంటాయో, ముందు ముందు అసలు ఉంటాయో పోతాయో మనకి తెలియదు కనక. అన్నింటికన్నా ముఖ్యమైన పని ఈ సమయంలో నీతో ఉన్నవాళ్ళకి మంచి చేయడం. ఆ మంచి చేయడం కోసమే భగవంతుడు మనిషిని సృష్టించాడు.”
సాధువు సమాధానాలకి తృప్తి పడ్డట్టూ తలాడించి ఆశ్రమంలోంచి బయటకి నడిచేడు రాజు.
(మూలం: Three questions – Leo Tolstoy)
గణపతి నిమజ్జనం ఎందుకు?
గణపతి నిమజ్జనం ఎందుకు?
ఓం గం గణపతయే నమః
మట్టి #గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న శౌనకాదులు సూతుడితో 'మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు?' అన్నారు శౌనకాదుల. ఆ ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.
వినండి. మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం. పూజ చేస్తాం. అంతవరకు బాగాబే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి, స్థితి, లయల చక్రభ్రమణం. ఇదే పరబ్రహ్మతత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్ర జలమందు గానీ, నదీ, తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి, అంటే వ్యాపిస్తూ, పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ, భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే" అని వివరించాడి సూతమహర్షి.
మట్టి ని తీసి నీటిలో కలిపి ప్రతిమను చేసి, పూజించి దేవుణ్ణి చేసి, దైవత్వం తెప్పించి....ఆ దేవతా స్వరూపమయిన విగ్రహాన్ని నీటిలో నిమర్జించడం..ప్రకృతిలో సృష్టించబడిన ప్రతిదీ ప్రకృతిలోనే కలిసిపోతుందనే మహా తత్వాన్ని తెలిపే ప్రక్రియే గణపతి ఉత్సవం...... ప్రపంచం లో ఏ ఇతర మతం ఆలోచించని సాహసం...... బుజ్జి గణపయ్య... బొజ్జ గణపయ్య....మా హిందువులకు బుద్ది ఇవ్వవయ్య 🙏🙏
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి.
ఓం గం గణపతయే నమః
#GaneshChaturthi
ఇప్పుడు గణేశోత్సవం, దశహర, నవరాత్రుల సమయంలో గుర్తుంచుకోండి మరియు ఎవరైనా ఇలా చేస్తే, అతనికి వివరించండి..
*చాలా ఆసక్తికరమైన ప్రశ్న..*
ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలతో నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా..?
ఏసుక్రీస్తు ముందు శాంతాబాయి పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా..?
జైన మతస్థులు తమ దేవుడి ముందు ఆలా బాబూరావు పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా..?
ఈ సమాజాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత ప్రయోజనాలను గౌరవిస్తాయి. ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి..
అలాంటప్పుడు మన హిందూ మతానికి చెందిన దేవుడి ముందు మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి ఈ అసభ్య నృత్యం ఎందుకు..?
ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎందుకు విధించబడింది లేదా మనమే ఆలా చేస్తున్నామా..??
డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి మనకు ఇష్టమైన, మన సనాతన సంస్కృతిని అవమానిస్తున్నాం..
మన పండుగలు చాలా ఉత్సాహంగా మరియు పెద్ద ఎత్తున జరుపుకోవాలి, కానీ సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, డ్రమ్స్, మజీరో, షానాయి, సాంప్రదాయ దుస్తులు మరియు తలపాగా యొక్క వైభవం ప్రతి హిందువుల పండుగలో కనిపించాలి..
అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది. చూడండి, మీ గురించి ఆలోచించండి మరియు ఇతరుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి..
వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు కదా? కానీ వారు తమ మతపరమైన కార్యక్రమంలో అలాంటి దుబారా చేయరు..
ఇప్పుడు గణేశోత్సవం, దశహర, నవరాత్రుల సమయంలో గుర్తుంచుకోండి మరియు ఎవరైనా ఇలా చేస్తే, అతనికి వివరించండి..
*బదులుగా, హిందూ భక్తి పాటలు మరియు సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టండి..*
భగవద్ అనుగ్రహం - పొందాలంటే మనం ఏమి చేయాలి???
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
నేటి సద్విషయం
భగవద్ అనుగ్రహం - పొందాలంటే మనం ఏమి చేయాలి???
ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే...
సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుతున్నాయి...
నీరే పైకి ఆవిరి కాకున్నా వర్షాలు పడే అవకాశం లేదు,
అలాగే మనం చేసే ప్రార్థనలు పైకి చేరితేనే భగవంతుని ఆశీస్సులు కిందికి రాగలవు...
భగవంతుడు ఉన్నాడు అనే స్పృహ లేకుండా, నిత్యం తీరిక లేని వారివలె, సంసార సాగరంలో, మునిగి ఉంటే, భగవద్ అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది?...
సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు...
నిత్యం సాధన చేయాలి, భగవంతుడిని అనుభవించాలి, ఏది జరిగినా ఆయన దయ అన్న భావం ఉండాలి, అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది...
లేదా ...
మనకు part time devotion ఉంటే ఆయనకు కూడా మన పట్ల part time grace ఉంటుంది...🌺✍️
🌺శుభమస్తు🌺
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
మనకు మనమే అన్నీ!
🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏
పెద్దలమాట చద్ది మూట
🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏
ది.29-8-2022
మనకు మనమే అన్నీ!
🕉️
మనకు అత్యంత ప్రీతిపాత్రులు ఎవరు?
'మనకు మనమే' అంటుంది శాస్త్రం. గీతాచార్యులు చేసిన ఈ ప్రతిపాదన అమృతపు గుళిక. మోక్షానందంతో పాటు ఇహలోక జీవనానికి కూడా ఇదే మహామంత్రం. మన జీవితం ఎలాసాగాలో మనమే నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మలచుకోవాలని హితవుపలికే శ్లోకం. ఇటీవల వ్యక్తిత్వ వికాస పాఠాల్లో, గీతలోని ఆరవ అధ్యాయంలోని ఈ శ్లోకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్లో||
ఉద్ధరేదాత్మనా2..త్మానం
నా2..త్మానమవసాదయేత్!
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః!!
-భగవద్గీత.
ప్రతి వ్యక్తి తనను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతిలో పడరాదు. తనకు తానే బంధువు - తనకు తానే శత్రువు..!
మనకు ఆరోగ్యం కావాలంటే ఆహార వ్యవహారాలలో నియమాలను, నిషేధాలను పాటించవలసి ఉంటుంది. ఎవరు? మనమే!
వృత్తి ఉద్యోగాల్లో రాణించాలన్నా, సమాజంలో గౌరవాదులు సంపాదించాలన్నా ఎవరు పనిచేయాలి? మనమే!
ఈ విధంగా లౌకిక జీవనయాత్రలో, మరుజన్మలో సౌఖ్యం కోసం కూడా మనకై మనం శ్రమించాలనే దివ్య సందేశం ఇచ్చేది ఈ గీతామృతం. ఇతరులు దారిచూపిస్తారేమోగానీ, ప్రయాణకష్టం మనదే!
అలాగే గమ్యస్థానం చేరవలసిందీ, చేరేదీ మనమే!
ప్రతి జీవికి తన మనస్సే శత్రువు - తన మనస్సే తనకు బంధువు కూడా!
మనసును ఎప్పుడూ మనవశంలో ఉంచుకోగల్గితే బంధువుగా, మిత్రుడిగా సహాయపడుతుంది. మనస్సును శత్రువులా చూస్తే అది మన అధోగతికి కారణం ఔతుందని దీని అంతరార్థం.
మన అనుభవాన్ని గురువుగా చేసుకుంటే మనం ఉద్ధరింపబడతాం. అలా కాకపోతే కష్టపడతాం అనే అర్థంలో కూడా భగవంతుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఎవరిమటుకు వారు తమను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురు చూడకూడదు.
🕉️
తన్మే మనః శివ సంకల్పమస్తు
శివాయ గురవే నమః
సేకరణ:-
జంధ్యాల మోహన సత్యసాయి
🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏
🌺మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి?🌺
🌺మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి?🌺
🌷🌷🌷🌷🌷🌷
🌿ఇది అందరూ అడిగే ప్రశ్న. దానికంటూ బోలెడు ప్రయత్నాలు - పద్ధతులు అవలంబిస్తుంటారు. అన్వేషిస్తుంటారు. కానీ ఎంతమేరకు సాధించగలుగుతున్నారు?
🌿ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతున్న రోజులివి. పరుగుల జీవితంలో నిదానం కరువౌతోంది! ఈ పరిస్థితుల్లో సరియైన పరిష్కారం దేని నుండి సాధించగలం?
🌿నిజానికి ఈ ప్రశ్న ఏ కాలంలోనైనా సహజమే.
మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది?
🌿ఈ 'శాంతి' అనే వస్తువు ఎక్కడో దాగి ఉండలేదు మనస్సులోనే ఉంది. దానిని గ్రహించలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
🌿'ఉన్నదానితో సంతృప్తి చెందితే జీవితంలో ఎదగలేం' అన్నది ఎంత నిజమో, 'సంతృప్తి లేనివాడు ఎన్నడూ హాయిగా ఉండలేడు. అంతులేని ఆశతో యాతన పడతాడు' అనేదీ నిజమే. ఈ రెండు సత్యాలు పరస్పర విరుద్దాలుగా కనబడడం సహజం.
ఇలాంటి ఎన్నో జీవితంలో తారసపడతాయి. 'ఆలస్యం అమృతం విషం' అన్న సూక్తి మాదిరిగానే 'నిదానమే ప్రధానము' అనే సుభాషితం ఉంది. 'విద్యా విహీనః పశుః' అనే మాటతో పాటు, 'చదువుకున్న వాని కంటే సంస్కారవంతుడు మేలు' అనే అర్థం వచ్చే సామెతలూ ఉన్నాయి.
🌿అంటే ఏదీ పూర్తి సత్యంగా తీర్మానించి జీవితాన్ని వెళ్లదీయలేం. ప్రతి దానికీ ఒక 'సమతౌల్య కేంద్రం' ఉన్నదిగా అని పై ప్రసిద్ధ వాక్యాల నడుమ సమన్వయ సూత్రం. ఆ కేంద్రాన్ని పట్టుకోగలిగినప్పుడు శాంతిని సాధించగలం.
🌿కొన్ని లక్ష్యాల ఆశయాలు కలిగి ఉండడం సహజం. అలాగే కొన్ని అంచనాలు, ఆశలు ఉంటాయి. వాటికి విరుద్ధంగా సంఘటనలుంటే అశాంతి. కానీ మనం ఊహించినట్టే అన్నీ ఉండాలనీ, ఉంటాయని అనుకోవడమూ పొరపాటే.
జీవితం గురించి లోతుగా ఆలోచించలేని వారు ఆశల సాఫల్యాల వైఫల్యాలకు పొంగి, కుంగి పోతుంటారు.
మనస్సును అదుపులో ఉంచుకోవడమే శాంతికి మూలం. కానీ అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు.
🌺1. మనం చేయదగినంత చేసినప్పుడు ఫలితంగా లభించిన దానితో తృప్తిగా, సర్దుకుని జీవించగలగాలి దీనిని మన తత్త్వశాస్త్రం 'యదృచ్ఛా లాభ సంతృష్టి' అన్నది. ధర్మబద్ధంగా, శ్రమతో సాధించిన దానితో తగిన విధంగా జీవన శైలిని మలచుకునే వారు శాంతిగా ఉంటాడు.
🌺2. ఒక లక్ష్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా లభించనప్పుడు, ఇంక దానికోసమే కాలయాపన లేకుండా - మన ప్రయత్నంతో సాధించగలిగే మరో ప్రయోజనం కోసం ప్రయత్నించడం శ్రేష్ఠం. పరిష్కరించలేని, ఊహించని కష్టం వచ్చినప్పుడు - దానిని తొలగించడం అసాధ్యమన్నప్పుడు - ఆ సమస్యతోనే మరో విధంగా ఎలా సుఖంగా జీవించగలమో చూడాలి.
ఉదా: అనుకోకుండా ఆధారమైన ఆత్మీయులు అస్తమిస్తే హతాశులమైనా, నెమ్మదిగా కోలుకుంటూ ఆ లోటు నుండే మరో బ్రతుకు తీరును మలచుకొని జీవించడాలను చూస్తున్నాం.
🌺3. పోల్చి చూసుకోవడం కూడా అశాంతికి హేతువు. ఆదర్శానికి పనికి వచ్చే పోలికలు, కొన్ని సార్లు ఆందోళనకీ, ఆవేదనలకీ హేతువౌతాయి. ఒకరికి ఉన్నది మనకి లేదే, అనే వేదన కంటే - నాకు అవసరమైనవి ఉన్నవా లేవా అని పరిశీలించడం ముఖ్యం.
🌺4. మన చుట్టూ ఉన్న ఆనందాలను గమనించడం నేర్చుకోవాలి. అవకాశాలను పరికించాలి. దిక్కులేని బ్రతుకు వల్ల ఏమీ సాధించలేని వారిని చూసినప్పుడు - తల్లిదండ్రులు పాలనలో పెరిగిన అదృష్టానికి ఆనందించాలి. అన్ని అవయవాలు పని చేస్తున్నందుకు సంతోషించాలి. అదే విధంగా - ఇంద్రియాల లోపాలున్నా ఉత్సాహంగా, ఎన్నిటినో సాధించిన వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండడం స్వభావం చేసుకున్నప్పుడు శాంతి సహజంగా ఉంటుంది.
🌺5. పరిస్థితులపై, మనుష్యులపై 'తమ అశాంతికి కారణం' అని ఆరోపించే ధోరణీ తప్పే, సర్దుబాటు, సవరణ - జీవితంలో తప్పవు. మనకి లభించిన శరీరంతో, దాని శక్తితో సర్దుకుంటూనే సాధ్యమైనంత సవరించుకుంటున్నాం. సవరించుకోలేని వాటిని సరిపెట్టుకుంటున్నాం.
ఇదే ధోరణి మానవ సంబంధాలలోనూ, సంఘటనలలోనూ కూడా కొనసాగాలి.
🌺6. అనుకోని దుఃఖం ఇవాళ వచ్చినట్లే, అనుకోని సుఖమూ ఎప్పటికైనా రావచ్చు- అనే ఆశావాదమూ ముఖ్యమే.
🌺7. ' వేదాంత వాక్యాలు' అని తోసిపుచ్చినప్పటికీ - వివేక వైరాగ్యాలు శాంతికి, మనసు నిబ్బరానికి దోహదపడతాయి. కలవరపరచేవేవీ స్థిరం కాదనీ, కేవలం తన ఆలోచనలే ఆందోళనకి గానీ, ఆనందానికి గానీ ఆలంబనలౌతున్నాయని గమనించగలిగితే చాలు.
ఒక ప్రవాహానికి కాసింత తలవంచినా, అది దాటగానే తిరిగి నిలబడగలిగే వృక్షంగా తలఒగ్గడం, తల ఎత్తడం... అనేదీ ఆయా పరిస్థితుల్లో అనుగుణంగా చేయగలిగినవాడు విజయవంతుడౌతాడు.
ఏ విషయంలోనూ, ఎవరితోనూ ఎక్కువ రాగద్వేషాలను పెంచుకోరాదంటుంది వేదాంత శాస్త్రం. అదే రీతిలో లక్ష్యాలను అతిగా ఏర్పరచుకొని వాటి కోసం ఆరోగ్యాన్నీ, ధర్మాన్నీ కూడా పట్టించుకోని రీతిగా శ్రమించడమూ అశాంతికి హేతువే.
''మన యేవ మనుష్యాణాం కారణం బన్ధమోక్షయోః" అనే వేదాంత వాక్యం అక్షర సత్యం. మన మనస్సే మన బంధానికీ, మోక్షానికి కారణం.
🌿అఖండ మనశ్శక్తిని అల్ప సుఖాల కోసం, అల్ప ప్రయోజనాల కోసం వెచ్చించి - దానిని గుర్తించలేక పోతున్నాం. వినియోగించుకోలేక పోతున్నాం.
తగిన సరళిలో అదుపులో పెట్టుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు సమస్యలకు చలించిపోము.
🌿ఒకే సంఘటనకు ఒకడు విలవిలలాడి కుప్పకూలితే, అదే సంఘటనకు మరొకడు నిబ్బరంగా ముందుకు సాగడం - మనం నిత్యం జీవితంలో చూస్తూనే ఉన్నాం.
అందుకే పరిస్థితులు శాంతికీ, అశాంతికీ హేతువులు కావు. మనస్సు స్పందించే తీరే ప్రధానం.🙏
-✍️ ''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]🙏🙏
🌷🌷🌷🌷🌷🌷
స్వామి వివేకానందకి ధ్యాన శిక్షణలో మార్గదర్శకత్వం
280822d2012. 290822-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀63.
ఓం నమోభగవతే రామకృష్ణాయ
స్వామి వివేకానంద జీవిత గాథ:-63.
➖➖➖✍️
*ధ్యాన శిక్షణలో మార్గదర్శకత్వం*:
▪️〰️▪️
నరేంద్రుని ధ్యాన శిక్షణలలో శ్రీరామకృష్ణులు ఎలా మార్గదర్శకులయ్యారో పరికిద్దాం. నరేంద్రుడు తెల్లవారుజామున ధ్యానానికి కూర్చునేవాడు. అది సరిగ్గా ప్రక్కనే ఉన్న జనపనార మిల్లులో సైరన్ మ్రోగే వేళ. గుండెలు అవిసేలా మారుమ్రోగే ఆ ధ్వని ధ్యాన సమయంలో నరేంద్రునికి గొప్ప అవరోధంగా తయారయింది. ఒక రోజు ఈ సమస్యను శ్రీరామకృష్ణులకు చెప్పి పరిష్కారం తెలుపమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, "ఆ ధ్వనిని ఎందుకు అవరోధంగా భావిస్తావు? ఆ ధ్వనిలోనే మనస్సును లీనం చేయడానికి ప్రయత్నించు. అంతా సరిపోతుంది" అన్నారు. ఆ సలహాను తు.చ. తప్పకుండా పాటించిన నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడు కాగలిగాడు.
ధ్యాన సమయంలో దేహబుద్ధి పూర్తిగా నశించి ధ్యేయ వస్తువులో మనస్సు లయించడం లేదని మరొకసారి అతడు శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకొన్నాడు. *వెంటనే శ్రీరామకృష్ణులు తమ గోటితో నరేంద్రుని భ్రూమధ్యంలో గుచ్చుతూ, "ఈ నొప్పిలో నీ మనస్సును లీనం చేయి" అన్నారు. ఆ విధంగా మనస్సును లీనం చేయగానే నరేంద్రుడు దేహబుద్ధిని అతిక్రమించి ధ్యానంలో మగ్నుడు అవగలిగాడు. "ఆ నొప్పి ఉన్నంతదాకా, నేను కోరుకొన్నంత వరకూ మనస్సును ఏకాగ్రం చెయ్యగలిగాను. అప్పుడు తక్కిన అవయవాలు ఉన్నవనే జ్ఞాపకం కూడా పూర్తిగా నశించింది. కనుక దేహస్మృతి ప్రశ్నే సమసిపోయింది" అని కాలంతరంలో నరేంద్రుడు చెప్పాడు*.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
ఆచార్య సద్భావన, ఆధ్యాత్మిక జీవనం కోసం మన సర్వస్వం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి.
280822a2128. 290822-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀50.
నేటి...
ఆచార్య సద్భావన
➖➖➖✍️
ఆధ్యాత్మిక జీవనం కోసం మన సర్వస్వం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి.
ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు ఉద్యుక్తులమై ఉండాలి.
ఆ పరమగమ్యం కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉండాలి.
మన మనస్సు అత్యున్నతమైన, శాశ్వతమైన ఆనందం పట్ల ఆకర్షణ కలిగి ఉండటం ఒక సుకృతంగా భావించాలి.
మనం స్థిరంగా, క్రమక్రమంగా ఉన్నత పథంలోకి పయనిస్తూ, గమ్యం చేరే వరకూ పట్టు సడలించకూడదు.
ఒక్కొక్కసారి మనం నీరసపడి పట్టు సడలించే ప్రమాదం ఉంది.
కాబట్టి మనం ఆధ్యాత్మిక తీవ్రతను ఏ మాత్రం తగ్గించకుండా కొనసాగించాలి. చాలామంది కొంతకాలం శ్రమించిన తర్వాత ఆసక్తి కోల్పోతారు. పట్టువదలకుండా ఆధ్యాత్మిక సాధనలు, గ్రంథపఠనం, ఆత్మ విశ్లేషణ చేయగలిగేంత స్థాయిలో వారి మనస్సులు ఉండవు. వారి మనస్సులకు బాహ్యదృష్టి, చంచలత్వం ఎక్కువ. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
’అకుంఠిత దీక్ష’ అనేది ఆధ్యాత్మిక జీవనానికి అత్యవసరం. పట్టు సడలించకుండా, నీరసపడకుండా, అధైర్యం, అయిష్టత దరిచేరనీయక శ్రమిస్తేనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమౌతుంది.
మన జన్మ అంతా నిద్ర, మరపు, అశ్రద్ధల మయంగా ఉంటుంది. ఈ ప్రపంచం దుర్భరం, ధన సంపాదనలోనూ, ఖర్చులోనూ మునిగిపోయి మన శక్తినంతా వృథా చేసుకుంటున్నాం. కాబట్టి మనం వీటిలో కాలం గడపకూడదు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
నేటి ప్రపంచంలో మనం ఎలా ఉండాలో తెలుసుకుందాం
నేటి ప్రపంచంలో మనం ఎలా ఉండాలో తెలుసుకుందాం
మిత్రమా ఏనాడు కూడా ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా ఒక్క రోజు కూడా down అవ్వకు..నీ చుట్టూ ఇంతకాలం జనాలు చప్పట్లు కొడుతూ ఉండొచ్చు..కానీ చాలా చప్పట్లలో నిజాయితీ తక్కువ..ఒక్కసారి నువ్వు తప్పటడుగు వేశావని గమనిస్తే..నీలో దైన్యాన్నీ, బేలతనాన్నీ, డల్‌నెస్‌నీ గమనిస్తే నీ చుట్టూ రకరకాల వంకలతో కోలుకోలేనంతగా సాలెగూళ్లు కట్టేస్తారు..ఆ సాలెగూటిలో మరింత ముడుచుకుపోయి నీ అస్తిత్వాన్ని కోల్పోవడం తప్పించి మార్గం లేదు..
యెస్..నిన్ను నీలా ఎవరూ ఉండనీయరు..కానీ నీలాగా నువ్వు ఉండు..నీకు చేయాలనిపించింది నువ్వు చెయ్యి. నువ్వు విజయంలో ఉండి నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నంత వరకే..నీ మాటల్లో కాన్ఫిడెన్స్ కొట్టొంచినంత వరకే నువ్వేం చెప్పినా జనాలు ఊ కొట్టేది...
ఏ క్షణమైతే నువ్వు బేలగా మారతావో ఆ క్షణం నుండి నీ మీద సానుభూతితోనూ, నీకు సూచనల పేరుతో నీ పర్సనల్ జోన్‌లోకి చొచ్చుకు వచ్చి..సున్నితమైన మాటలతో నిన్ను తిడుతూనే నీపై ఆధిపత్యం చెలాయిస్తారు..అంతేనా..నీ పనైపోయింది" అనేస్తారు..ఆ ఒక్క మాట చాలు నీకు మిగిలున్న జీవితం నీలో మానసికంగా సమాధి కావడానికి..
అందుకే దర్జాగా బ్రతుకు..రాజాలా బ్రతుకు..కంచు కంఠంతో మాట్లాడు..మాటల్లో కాన్ఫిడెన్స్ ఉట్టి పడాలి.. ఊరికే నసగకు.. నాలుగడుగులేస్తే కింద పడిపోతామేమో అన్నట్లు నడవకు..చురుకుగా, చలాకీగా నడువు.. నిన్ను చూస్తే పోయిన ప్రాణం లేచి రావాలి..పవర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా కన్పించాలి..నీ ఎనర్జీ లెవల్స్ చూసి నీ జోలికి రావడానికి కూడా నీకు హాని చెయ్యాలనుకునే వారు భయపడాలి..ఈ ప్రపంచంలో కష్టపడి సాధించడం ఎంత కష్టమో..మానసికంగా నిరంతరం కాన్ఫిడెంట్‌గా ఉండడం అంతే కష్టం..
ఒక్క క్షణం కూడా నీ కాన్ఫిడెన్స్ లెవల్ కోల్పోకు..నీ చుట్టూ రాబందులు సిద్ధంగా ఉన్నాయి..నీ ధైర్యంతో అవి నీ జోలికి రాకుండా అడ్డుకో !!ఒక్కటి మాత్రం నిజం..నీ లైఫ్ అయిపోయిందని భావిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్లు సాయంత్రానికల్లా నీకు సమాధి సిద్ధం చేస్తారు..
నీకు నువ్వు కారణ జన్ముడిగా భావిస్తే..నీ ఆలోచనలు, నీ భావాలు నీ చర్యలు ధైర్యంగా ఉంటే సమాధి బదులు సన్మానాలతో సిద్ధంగా ఉంటావు ..
????????
చివరిగా మరొక్క మాట .ద్వేషం వద్దు అది హృదయాన్ని నాశనం చేస్తుంది దురాశ "వద్దు,అది సంస్కారాన్ని దిక్కరిస్తుందిభేదభావం" వద్దు,అది మనుష్యుల మధ్యఅగాధాన్ని సృష్టిస్తుంది.స్వార్ధం వద్దు."అది జీవితాన్నే మింగేస్తుంది
ఇవన్నీ వద్దునకునే ప్రతి మినిషి "గొప్పవాడే"
సేకరణ. మానస సరోవరం
Sunday, August 28, 2022
భారత సూర్య నమస్కారానికి అరుదైన ఘనత ...
#భారత సూర్య నమస్కారానికి అరుదైన ఘనత ..
పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.
పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.
సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి.
ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .
వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .
శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం.
#ముఖ్య సూత్రం .
ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి.
#జాగ్రత్తలు
ఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె , రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు.
#సూచనలు
ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు ' పవనముక్తాసన శ్రేణి' భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి . పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి.
అలా కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి.
సూర్యనమస్కారాలను సాయంత్రం వేళల్లో చేయకూడదు .
సూర్యుని వైపు తిరిగి, వేకువఝామునే సూర్య నమస్కారాలు చేయడాన్ని అభ్యసించాలి.
ఆసనాలు:
1. ప్రణామాసనం
నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.
' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .
ప్రయోజనాలు :
ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది.
2.హస్త ఉత్థానాసనం
శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి.
ప్రయోజనాలు :
వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.
3. పాదహస్తాసనం
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి.
జాగ్రత్తలు:
మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది .
ప్రయోజనాలు:
ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది.
4.అశ్వ సంచలనాసనం
లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి.
జాగ్రత్తలు :
ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది.
ప్రయోజనాలు :
శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. .
5.సంతులనాసనం
నాలుగవ స్థితి నుండి గాలి నెమ్మదిగా వదులుతూ కాలివేళ్లు నేలను తాకుతూ, ఎడమకాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్ళు రెండు నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్లు బోర్లించిన v ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలివేళ్ల పైన అరచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి. ' ఓం ఖగయే నమః' ' అనాయాసంగా సాగిపోయే దైవానికి వందనాలు' అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.
జాగ్రత్తలు : అనాయాసంగా సాగిపోయే దైవానికి దైవానికి వందనాలు" అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.
ఎక్కువమంది ఈ ఆసనం వేసేటప్పుడు శరీరాన్ని చెక్కలా వంగకుండా ఉంచడం మరుస్తారు . కటి భాగాన్ని పైకి ఎత్తి ఉంచుతారు. అలా చేయకూడదు. దీనివల్ల శరీరం బరువు తగ్గదు. శరీరాన్ని వంచకుండా స్టిఫ్ గా ఉంచడం మరవకూడదు.
ప్రయోజనాలు:
ఈ ఆసనం వేస్తే మణికట్టుకు బలం వస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని ఇస్తుంది. వెన్నెముకకు (క్రింది భాగానికి) బలాన్ని అందిస్తుంది. అందువల్ల అనేక రుగ్మతలు తొలగుతాయి.
6.అష్టాంగ నమస్కారం:
అర చేతులను, కాలి వేళ్ళను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్ళను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది.
' ఓం పూష్ణే నమః' ' సర్వులకు పోషకుడైన నీకు వందనం' అనే భావంతో మంత్రాన్ని జపించాలి.
జాగ్రత్తలు:
కడుపు, కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎడ్రినల్ గ్రంథులకు విశ్రాంతినిస్తుంది. హార్మోనులను సక్రమంగా పని చేయిస్తుంది.
7.భుజంగాసనం:
అష్టాంగ నమస్కారం వలె ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి., మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి.
' ఓం హిరణ్యగర్భాయ నమః ' విశ్వ ప్రతినిధియైన నీకు నమస్కారం' అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని మననం చెయ్యాలి.
జాగ్రత్తలు :
ఈ భంగిమ చివరిలో మోచేతులను చాచకూడదు. ఉదరాన్ని నేలకు అణచి ఉంచాలి.. అలా చేయడం వల్ల ఉదర గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి.
ప్రయోజనాలు:
ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్ సమతుల్యం, యురోజెనిటల్ సమస్యలు - ముఖ్యంగా ఋతుక్రమ సంబంధమైన, ఋతువాగి పోవడం వలన వచ్చే సమస్యలకు ఈ భంగిమ అమోఘంగా పని చేస్తుంది . తొడలు , పిరుదులు, శరీరం వెనుకభాగాన్ని ఈ ఆసనం తీర్చిదిద్దుతుంది .
8.పర్వతాసనం :
పద్మాసనం లో కూర్చునే విధంగా కూర్చుని రెండు చేతులను ఒక చోట చేర్చి చిత్రంలో చూపిన విధంగా చేతులను సాగదీస్తూ పైకి ఎత్తాలి.
ప్రయోజనాలు :
వెన్నెముకకు ఇది మంచి వ్యాయామం , ఫలితంగా వెన్నునొప్పులకి ఇది ఔషధంలా పని చేస్తుంది.
జాగ్రత్తలు : కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ వ్యాయయం చేయకూడదు .
9.అశ్వసంచాలనాసనం :
పై ఆసనాల నుండి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి కుడికాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుఱ్ఱం ఆకారం వలె ఉంటుంది.
' ఓం ఆదిత్యాయ నమః' 'విశ్వ సుతుడైన నీకు ప్రణామం' అనే మంత్రం స్మరణీయం.
ప్రయోజనాలు: ఈ ఆసనం వలన ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది. కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
10.పాద హస్తాసనం
అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి అభ్యసించాలి. పై వివరాలే దీనికీ వర్తిస్తాయి.
' ఓం పవిత్రే నమః ' ' చైతన్యం కలిగించే వానికి ప్రణామం' అన్న భావాన్నిచ్చే మంత్రం అనుకోవాలి.
ప్రయోజనాలు :
శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, టైమర్ ఎడ్రినల్, మరియు యూరో జెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను సంతాన సాఫల్యాన్ని, శ్వాసక్రియ మెరుగుపరచడం , ఈ ప్రక్రియ వల్ల కలిగే ఉపయోగాలు.
11.హస్త ఉత్థానాసనం
పై భంగిమ నుండి రెండు చేతులను తల పైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుకభాగం వద్ద కొద్దిగా వంగాలి. ' ఓం ఆర్కాయ నమః ' ' శక్తిప్రదాతకు నమస్సులు ' అనే భావాన్నిచ్చే మంత్రాన్ని జపించాలి.
ప్రయోజనాలు :
వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది.
ఛాతీని తెరచి ఉంచుకోవాలి, శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది . టైమస్, థైరాయిడ్, వంటి గ్రంథుల పై బాగాపని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం , మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.
12.ప్రణామాసనం
శ్వాసను వదులుతూ రెండు అర చేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి చాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తి అయినట్లే.
' ఓం భాస్కరాయ నమః ' ' గురువుకు అభివాదం' అనే భావంలో జపం చెయ్యాలి.
మానవులు చేసే రెండు ముఖ్యమైన తప్పిదములు. మొదటిది ఆత్మస్తుతి రెండవది పరనింద.
మానవులు చేసే రెండు ముఖ్యమైన తప్పిదములు.
ప్రతి మానవుడు కూడా తన జీవితం లో, రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు...సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తుంటాడు...
మొదటిది ఆత్మస్తుతి
రెండవది పరనింద.
...రెండూ తప్పులే, మనిషి తానెంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ తనను తాను పొగుడుకోకూడదు.
"ఇన్ద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః"
దేవతల అధిపతి ఆయన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే ప్రస్తుతించుకుంటే చాలా చులకన అవుతాడని చెప్తారు. అందువలన ఎట్టి పరిస్థితుల లోను మానవుడు ఆత్మస్తుతి చేసుకోకూడదు.
ఇతరులను నిందించటమూ పెద్ద పాపమే. ఒక మనిషిని హత్య చేసిన దానికంటే ఇది ఎక్కువ పాపం.
ఇందుకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణునితో యుద్ధం చేయటం ధర్మరాజుకు చాలా కష్టమైంది. ఆ కష్టానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్దభూమి నుండి వెనుదిరిగి శిబిరానికి వెళ్ళిపోయాడు.యుద్ధభూమిలో ధర్మరాజు కనపడక అర్జునుడు చాలా చింతించాడు. అతని కోసం వెదికి వెదికి చివరికి శిబిరంలో కనుగొన్నాడు.
ధర్మరాజు వెంటనే 'కర్ణుని చంపావా లేదా..' అని అర్జునుడిని ప్రశ్నించాడు. లేదు అని అర్జునుడు సమాధానం మిచ్చాడు. తాను ధర్మరాజును వెతుకుతూ అక్కడికి వచ్చానని చెప్పాడు. అప్పుడు కోపంతో ధర్మరాజు ఇలా అన్నాడు.'కర్ణుని చంపలేకపోతే నీకు గాండీవమెందుకు.. దండగ.. దానిని ఎవరికైన దానం చేయి'..
ఆ మాటలు వినగానే అర్జునుడి మనస్సు గాయపడింది. అతడు శ్రీ కృష్ణుని ఇలా ప్రశ్నించాడు. 'నా గాండీవాన్ని త్యజించమన్న వారిని చంపుతానని నేను శపధం పట్టాను, అందువలన నేను ధర్మరాజుని చంపాలి, కానీ ఆయన నా అగ్రజుడు. ఇప్పుడు నా శపథాన్ని నెరవేర్చు కొనడమెలా..'
అర్జునుని ప్రశ్నకు శ్రీ కృష్ణుడు ఇలా సమాధానం మిచ్చాడు.
'ధర్మరాజు వంటి మహా పురుషుని చంపాలను కోవటమే మహాపాపం, కానీ నీ శపథాన్ని నెరవేర్చక తప్పదంటున్నావు. నీవు ధర్మరాజును ఎటువంటి కారణం లేకుండానే నిందించు. అలా నిందించటమే హత్య చేసినట్లు' అని..
దీని నుండి ఒక వ్యక్తిని నిందించటం అంటే అతనిని హత్య చేయటం కంటే ఘోరమైన పాపమని మనకు తెలుస్తుంది. అందువలన మనల్ని మనం పొగుడుకోవటం, ఇతరులను నిందించటం మనం చేయకూడని పనులు. మన జీవితంలో ఆ రెండు తప్పులు ఎప్పుడూ చేయకూడదు.
యదీచ్చసి వశే కుర్తం జగదేకేన కర్మణా |
పరాపవాద సస్యేభ్య: గాశ్చరన్తీర్నివారయ ||
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం మానివేస్తే ప్రతియొక్కడు నీవాడవుతాడు...
శ్రీ కృష్ణుడు చెప్పిన విధంగా అర్జునుడు , తన శపథం తీర్చుకునే క్రమంలో ధర్మరాజు వద్దకు వెళ్లి పరుష పదాలతో నిందిస్తాడు.. తాము పడుతున్న సకల కష్టాలకు , జూదంపై ధర్మరాజుకు ఉన్న ఆసక్తే కారణమని అంటాడు...భార్య, సోదరులను జూదంలో తాకట్టు పెట్టిన వాడివని నిందిస్తాడు.
ఎన్నడూ తమ్ముని నోటివెంట అటువంటి పరుష పదాలను వినని ధర్మరాజు హతాశుడై నిశ్చేష్టుడౌతాడు.
అర్జునుడు కూడా ఆవేశంలో పలికిన తన పరుషపదాలకు ఆవేదన చెందుతాడు....పితృ సమానుడైన తన అన్నను, అనరాని మాటలు తన నోటివెంట అనిపించిన శ్రీకృష్ణునిపై పట్టరాని కోపం వస్తుంది...శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి 'నీ మాటలు విని పితృ సమానుడైన అన్నను అనరాని మాటలు అన్నాను..నా పాపానికి నిష్కృతి లేదు.నాకు మరణమే మార్గం నేను ప్రాయోపవేశం చేస్తాను ' అంటాడు..
అప్పుడు శ్రీకృష్ణుడు వారించి ' దీనికీ ఒక మార్గమున్నది..పరనింద ఎలాగో ఆత్మస్తుతి కూడా మరణంతో సమానం అనే అంటారు...అందుకని, నీ గురించి నువ్వు పొగడుకుంటే మరణించినట్టే..దానికిది సరిపోతుంది ' అని అంటాడు... అప్పుడు మళ్లీ అర్జునుడు తేరుకుని సోదరుల వద్దకు చేరుకుని' పాండవులు అందరిలో నేనే గొప్పవాడిని..నేను లేకుంటే పాండవులకు మనుగడనే లేదు. నా గాండీవం , నా విలువిద్య వీటి వల్లనే పాండవులకు రక్షణ కలుగుతున్నది.అసలు నేను లేకపోతే పాండవులకు దిక్కులేదు ' అని ప్రగల్భాలు పలుకుతాడు.. సకల చరాచార సృష్టికర్త, సకల భువన సంచాలకుడు అయిన జగన్నాథుడు శ్రీకృష్ణుడు మాత్రం ,అన్నీ వింటూ చిరునవ్వులు చిందిస్తాడు..
నానాటికి విలువలు తగ్గుతున్న వర్తమాన సామాజిక పరిస్థితులలో , ప్రభాతవేళ ఇటువంటి సందేశాలు , కొంతవరకైనా ప్రభావితం చేస్తాయని ఆశిద్దాం...